
ప్రతీకాత్మక చిత్రం
గుంటూరు: దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై సుబ్బయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటంతో స్థానికులు నార్కట్‌పల్లి-అద్ధంకి రహదారిపై బైఠాయించి వృద్ధుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ముస్లిం సంఘాల నాయకులు బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గురువారం మధ్యాహ్నాంలోపు అరెస్ట్ చేస్తామని హమీ ఇవ్వడంతో గురువారం ఉదయం ఆందోళన విరమించారు. బాలికపై అత్యాచారానికి నిరసనగా గురువారం దాచేపల్లి బంద్‌కు స్థానికులు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment