Dachepalle
-
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు.పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉండగా, 20 మంది రౌడీలతో పోలింగ్ బూత్‌కు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. మహిళలను వెనక్కి పంపి పోలింగ్ ఆపాలంటూ జూలుం ప్రదర్శించారు. -
వివాహేతర సంబంధం.. పిల్లలను బంధువుల ఇంటికి పంపి..
దాచేపల్లి (గుంటూరు): భార్యను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. ఈ దుర్ఘటన గురువారం పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రాంతంలో ఉంటున్న చల్లా నాగమణి(28), రమేష్ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు అఖిల్‌సాయి, లోకేష్ ఉన్నారు. కొంతకాలంగా నాగమణి వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న రమేష్ ఆమెతో గొడవ పడుతున్నాడు. కుటుంబ పెద్దల వద్ద కూడా ఈ విషయంపై పంచాయితీ పెట్టాడు. ఈ నేపథ్యంలో పిల్లలను బంధువుల ఇంటికి పంపారు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కత్తితో రమేష్ నాగమణిపై దాడి చేసి విచక్షణా రహితంగా నరికాడు. రక్తపుమడుగులో పడి నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో రమేష్ పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ రహ్మతుల్లా ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నాగమణి తల్లి జెట్టిపాటి చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రహ్మతుల్లా చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి ఆధారాలు సేకరించారు. చదవండి: (బాలిక ప్రాణం తీసిన ఇన్స్టాగ్రాం.. అసభ్య మెసేజ్‌లు పోస్టు చేస్తూ..) -
తెలంగాణ కానిస్టేబుల్ 'అక్రమ రూట్'
దాచేపల్లి(గురజాల): పెట్రోలింగ్ వాహనంతో అక్రమంగా మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్న తెలంగాణ కానిస్టేబుల్‌ను దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను ఎస్ఐ షేక్ రహ్మతుల్లా గురువారం విలేకరులకు వెల్లడించారు. శ్రావణ్‌కుమార్ తెలంగాణలోని వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 14వ తేదీ రాత్రి 650 మద్యం సీసాలతో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చాడు. పోలీస్ వాహనం కావడంతో రాష్ట్ర సరిహద్దులో సిబ్బంది తనిఖీ చేయకుండా వదిలిపెట్టారు. శ్రావణ్ ఆ మద్యం సీసాలను రామాపురం అడ్డరోడ్డు సమీపంలోని పొదల్లో దాచిపెట్టాడు. అనంతరం పెట్రోలింగ్ వాహనాన్ని తాను పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్‌లో వదిలేసి.. మద్యం సీసాలు దాచిన ప్రదేశానికి తిరిగి చేరుకున్నాడు. వాటిని తీసుకెళ్లేందుకు నరసరావుపేటకు చెందిన కోటేశ్వరరావు కూడా అప్పటికే అక్కడకు వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు దాడిచేసి వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని, కోటేశ్వరరావు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
కిక్కిరిసిపోతున్న ఓటర్ క్యూ లైన్..
-
ఊపిరి తీసిన ఊయల తాడు
సాక్షి, దాచేపల్లి/గుంటూరు: ఊయల ఊగుతుండగా తాడు గొంతుకు బిగుసుకోవడంతో ఓ చిన్నారి మృత్యు ఒడికి చేరింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు సుగాలి కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన మూఢావత్ బద్దునాయక్, కమలాబాయి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం కాగా రెండో కుమార్తె కూలి పనులకు వెళుతోంది. మిగిలిన ముగ్గురు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హైస్కూల్లో చదువుకుంటున్నారు. వీరిలో చిన్న కుమార్తె అయిన మూఢావత్ సిరి (10) ఐదో తరగతి చదువుకుంటోంది. ఆదివారం సెలవు కావటంతో ఇంటి వెనుక భాగంలో ఉన్న పశువుల కొట్టంలో వెదురు బొంగుకు తాడును కట్టి ఊయల ఊగుతోంది. ఆ క్రమంలో తాడు జారిపోయి బాలిక గొంతుకు బలంగా బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక సిరి మృతి చెందింది. పశువుల కొట్టం మీదుగా వెళుతున్న వ్యక్తులు సిరి తాడుకు వేలాడుతున్న విషయాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అయితే అప్పటికే బాలిక చనిపోయింది. కుటుంబ సభ్యులంతా భోరున విలపిస్తున్నారు. -
గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో దాడి
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
దాచేపల్లి (గురజాల): అధికార మదంతో టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు గొడ్డళ్లు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తపల్లి యోహాను, కాటుపల్లి భూషణం, కొత్తపల్లి పిచ్చయ్య, మామిడి అబ్రహాం, కొత్తపల్లి రాజా, దైద నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నాగరాజు మినహా మిగిలిన వారికి పరిస్థితి విషమం ఉంది. వీరు వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉండడం, పార్టీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి గ్రామంలో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయడంతోపాటు పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేస్తుండటం వల్లే టీడీపీ నేతలు కక్షతో దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. పథకం ప్రకారమే దాడి తంగెడ గ్రామానికి చెందిన యోహాను, భూషణం, పిచ్చయ్య, అబ్రహాం, రాజా, నాగరాజు మరికొంత మంది గ్రామంలో తాము రోజూ కలుసుకునే అరుగుపై కూర్చొని ఉన్నారు. అదేసమయంలో టీడీపీ నాయకులు కొత్తపల్లి దీనరాజ్, దైద యోగేశ్వరరావు, కొత్తపల్లి భాస్కరరావు, దైద వెంకటరత్నం, దైద దయానందం, దైద కిరణ్, కొత్తపల్లి మరియదాసుతో పాటు మరో 20 మందికి పైగా వైఎస్సార్సీపీ కార్యకర్తల వద్దకు వచ్చి దుర్భాషలాడారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఇలా మాట్లాడడం మంచిది కాదని వైఎస్సార్సీపీ కార్యకర్తలు చెబుతుండగానే అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న గొడ్డళ్లు, ఇనుపరాడ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల బంధువులు వెంటనే 108 వాహనానికి సమాచారామిచ్చి వారిని గురుజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని గుంటూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. ఎస్సై అద్దంకి వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని సందర్శించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. దాడిని ఖండించిన కాసు, జంగా తంగెడ గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి తెగబడడాన్ని వైఎస్సార్ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్‌రెడ్డి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్లలో అనేక మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని, వీటికి ప్రతిఫలం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో టీడీపీ నేతలు గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని, దాడులను అందరం ధైర్యంగా ఎదుర్కొందామని చెప్పారు. -
దాచేపల్లిలో మరో ఘోరం
దాచేపల్లి/గురజాల: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో ఘోరం వెలుగు చూసింది. అభం శుభం తెలియని 12 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడొకరు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దాచేపల్లికి చెందిన టీడీపీ నేత షేక్ మాబువలి 2013లో ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ఓటమి పాలయ్యాడు. దీంతో టీడీపీ అధికారంలోకి రాగానే అతన్ని మండలపరిషత్‌లో కోఆప్షన్ సభ్యుడిగా నియమించింది. స్థానిక జలగల బజారులో వ్యాపారం చేస్తుంటాడు. బాధిత బాలిక తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆమె 7వ తరగతితో చదువు మానేసింది. బాలిక తండ్రి మట్టికుండలు తయారుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత బాలిక తన అక్కతో పాటు మాబువలి వద్దకు కూలి పనులకు వెళ్తోంది. దీంతో సదరు బాలికను మాయమాటలతో లోబర్చుకుని గత కొన్నినెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. మూడు రోజులక్రితం కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో ఆమె అక్క ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక వెల్లడించింది. అధికారపార్టీ నేత కావడంతో కేసు పెట్టేందుకు బాలిక కుటుంబసభ్యులు భయపడ్డారు. స్థానికులు ధైర్యం చెప్పడంతో శనివారం దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో బాలికను వైద్యపరీక్షలకోసం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇటీవల దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు సుబ్బయ్య ఇంటిసమీపంలోనే ఇప్పుడు లైంగిక దాడికి గురైన బాలిక ఇల్లు కూడా ఉండడం గమనార్హం. లైంగికదాడికి గురైన బాలిక 3 నెలల గర్భిణి అని నివేదికలు చెబుతున్నాయని.. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు ఫోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్ చేసినట్టు గురజాల డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. మరోవైపు చిన్నారికి జరిగిన అన్యాయంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు వివిధ ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. గురజాలలో వైద్యశాల నుంచి ర్యాలీగా బయల్దేరి బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ నినదించాయి. నా బిడ్డకు న్యాయం చేయండయ్యా: బాధితురాలి తండ్రి తన బిడ్డకు జరిగిన అన్యాయంపై బాలిక తండ్రి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ‘అయ్యా! నా బిడ్డ చిన్నతనంలో ఉండగానే తల్లి చనిపోయింది. స్తోమత లేక ఏడు వరకే చదివించుకుని బడి మాన్పించేశా.. పనికెళ్లి నాకు అండగా ఉంటోంది. జరిగిన విషయం తలచుకుంటే నాకు గుండె దడ వస్తుందయ్యా.. తల్లి లేని బిడ్డ.. మీరే న్యాయం చేయాలయ్యా’’ అంటూ రెవెన్యూ అధికారులను వేడుకుంటున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
మగువలపై అంతేలేని అఘాయిత్యాలు
సాక్షి నెట్వర్క్: ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన బాల్యం మృగాళ్ల విష కౌగిట్లో చిక్కుకుంటోంది. సుకుమారమైన లేతప్రాయం కామాంధుల ఉక్కు పిడికిళ్ల మధ్య నలిగిపోతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఐదు రోజుల క్రితం 9 ఏళ్ల చిన్నారిపై 55 ఏళ్ల వృద్ధుడు సాగించిన అత్యాచారం గురించి విని చెమర్చని కళ్లు లేవు, మౌనంగా రోదించని హృదయాలు లేవు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలకు అంతే ఉండడం లేదు. పసిపిల్లల నుంచి పండుటాకుల దాకా.. ఎవరూ లైంగిక దాడుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రతి జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వెలుగులోకి రాని కేసులు అంతకు ఇంకెన్నో రెట్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. విషాదం ఏమిటంటే.. బాధితుల కన్నీరు ప్రభుత్వాన్ని, పాలకులను కదిలించలేకపోతోంది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడుల నియంత్రణకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలేవీ తీసుకోకపోవడంతో కామాంధులు రెచ్చిపోతున్నారు. సర్కారు అలసత్వం, మగువల పట్ల నిర్లక్ష్యం వారికి వరంగా మారుతోంది. నాలుగేళ్లలో లైంగిక దాడి కేసులు వేల సంఖ్యలో నమోదు కావడమే ఇందుకు నిదర్శనం రాష్ట్రంలో నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే అతివలపై అత్యాచారాలు పెరగడమే తప్ప ఎక్కడా ఇసుమంతైనా తగ్గలేదని స్పష్టమవుతోంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ మహిళలపై అఘాయిత్యాలు జరగబోవంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దాచేపల్లి ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తడం, అత్యాచారాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించడంతో సీఎం చంద్రబాబు నష్టనివారణ కోసం ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్లుగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏనాడూ స్పందించకపోవడం గమనార్హం. గుంటూరు జిల్లా ⇔ 2018 మార్చి 22న మాచర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల బాలూ నాయక్ అత్యంత అమానుషంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావమై చిన్నారి మృతి చెందింది. ⇔ తెనాలిలో నరసింహా అనే 25 ఏళ్ల యువకుడు 10, 12 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు మైనర్ బాలికలను పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ⇔ గుంటూరు నగరం విద్యానగర్ 3వ లైనుకు చెందిన 13, 14 ఏళ్ల వయస్సు ఉన్న ఆరుగురు మైనర్ బాలురు అదే కాలనీకి చెందిన ఆరేళ్ల పాపపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ⇔ కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామంలో ఏప్రిల్ 23న రాత్రి మైనర్ బాలుడు వివాహిత ఇంటిలోకి ప్రవేశించి నోట్లో గుడ్డలు కుక్కి రాత్రంతా మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ⇔ నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన గోళ్లమూడి లక్ష్మయ్య అనే టీడీపీ నాయకుడు అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల మూగ, మానసిక వైకల్యం ఉన్న యువతిపై ఏప్రిల్ 23వ తేదీ రాత్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా ⇔ 2014 పిబ్రవరి 12న గుడిపాల మండలంలోని తుమ్మలవారిపల్లె హరిజనవాడకు చెందిన 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన బాషా అలియాస్ నరేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇔ 2015లో చిత్తూరు నగరంలో స్థానిక షర్మన్ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయురాలి భర్త అత్యాచారం చేశాడు. ⇔ 2016 జూలై 23 ఇరువారం దళితవాడకు చెందిన ఓ మైనర్ బాలికను దుండగులు అపహరించి అత్యాచారం చేశారు. ⇔ 2017 ఫిబ్రవరిలో పల్లూరు మూలచేనుకు చెందిన 13 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణి అనే వ్యక్తి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. విశాఖ జిల్లా ⇔ 2017 అక్టోబర్ 22న విశాఖ నగరంలోని రైల్వే న్యూకాలనీ సమీపంలో పట్టపగలు ఒక వృద్ధురాలిపై శివగంజీ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ⇔ 2017 మే 24న 19 ఏళ్ల యువతిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ⇔ 2018 జనవరి 11న కైలాసపురం లక్ష్మీనారాయణపురంలో అనారోగ్యంతో మంచంపై కదలలేది స్థితిలో ఉన్న 65 ఏళ్లే వృద్ధురాలిపై అప్పన్న (55) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇔ విశాఖ జిల్లా రూరల్ పరిధిలో గత రెండేళ్ల 38 లైంగిక దాడుల కేసులు నమోదయ్యాయి. ⇔ జిల్లాలోని నర్సీపట్నం, కొయ్యూరు, చింతపల్లి, అరకు, సీలేరు ప్రాంతాల్లో అత్యాచార ఘటనలు సంచలనం సృష్టించాయి. ⇔ 2017 మే 15న చింతపల్లిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. సీలేరులో అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లిన ఒక బాలికపై అత్యాచారం చేశారు. వైఎస్సార్ జిల్లా ⇔ 2014 మే 5న రైల్వేకోడూరు సమీపంలోని మైసూరావారిపల్లి పంచాయతీ శాంతీనగర్‌లో నివాసముంటున్న నాలుగేళ్ల చిన్నారిపై షేక్చాను లైంగికదాడికి పాల్పడ్డాడు. ⇔ 2015లో పెనగలూరు మండలం నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన బాలిక(15)పై మల్లికార్జున అనే యువకుడు అత్యాచారం చేశాడు. ⇔ 2015లో పెనగలూరు మండలం ఈటమాపురం తూర్పుపల్లెకు చెందిన 20 ఏళ్ల దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ⇔ 2016 మార్చి 8న కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడు లైంగిక దాడి చేశాడు. ⇔ 2016లో పెనగలూరు మండలం నల్లపురెడ్డి పంచాయతీ నడింపల్లెకు చెందిన బాలిక(19)పై అదే గ్రామనికి చెందిన వెంకటరమణ లైంగిక దాడి చేశారు. ⇔ మైదుకూరు నియోజకవర్గం బ్రహంగారి మఠం మండలంలో 2014 నుంచి 2018 వరకు మే వరకు బాలికలపై నాలుగు చోట్ల అత్యాచాలు జరిగాయి. ⇔ 2016లో పాపిరెడ్డిపల్లె గ్రామంలో శివ అనే వ్యక్తి 15 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ⇔ 2015 నవంబరు 6న చాపాడు మండలం చియ్యపాడు గ్రామంలోరజక కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలికపై వీరరాఘవరెడ్డి అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. కృష్ణా జిల్లా ⇔ పెనమలూరు నియోజకవర్గం కానూరు గ్రామంలో గతేడాది వినాయకచవితి పండుగ రోజున భవన నిర్మాణ కార్మికుడి పదేళ్ల కుమార్తెపై అక్కడే పని చేస్తున్న ఒడిశాకు చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ⇔ 2017 జూన్‌లో కంచికచర్లలో మైనర్ బాలికపై లైంగికదాడి జరిగింది. ⇔ 2017 జూలై 18న చెవిటికల్లులో మైనర్ బాలికపై దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. ⇔ 2018 జనవరి 11న కంచికచర్లలో బాలికపై అత్యాచారం చేశారు. ప్రకాశం జిల్లా ⇔ పర్చూరు నియోజకవర్గం పర్చూరు మండలం చింతకుంటవారిపాలెంలో కన్నకూతురిపై ఏడాది కాలంగా లైంగిక దాడి సాగిస్తున్న తండ్రికి 2016 ఏప్రిల్ 18న న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ⇔ పర్చూరు మండలం ఏదుబాడు గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 60 ఏళ్ల వృద్ధుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ⇔ గత ఏడాది ఆగస్టులో కనిగిరి నియోజకవర్గం పీసీ పల్లి మండలం ఇర్లపాడులో ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి, ఆపై హత్య కేసు సంచలనం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా ⇔ 2015 జూన్ 18న ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఇందిరా కాలనీలో సురేష్ అనే వ్యక్తి ఏడేళ్ళ బాలికపై అత్యాచారం, హత్య. ⇔ 2016లో తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఓ మహిళపై కొందరు వ్యక్తులు లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ⇔ 2017లో మేలో నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామ శివారున చెరుకుతోటలో ఓ యువతి హత్యాచారానికి గురైంది. తెల్లవారితే ఆ యువతికి పెళ్లి జరగాల్సివుండగా అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ⇔ 2017లో నిడదవోలు మండలం పురుషోత్తపల్లి గ్రామంలో 7వ తరగతి చదువుతున్న బాలికలపై అదే గ్రామానికి చెందిన యువకుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. ⇔ 2018 ఏప్రిల్ 29న పోలవరం మండలం గాజులగొంది గ్రామంలో5 ఏళ్ల గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన నేరం శేఖర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ⇔ 2016లో పిఠాపురం మండలం నరిసింగపురంకు చెందిన మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ఎండ్ల భీమరాజు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ⇔ 2016 ఆగస్టు 19న కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు మూడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ⇔ 2017జూన్ 23వ తేదీన కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన 14ఏళ్ల బాలికలపై 19ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. ⇔ 2017 డిసెంబర్ 6న చింతూరు మండలం విద్యానగరం ఆశ్రమ పాఠశాల వార్డెన్ లక్ష్మయ్య అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ⇔ 2018 మే 2న కత్తిపూడి గ్రామానికి చెందిన టీడీపీ నేత, ఎంపీటీసీ భర్త శ్రీనివాస్, మరో ముగ్గురు వ్యక్తులు తొండంగి మండలం తమ్మయ్యపేట గ్రామంలోని జాతీయ రహదారి వద్ద టీ దుకాణం నడుపుతున్న మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా ⇔ 2016లో కల్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో టీడీపీ నాయకుడు రాము కుమారుడు, మైనర్ బాలుడు బోయ సాయికీర్తి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ⇔ 2014 సెప్టెంబర్ 8న శెట్టూరు మండలం బలపంపల్లిలో మైనర్ బాలికపై ఈరన్న అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. ⇔ 2017 ఆగసు6న కంబదూరు గ్రామంలో రామాంజినేయులు అనే వ్యక్తి తన కుమార్తెపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇔ 2018 మార్చి 18న తాడిపత్రి పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారిపై శేషాద్రి(28) అనే వ్యక్తి ఆత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ⇔ 2017 నవంబర్ 3న పెద్దవడుగూరు మండల పరిధిలోని కొండూరులో ఓ దళిత వివాహితపై సుంకిరెడ్డి అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ⇔ 2015 ఏప్రిల్ 25న యాడికి మండల కేంద్రంలోని కొండకింద గేరి వీధిలో9 ఏళ్ల మైనర్ బాలికపై లింగం ఓబులేసు అనే వ్యక్తి అత్యాచారయత్నానికిపాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా ⇔ 2014 జనవరి 23న తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జునపురంలో ఇద్దరు యువకులు ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ⇔ 2015 ఫిబ్రవరి 6న నెల్లూరు నగరంలోని సీఆర్పీ డొంకలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. ⇔ ఫిబ్రవరి 4న వెంకటాచలంలో గిరిజన బాలికలపై వరుసకు తండ్రి అయ్యే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ⇔ 2017 ఆగస్టు 22న ఓజిలి మండలం కుందాల గ్రామంలో అంకయ్య అనే వ్యక్తి తన కుమార్తెను ఇంట్లో నిర్బంధించి తరచూ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఫలితంగా సదరు చిన్నారి గర్భం దాల్చింది. ⇔ 2017సెప్టెంబర్ నెల్లూరు సుందరయ్యకాలనీలో కుమార్తెపై కన్న తండ్రి సుబ్బారావు లైంగిక దాడిచేశాడు. ⇔ 2018 మే 3న బుచ్చిరెడ్డిపాళెంలో ఎనిమిదేళ్ల గిరిజన బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా ⇔ 2014లో హాలహర్విలో గోపాలప్ప అనే వృద్ధుడు 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. ⇔ 2015లో కర్నూలులోని ఓల్డ్‌సిటీకి చెందిన 7 ఏళ్ల బాలికపై ఖాజాఖాన్ అనే కామంధుడు అత్యాచారం చేశాడు. ⇔ 2017 సెప్టెంబర్ 10న ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామానికి చెందిన కొప్పుల నాగేంద్ర అనే యువకుడు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇔ 2017 నవంబర్‌లో కర్నూలుకు చెందిన మహిళపై కొడుకు వరసయ్యే పవన్ అనే విద్యార్థి అత్యాచారం చేసి బండరాయితో మోది చంపేశాడు. ⇔ 2018లో కర్నూలులో 13 ఏళ్ల బాలికపై చెన్నయ్య(55) అత్యాచారం. శ్రీకాకుళం జిల్లా ⇔ 2014 అక్టోబర్ 11న సారవకోట మండలం సూరపు లక్ష్మణరావు అదే గ్రామానికి చెందిన ఇక వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇔ 2015 జులై 29న పోలాకి మండలం చింతువానిపేటకు చెందిన ఇల్లప్ప అనే ఆటో డ్రైవర్ పదోతరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడి చేశాడు. ⇔ 2016 ఫిబ్రవరి 23న నరసన్నపేట పురుషోత్తంనగర్ కాలనీకి చెందిన వర్రు ఎర్రయ్య పోలాకి మండలం గుప్పడిపేటలో ఒక మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ⇔ 2017 జూన్ 30న నరసన్నపేట మండలం లింగాలపాడుకు చెందిన ఒక బాలికపై ఇదే మండలం చోడవరానికి చెందిన లోపింటి నాగరాజు అత్యాచారానికి ఒడిగట్టాడు. ⇔ 2018 ఏప్రిల్ 21న సీతంపేట మండలం సోమగండి గ్రామానికి చెందిన గంటా సంతోష్ అనే వివాహితుడు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం. విజయనగరం జిల్లా ⇔ గత నాలుగేళ్లలో గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలంలో 6 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ⇔ 2014 మే 22న నరవ గ్రామంలో 20 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన సుంకర భూలోక రాజు అత్యాచారం చేశాడు. ⇔ 2015లో సిరిపురం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతిని కర్రుబోతు రమణ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. అవసరం తీరాక వదిలేశాడు. ⇔ 2017 మార్చి 4న నరవ గ్రామంలో ఓ బాలికపై టి.గణేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇔ 2017 ఆగస్టు 20న కె.వెలగాడ గ్రామంలో 9 ఏళ్ల బాలికపై కోనూరు శ్రీను అత్యాచారానికి పాల్పడ్డాడు. ⇔ 2018 ఫిబ్రవరి 2న చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం కొండపాలెంలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. -
నాగరిక ప్రపంచం సిగ్గుపడేలా దాచేపల్లి ఘటన
సాక్షి, గుంటూరు/గుంటూరు మెడికల్: ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఈ భూమి మీద అదే చివరి రోజు అవుతుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దాచేపల్లిలో ఈనెల 3న అత్యాచారానికి గురై జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికను శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంఘటన గురించి చెప్పుకోవడానికే సిగ్గుపడే విధంగా నీచమైన చర్యకు పాల్పడ్డాడని, ముఖ్యమంత్రిగా తాను ఎంతో బాధపడుతున్నానన్నారు. ఈ సంఘటన తర్వాత దాచేపల్లిలో ప్రజలు పెద్దఎత్తున రోడ్లపైకి చేరి బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఎవరైతే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడతారో వారిని మహిళలు బజారులో పట్టుకుని కుమ్మేయాలన్నారు. రాష్ట్రంలో ఇదే చివరి సంఘటన కావాలని, మరోసారి జరిగితే ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి నిందితులకు ఉరిశిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా.. బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని, ఇప్పటికే రూ.5 లక్షలు అందించామని, మరో ఐదు లక్షలు బాలిక పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని సీఎం చెప్పారు. అంతేకాక, రెండు ఎకరాల పొలం కొనిస్తామని, ఉపాధి కోసం బాలిక తండ్రికి ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగంతో పాటు, ఇల్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే, బాధితురాలిని చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో తొమ్మిది ఘటనలు జరిగాయని, వారిని ప్రభుత్వం ఆదుకోదా అని విలేకరులు ప్రశ్నించగా, వాటిని కూడా సమీక్షిస్తామని చెబుతూనే అది సరైన ప్రశ్న కాదంటూ విలేకరికి క్లాస్ పీకారు. సీఎం వెంట మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, డీజీపీ మాలకొండయ్య, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు అర్బన్, రూరల్ ఎస్పీలు విజయరావు, వెంకటప్పలనాయుడు ఉన్నారు. అల్పాహారం లేక అవస్థలు సీఎం పర్యటన సందర్భంగా కాన్పుల విభాగంలో చికిత్స పొందుతున్న వారికి ఆల్పాహారం పెట్టకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడ చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు ఉదయం 9గంటలకు సీఎం వస్తున్నట్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఎవరినీ అనుమతించలేదు. లోపలి వారిని బయటకు రానివ్వలేదు. ఫలితంగా అక్కడ చికిత్స పొందుతున్న వారికి అల్పాహారం అందలేదని గర్భిణులు, బాలింతల కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.దేవనబోయిన శౌరిరాజునాయుడిని ‘సాక్షి’ వివరణ కోరగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో అత్యాచారాలు, శాంతిభద్రతలపై సీఎం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అత్యాచారాలకు వ్యతిరేకంగా సోమవారం నిర్వహించే ప్రజా చైతన్య ప్రదర్శనల కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమమని, ఉన్మాదులపై పోరాటమని చెప్పారు. ‘ఆడబిడ్డలకు రక్షగా కదులుదాం’ పేరుతో నిర్వహించే ఈ ర్యాలీల్లో అందరూ పాల్గొనాలని కోరారు. -
అత్యాచారాలను అడ్డుకోలేని ప్రభుత్వమెందుకు?
సాక్షి నెట్వర్క్: దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగికదాడి విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలను అడ్డుకోలేని ప్రభుత్వం వద్దంటూ నినదించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పిలుపు మేరకు శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలిపారు. రాష్ట్రంలో అత్యాచారాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నినదించారు. నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తుండటం వల్లే దుర్మార్గులు రెచ్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఇటీవల కాలంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు క్షీణించాయి.. అత్యాచారాల ఘటనలపై ప్రభుత్వ తీరుకు గుంటూరు జిల్లాలో పార్టీ శ్రేణులు ఎండగట్టాయి. మానవ మృగాలను శిక్షించకుండా వారిని కాపాడే ధోరణిపై మండిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు కొవ్వొత్తుల ప్రదర్శనతో తమ నిరసనను వ్యక్తం చేశారు. వినుకొండ పట్టణంలో నిర్వహించన ర్యాలీలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, చిలకలూరిపేటలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, సత్తెనపల్లిలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, వేమూరులో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన మండిపడ్డారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ కేవీఆర్ పెట్రోల్ బంక్ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి నియోజవర్గంలోని దగదర్తిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. దాచేపల్లి ఉదంతంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. ప్రభుత్వానికి పతనం తప్పదు.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని.. వాళ్లతో కన్నీళ్లు పెట్టిస్తే పతనం తప్పదని వైఎస్సార్ సీపీ శ్రేణులు నినదించాయి. అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్థానిక నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. కడప ఏడురోడ్ల కూడలి వద్ద నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే అంజద్‌బాషా, రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ర్యాలీలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు తిరుపతి, చిత్తూరు, పూతలపట్టు, మదనపల్లె, సత్యవేడు, నగరి, పీలేరు, కుప్పం, చంద్రగిరి, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. బాలికలకు రక్షణలేదు.. అధికారం ఇస్తే మహిళలకు రక్షణ కల్పిస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక బాలికలకు కూడా రక్షణలేకుండా పోయిందని ప్రతిపక్షం మండిపడింది. విశాఖపట్నంలోని వేపగుంట వద్ద జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజాతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, రాజాం నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శలను జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాల్గొని ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వారి నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. శనివారం రాత్రి కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురు కృష్ణా జిల్లా నేతలు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బహిరంగ సభ ముగిసిన అనంతరం జరిగిన ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. -
యూట్యూబ్ వచ్చాక అది సులువైంది: చినరాజప్ప
సాక్షి, కాకినాడ: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్ప స్పందించారు. దాచేపల్లి, తమ్మయ్యపేట సంఘటనలు చాల సున్నితమైనవని పేర్కొన్నారు. రౌడీలను, దొంగలను గుర్తించగలం, కానీ, ఇవాళ ఇంట్లో ఉండి మోసగించే పరిస్ధితులు వచ్చాయని, నీతి తగ్గిపోయే పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం రావాలని, నైతికత పెరుగాలని అన్నారు. యూట్యూబ్ వచ్చాక సెక్స్ అనే అంశం సులువుగా అందుబాటులోకి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నపిల్లలు ఇటువంటి వాటికి ఆకర్షితులై చెడ్డదారి పడుతున్నారని అన్నారు. ఇటువంటి వాటిని నియంత్రించి.. ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఉరిశిక్షలు పడే చట్టాలు వచ్చినా జనం జడవడం లేదని పేర్కొన్నారు. శిక్షలు బలంగా ఉన్నాయని కిందవరకు అవగాహన కల్పిస్తేనే మార్పు వస్తుందని తెలిపారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ అయినా లెక్కచేయబోమని, తమకు శాంతిభద్రతలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. తప్పు చేసినా వ్యక్తి ఎంత గొప్పవాడైనా తీసుకొచ్చి కేసుపెట్టి అరెస్టు చేస్తామన్నారు. -
అత్యాచారాలకు పాల్పడితే ఉరికంబం ఎక్కిస్తాం
సాక్షి, అమరావతి: అత్యాచారాలకు పాల్పడితే ఉరికంబం ఎక్కించే వరకు విశ్రమించబోమని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఆడపిల్లల జోలికొస్తే సహించేది లేదన్నారు. దాచేపల్లి ఘటన నిందితుడు సుబ్బయ్య కుటుంబసభ్యులందరూ టీడీపీ వారని చెబుతూ వైఎస్సార్సీపీ ఆందోళన చేస్తోందని విమర్శించారు. ఈ ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అత్యాచార ఘటన బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను శుక్రవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో సీఎం చంద్రబాబుకు వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారితో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. 48 గంటల్లోగా కేసును పరిష్కరించామన్నారు. భయంతోనే నిందితుడు ఉరేసుకున్నాడని చెప్పారు. దాచేపల్లి ఘటనకు నిరసనగా.. ప్రజల్లో అత్యాచారాలపై అవగాహన కల్పించేలా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపడతామన్నారు. విజయవాడలో జరిగే ప్రదర్శనలో తాను పాల్గొంటానని చెప్పారు. శనివారం తాను గుంటూరు ఆస్పత్రికి వెళ్లి బాధిత బాలికను పరామర్శిస్తానని తెలిపారు. కాగా, అత్యాచారం చేసిన వారిని ఉరితీసేలా చట్టాలు తీసుకురావాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ప్రజల్లో సంతృప్తస్థాయిని 90 శాతానికి తీసుకెళ్లాలి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గత నెల సర్వే ప్రకారం 73 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని, దీన్ని 90 శాతానికి పెంచేలా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్టీఆర్ వైద్యసేవపై 88.90 శాతం, జాతీయ ఉచిత డయాలసిస్‌పై 89.50 శాతం, చంద్రన్న బీమాపై 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. ‘ఐఐటీ జేఈఈ’ ఎస్సీ, ఎస్టీ ర్యాంకర్లకు సీఎం అభినందన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతూ ఐఐటీ–జేఈఈ మెయిన్స్, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను సీఎం చంద్రబాబు అభినందించారు. సచివాలయంలో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 216 మంది విద్యార్థులు ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించడం గర్వకారణమన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ కొవ్వొత్తుల ర్యాలీలు
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరుకు, రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న వరుస లైంగిక దాడులకు నిరసనగా నేడు (శనివారం) రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీలను చేపడతామని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడి అత్యంత బాధాకరమని దీని పట్ల తమ పార్టీ తీవ్ర నిరసన తెలుపుతోందన్నారు. మహిళలకు, బాలికలకు అండగా ఉంటామని, భరోసా కల్పిస్తామని తెలియజేయడానికే ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, వారి నిర్లక్ష్య వైఖరే మహిళలపై దౌర్జన్యాలు జరగడానికి అవకాశం కల్పిస్తోందన్నారు. కాగా.. ఈ నెల 14న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రవేశిస్తుందని, ఆ రోజుకు ఆయన 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తారని తెలిపారు. ఇప్పటివరకూ పాదయాత్ర జరిగిన జిల్లాల్లో ప్రజలు ప్రభుత్వం చేతిలో ఎలా వంచనకు గురయ్యారో వైఎస్ జగన్ ప్రత్యక్షంగా చూశారని అన్నారు. రాబోయే రోజుల్లో నవరత్నాలు ద్వారా వారికి భరోసా కల్పిస్తారని చెప్పారు. జగన్ పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు పాదయాత్రలు చేస్తాయన్నారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలపై ఎలా మోసం చేశారో ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. 16న ‘వంచనపై గర్జన’ పేరుతో అన్ని కలెక్టరేట్ల వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. మహారాష్ట్ర బీజేపీ ఆర్థిక మంత్రి సుధీర్ భార్యకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. ప్రజాధనంతో చంద్రబాబు ధర్మపోరాటం అనే పేరుతో అధర్మ పోరాటం చేస్తున్నారన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ప్రత్యేక హోదా వద్దని చెప్పి రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఏపీని అత్యాచారాలకు, అరాచకాలకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మాఫియా, రేషన్ కార్డుల మాఫియా, జన్మభూమి మాఫియా, ల్యాండ్, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలను తయారుచేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఓటుకు కోట్లు తర్వాత రాజధానిని తెరమీదకు తెచ్చి తాత్కాలిక భవనాలు నిర్మించి ఎండాకాలం వర్షాలకే లీకులు వచ్చే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. -
కడతేరిన కామాంధుడు
సాక్షి, గుంటూరు/దాచేపల్లి/దైద(గురజాల రూరల్)/గురజాల: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దాచేపల్లి అత్యాచార ఘటనలో నిందితుడు అన్నం సుబ్బయ్య శుక్రవారం అనూహ్యంగా శవమై కనిపించాడు. గుంటూరు జిల్లా గురజాల మండలం దైద శ్రీఅమరలింగేశ్వర దేవాలయం పరిధిలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 55 ఏళ్ల వృద్ధుడైన సుబ్బయ్య నాలుగు రోజుల క్రితం దాచేపల్లిలో 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి, పరారైన సంగతి తెలిసిందే. అతడిని పట్టుకునేందుకు పోలీసులు దాచేపల్లి గ్రామస్తులతో కలిసి 17 బృందాలుగా ఏర్పడ్డారు. కృష్ణానది ఒడ్డున అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా గాలిస్తున్నా నిందితుడి అచూకీ చిక్కలేదు. సుబ్బయ్య చేసిన ఫోన్‌కాల్ ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు శుక్రవారం గాలిస్తుండగా, దైద శ్రీఅమరలింగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి కిలోమీటర్ లోపల అటవీ ప్రాంతంలో వేపచెట్టుకు ఓ శవం వేలాడుతోందని గొర్రెల కాపరులు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లుంగీతో వేపచెట్టుకు ఉరేసుకున్న మృతుడి ఫొటోను సెల్‌ఫోన్ ద్వారా సుబ్బయ్య బంధువులకు చూపించారు. ఆ మృతదేహం సుబ్బయ్యదేనని నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సుబ్బయ్య మృతదేహాన్ని చూసేందుకు గానీ, అంత్యక్రియలు నిర్వహించేందుకు గానీ బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు గురజాల పంచాయతీ అధికారులకు అప్పగించారు. గురజాల శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య సుబ్బయ్య కుమారుడితో దహన సంస్కారాలు చేయించారు. హోం మంత్రి చినరాజప్ప కాన్వాయ్కి అడ్డంగా రోడ్డుపై ఆందోళన చేస్తున్న స్థానికులను అడ్డుకుంటున్న పోలీసులు మృతదేహాన్ని నడిరోడ్డుపై తగలబెట్టాల్సిందే.. మానవ మృగం సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ అంతకుముందు మహిళలు, స్థానికులు భారీఎత్తున అద్దంకి–నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మృగాళ్ల దాష్టీకాలకు మరో ఆడపిల్ల బలికాకుండా ఉండాలంటే సుబ్బయ్య మృతదేహాన్ని నడిరోడ్డుపై తగలబెట్టాలని ఆందోళనకారులు భీష్మించుకు కూర్చున్నారు. అదే సమయంలో గురజాల నుంచి వస్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించేవరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పోలీసులు లాఠీచార్జీ చేసి, ఆందోళనకారులను చెదరగొట్టి చినరాజప్ప కాన్వాయ్‌ని పంపించారు. జీజీహెచ్ ఎదుట వైఎస్సార్సీపీ ధర్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు గుంటూరు జీజీహెచ్ గైనకాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్ ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఉపముఖ్యమంత్రి వస్తున్నాడనే నెపంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలను పక్కకు లాగి పడేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రోజా నీరసించి పోవడంతో ఆమెకు మంచినీళ్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. పోలీసుల దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకుంటున్న రోజా, వైఎస్సార్సీపీ నేతలు బాలిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించినట్లు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రకటించారు. గుంటూరు జీజీహెచ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యాచార ఘటనలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని, వీటిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం దాచేపల్లికి వెళ్లి బాధితురాలి బంధువులతో మాట్లాడారు. దాచేపల్లిలో కొనసాగుతున్న ఉద్రిక్తత మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై దాచేపల్లి పట్టణంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. కుల, మతాలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్లపైకి చేరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు రెండు రోజులపాటు దాచేపల్లిలోనే మకాం వేశారు. 144 సెక్షన్ విధించారు. సున్నితమైన అంశం కావడంలో అందరూ సంయమనం పాటించాలంటూ స్వయంగా మైక్ పట్టుకుని జాతీయ రహదారిపై తిరుగుతూ విజ్ఞప్తి చేశారు. నిందితుడు సుబ్బయ్య ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. సుబ్బయ్య కుమారుడి నుంచి ప్రాణహాని: బాలిక తండ్రి తన తండ్రి చనిపోతే మీ అమ్మాయిని కూడా చంపేస్తానని అన్నం రామసుబ్బయ్య కుమారుడు నరసింహారావు బెదిరించాడని బాధిత బాలిక తండ్రి ఉపముఖ్యమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం వచ్చిన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, డీజీపీ మాలకొండయ్యను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తన కుమార్తె భవిష్యత్తును సుబ్బయ్య సర్వనాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. సుబ్బయ్య కుమారుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పాడు. భయపడాల్సిన అవసరం లేదని, పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని డీజీపీ మాలకొండయ్య బాలిక తండ్రికి హామీ ఇచ్చారు. సుబ్బయ్య నా తమ్ముడని చెప్పుకోవడం సిగ్గుగా ఉంది: లక్ష్మయ్య ‘‘సుబ్బయ్య నాకు తమ్ముడిగా పుట్టాడని చెప్పుకోవడం సిగ్గుగా వుంది. 15 ఏళ్లుగా మా మధ్య మాటల్లేవు. సుబ్బయ్యకు ఇద్దరు భార్యలు. ఒక్కొక్కరికి ఇద్దరు బిడ్డలున్నారు. బిడ్డలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే భార్యలను వదిలిపెట్టాడు. మనవరాలి వయసున్న చిన్నారిపై ఆత్యాచారం చేయడం దారుణం. ఆత్మహత్య చేసుకోకుండా పోలీసులకు దొరికినా బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేసేవాళ్లం’’ అని నిందితుడు అన్నం సుబ్బయ్య సోదరుడు లక్ష్మయ్య తెలిపాడు. నా పాపం పండింది.. అందుకే పోతున్నా.. సుబ్బయ్య అఖరి మాటలు ‘‘ఇక లేదులే జీవితం.. చావుకు దగ్గర్లో ఉన్నా. పది మందికి మంచి చెప్పి నేను సరదాగా బతికేవాణ్ని. అనుకోకుండా జరిగింది. ఇక బతకకూడదు. నీకు నా ముఖం చూపెట్టకూడదు. నా ఖర్మ.. పాపం పండింది. అందుకే పోతున్నా. నేను చేసిన పనికి నా కొడుకు పరువు పోయింది. నా కొడుకు ఎట్టా బతుకుతాడో. వాడిని వెన్నపూసలాగా మెత్తగా పెంచుకున్నా. చివరకు వాడికి ఊళ్లో తావులేకుండా చేసి పోతున్నా. రేపు పొద్దునే మీకు అందుబాటులో శవమై కన్పిస్తా’’ ఇవీ దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడి చేసిన నిందితుడు అన్నం సుబ్బయ్య అఖరి మాటలు. సుబ్బయ్యతో బంధువు ఫోన్లో సంభాషించాడు. ‘తిక్కలోడ.. తిక్కల పని చేసుకోవద్దు. ఎక్కడ ఉన్నావో చెప్పు. నేను వస్తా.. శవమై ఏం చేసుకుంటావు’’ అని మాట్లాడాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో తన బంధువుతో సుబ్బయ్య ఈ మాటలు మాట్లాడినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ బంధువు ఎవరు? సుబ్బయ్య సామాజికవర్గానికే చెందిన వ్యక్తా లేక ఇతరులా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. -
దాచేపల్లి ఘటన నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి
-
సుబ్బయ్య టీడీపీకి చెందిన వ్యక్తి
సాక్షి, గుంటూరు : దాచేపల్లిలో బాలికపై అత్యాచారం ఘటనను రాజకీయం చేయదలుచుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వమే తమ పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ ఘటన విషయంలో తాము సంయమనంతో వ్యవహరిస్తున్నా.. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నిందితుడు వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి అంటూ బురద జల్లే ప్రయత్నం చేశారని, నిజానికి నిందితుడు సుబ్బయ్య టీడీపీకి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. అందుకే టీడీపీ ఎమ్మెల్యే సుబ్బయ్యకు ఇల్లు మంజూరు చేయించారని, ఇందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, సమస్యను సమస్యలాగా చూడాలని జంగా కృష్ణమూర్తి ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సందర్భంగా టీడీపీలో నిందితుడు సుబ్బయ్య క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ.. అతడి టీడీపీ ఐడీకార్డును జంగా కృష్ణమూర్తి విడుదల చేశారు. -
మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు
-
సుబ్బయ్య మృతదేహాన్ని మాకు అప్పగించాలి: మహిళలు
సాక్షి, గుంటూరు : బాలికపై అత్యాచారం, నిందితుడి మృతి పరిణామాల నేపథ్యంలో దాచేపల్లి సెంట్రల్లో శుక్రవారం సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రులు చినరాజప్ప, ప్రతిపాటి పుల్లారావు కాన్వాయ్‌ను మహిళలు అడ్డుకున్నారు. సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మంత్రులను మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నడిరోడ్డుపై సుబ్బయ్య మృతదేహాన్ని తగలబెట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. ఇక నిందితుడు మృతిచెందడంతో దాచేపల్లి వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. నల్ల జెండాలతో యువత బైక్ ర్యాలీ నిర్వహించగా... దానిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుడు సుబ్బయ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అయితే, అతడి మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులు ముందుకు రావడం లేదు. దీంతో గురజాల గ్రామపంచాయతీకి అప్పగించేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న గురజల గ్రామపంచాయతీ సిబ్బంది.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
దాచేపల్లి నిందితుడి చివరి ఫోన్‌కాల్..
సాక్షి, గుంటూరు: దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు పరారీలో ఉన్న సుబ్బయ్య ఆచూకీ కోసం పోలీసులు 17 బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మరో వైపు డ్రోన్ కెమెరాలతో కూడా కృష్ణా నది పరసర ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలించారు. ఈ క్రమంలో సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గురజాల మండలం తేలికుట్ల- దైద దగ్గరున్న అమరలింగేశ్వర దేవాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీస్ యంత్రాంగం అక్కడ వెళ్లి సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్య ఎప్పుడు చనిపోయాడనే విషయాన్ని వైద్యులు నిర్థారిస్తారని డీజీపీ మాలకొండయ్య వెల్లడించారు. అయితే సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్టు తెలిపాడు. అందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డు బయటపడింది. ఆయన ఫోన్ కాల్ సంభాషణలో ‘పదిమందికి మంచి చెప్పి బతికేవాణ్ని.. కానీ అనుకోకుండా జరిగిపోయింది. నాకు చావడం ఒక్కడే మార్గం.. నేను చేయకూడని పని చేశాను. నా మొహం చూపెట్టుకోలేను. నేను చేసిన పనితో నా కొడుకు పరువు పోయింది. చావడానికే వెళ్తున్నాను.’ అని సుబ్బయ్య బంధువులకు తెలిపాడు. ఎలాంటి అఘాత్యం చేసుకోవద్దని బంధువులు వారిస్తున్నా సుబ్బయ్య వినిపించుకోలేదు. -
దాచేపల్లి అత్యాచార నిందితుడు ఆత్మహత్య
-
దాచేపల్లి నిందితుడి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తోంది. నిందితుడి అరెస్టులో పోలీసుల తాత్సారాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వందలాది మంది ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిని అరెస్టు చేయాలంటూ బాధితురాలి బంధువులు రెండు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ అందోళనలో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో దాచేపల్లిలో గురువారం జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ వెంకటప్పల నాయుడు పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు చేశారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. దీంతో 17 పోలీసు బృందాలతో నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరో వైపు పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణానది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆత్మహత్య ఓ పక్క నిందితుడు సుబ్బయ్య కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గురజాల దైదా దగ్గర ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అమరలింగేశ్వర దేవాలయం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు ఘటనాస్థలికి బయలుదేరారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సుబ్యయ్యా? కాదా? అని పోలీసులు మరికాపేట్లో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మా తప్పు ఒప్పుకుంటున్నాం: హోం మంత్రి మరో వైపు దాచేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శుక్రవారం చినరాజప్ప పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామి ఇచ్చారు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. తమ తప్పును ఒప్పుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటివి జరుగకుండా ప్రజల్లో కూడా అవగాహన రావాలని, మీడియా చైతన్య పర్చాలని చినరాజప్ప కోరారు. బాధితురాలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. -
బాలికపై లైంగిక దాడి ఘటనతో దాచేపల్లిలో ఉద్రిక్తత
-
దాచేపల్లి ఘటన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం
-
దాచేపల్లి ఘటనపై స్పందించిన వైఎస్ జగన్