ప్రతీకాత్మకచిత్రం
దాచేపల్లి (గుంటూరు): భార్యను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. ఈ దుర్ఘటన గురువారం పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రాంతంలో ఉంటున్న చల్లా నాగమణి(28), రమేష్ దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు అఖిల్‌సాయి, లోకేష్ ఉన్నారు.
కొంతకాలంగా నాగమణి వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని తెలుసుకున్న రమేష్ ఆమెతో గొడవ పడుతున్నాడు. కుటుంబ పెద్దల వద్ద కూడా ఈ విషయంపై పంచాయితీ పెట్టాడు. ఈ నేపథ్యంలో పిల్లలను బంధువుల ఇంటికి పంపారు. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య మళ్లీ వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 6 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కత్తితో రమేష్ నాగమణిపై దాడి చేసి విచక్షణా రహితంగా నరికాడు.
రక్తపుమడుగులో పడి నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో రమేష్ పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ రహ్మతుల్లా ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నాగమణి తల్లి జెట్టిపాటి చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రహ్మతుల్లా చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీం సభ్యులు పరిశీలించి ఆధారాలు సేకరించారు.
చదవండి: (బాలిక ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రాం.. అసభ్య మెసేజ్‌లు పోస్టు చేస్తూ..)
Comments
Please login to add a commentAdd a comment