తల్లిని చితకబాది, కూతురిపై గ్యాంగ్ రేప్ | Girl abducted, raped by 3 youths | Sakshi
Sakshi News home page

తల్లిని చితకబాది, కూతురిపై గ్యాంగ్ రేప్

Published Mon, Jul 11 2016 2:59 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

తల్లిని చితకబాది, కూతురిపై గ్యాంగ్ రేప్

తల్లిని చితకబాది, కూతురిపై గ్యాంగ్ రేప్

ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో మరో అత్యాచార ఘటన జరిగింది. షామ్లీ జిల్లాలోని తనభవన్లో ముగ్గురు దుండగులు ఇంట్లో నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థిని బలవంతంగా లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. ఆదివారం బాధితురాలి తండ్రి పనిమీద బయటకువెళ్లిన సమయంలో దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలి తల్లిని చితకబాది, బాలికను కిడ్నాప్ చేసి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను దీపక్, సతీష్, జోనిలుగా గుర్తించారు. కాగా నిందితులను ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ కేసును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement