మంచినీటి కోసం మంత్రులను అడ్డుకున్న గ్రామస్తులు | Vallabhapuram villagers stop Telangana Ministers Convoy | Sakshi
Sakshi News home page

మంచినీటి కోసం మంత్రులను అడ్డుకున్న గ్రామస్తులు

Published Tue, Jul 21 2015 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

తాగు, సాగునీరు కోసం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డిల కాన్వాయ్‌ను మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు.

నకిరేకల్ (నల్లగొండ) : తాగు, సాగునీరు కోసం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డిల కాన్వాయ్‌ను మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. సాగు, తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే పరిష్కరించాలని విన్నవించారు.

అందుకు స్పందించిన మంత్రులు త్వరలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. మంత్రుల వెంట తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement