Ministers Convoy
-
మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు
-
సుబ్బయ్య మృతదేహాన్ని మాకు అప్పగించాలి: మహిళలు
సాక్షి, గుంటూరు : బాలికపై అత్యాచారం, నిందితుడి మృతి పరిణామాల నేపథ్యంలో దాచేపల్లి సెంట్రల్లో శుక్రవారం సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రులు చినరాజప్ప, ప్రతిపాటి పుల్లారావు కాన్వాయ్‌ను మహిళలు అడ్డుకున్నారు. సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మంత్రులను మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నడిరోడ్డుపై సుబ్బయ్య మృతదేహాన్ని తగలబెట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. ఇక నిందితుడు మృతిచెందడంతో దాచేపల్లి వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. నల్ల జెండాలతో యువత బైక్ ర్యాలీ నిర్వహించగా... దానిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుడు సుబ్బయ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అయితే, అతడి మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులు ముందుకు రావడం లేదు. దీంతో గురజాల గ్రామపంచాయతీకి అప్పగించేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న గురజల గ్రామపంచాయతీ సిబ్బంది.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
మంత్రి కాన్వాయ్ ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు
కొవ్వూరు: మోటార్ బైక్ పై వెళుతోన్న ఓ కుటుంబానికి మంత్రి గారి వాహనం ప్రమాదం రూపంలో ఎదురై తీవ్ర గాయాలను మిగిల్చింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం అరికిరేవుల సమీపంలో బైక్ పై వెళుతోన్న ఓ కుటుంబాన్ని మంత్రి పరిటాల సునీత కాన్వాయ్ లోని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తోన్న ఎ. రాజు, అతని భార్య సంతోషి, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
మంచినీటి కోసం మంత్రులను అడ్డుకున్న గ్రామస్తులు
నకిరేకల్ (నల్లగొండ) : తాగు, సాగునీరు కోసం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డిల కాన్వాయ్‌ను మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. సాగు, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. అందుకు స్పందించిన మంత్రులు త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. మంత్రుల వెంట తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు.