సాక్షి, గుంటూరు : బాలికపై అత్యాచారం, నిందితుడి మృతి పరిణామాల నేపథ్యంలో దాచేపల్లి సెంట్రల్‌లో శుక్రవారం సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రులు చినరాజప్ప, ప్రతిపాటి పుల్లారావు కాన్వాయ్‌ను మహిళలు అడ్డుకున్నారు. సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మంత్రులను మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నడిరోడ్డుపై సుబ్బయ్య మృతదేహాన్ని తగలబెట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. ఇక నిందితుడు మృతిచెందడంతో దాచేపల్లి వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. నల్ల జెండాలతో యువత బైక్ ర్యాలీ నిర్వహించగా... దానిని పోలీసులు అడ్డుకున్నారు.
మరోవైపు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుడు సుబ్బయ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అయితే, అతడి మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులు ముందుకు రావడం లేదు. దీంతో గురజాల గ్రామపంచాయతీకి అప్పగించేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న గురజల గ్రామపంచాయతీ సిబ్బంది.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Published Fri, May 4 2018 6:01 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment