Women groups
-
మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం సౌర విద్యుత్ (సోలార్ పవర్ ప్లాంట్లు) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇందులో ఇందిరా మహిళాశక్తి సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరా మహిళాశక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. అందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో ఆయన ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, రెడ్కో వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వావిలాల అనీల తదితరులతో ఈ అంశంపై సమీక్షించారు.రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి త్వరితగతిన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యంత్రాల కొనుగోళ్లకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రుణాల తిరిగి చెల్లింపుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్న విషయాన్ని అనుకూలంగా మలుచుకోవాలని డిప్యూటీ సీఎం చెప్పారు.ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆరీ్టసీకి బస్సులు సమకూర్చే మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామన్నారు. వారు కూడా విరివిగా రుణాలిచ్చి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు.మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇంధనశాఖకు పీఆర్‌శాఖ ప్రతిపాదనలుమహిళా స్వయం సహాయక సంఘాలకు వె య్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఒక్క మెగావాట్‌కు రూ. 3 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యయంలో 10 శాతం మహిళా సంఘాలు భరిస్తే 90 శాతం బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వనున్నాయి. ఇంధనశాఖ దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. -
మహిళా సంఘాలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
-
‘ప్రగతి’ పయనంలో మహిళా శక్తి
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళ స్వయంశక్తితో ఎదిగేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వం అందించిన వివిధ పథకాల నిధులతో స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడంతో పాటు, వారు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. స్వయం ఉపాధిపై ఆసక్తి గల 142 మంది పట్టణ మహిళా సంఘాల సభ్యుల(ఎస్‌హెచ్‌జీ)కు ఆసక్తి ఉన్న రంగాలలో పూర్తిస్థాయిలో శిక్షణనిచ్చింది. ఆయా పరిశ్రమలు పర్యావరణ హితమైనవిగా ఉండేలా ముందే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో సూక్ష్మ పరిశ్రమల స్థాపన, వ్యాపార విధానాలు, ముడిసరుకు లభ్యత వంటి అంశాలపై తర్ఫీదునిచ్చారు. ఒక్కో యూనిట్‌కు సగటున రూ.2.50 లక్షల చొప్పున దాదాపు రూ.4 కోట్ల నిధులను మెప్మా ఇందుకోసం వెచ్చించింది. ఇప్పటికే యంత్రాల కొనుగోలు ప్రక్రియ పూర్తవగా, మరో 10 రోజుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. యూనిట్లు ఏర్పాటు తర్వాత స్థానికంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు కూడా మెప్మా ఎండీ విజయలక్ష్మి ముందస్తు చర్యలు తీసుకున్నారు. శిక్షణ పొందిన ట్రేడ్స్‌లో నిపుణులతో అవసరమైన సహకారం అందించనున్నారు. ఆరు ట్రేడ్లలో 142 మందికి శిక్షణ పూర్తి నాలుగున్నర ఏళ్లలో వివిధ పథకాల ద్వారా రాష్ట్రంలో 25 లక్షల మంది పట్టణ పొదుపు సంఘాల మహిళలతో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు ఏర్పాటు చేయించి మెప్మా విజయం సాధించింది. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తత మార్కెట్ కల్పించేందుకు ఈ–కామర్స్ సంస్థలతోనూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు అదే మహిళలతో పరిశ్రమలు నెలకొల్పి, పర్యావరణ హితమైన సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు మహిళా ‘ప్రగతి యూనిట్లు’ ఏర్పాటుపై పూర్తిస్థాయి శిక్షణనిచ్చారు. అన్ని మునిసిపాలిటీల్లోని మహిళా సంఘాలు తీర్మానాలు చేసిన ప్రాజెక్టుల్లో కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్, పేపర్ ప్లేట్ల తయారీ, క్లాత్ బ్యాగ్స్ తయారీ, స్క్రీన్ ప్రింటింగ్, ఆర్టీఫిషియల్ జ్యూవెలరీ, కర్పూరం, దీపం వత్తులు, సాంబ్రాణి తయారీ, కారం, మసాలా పొడులు, మిల్లెట్స్ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన 142 మందికి ప్రభుత్వమే యంత్రాలు, ముడిసరుకును ఉచితంగా ఇచ్చి మొత్తం 111 యూనిట్లను పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్నారు. మెప్మాతో మెరుగైన జీవితం టైలరింగ్‌లో అనుభవం ఉంది. ఇంట్లోనే కుట్టుపని ప్రారంభించా. వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నా. ఎలా చేయాలో తెలియదు. పట్టణ మహిళా సంఘంలో సభ్యురాలిని కావడంతో మెప్మాను సంప్రదించాను. వారు కంప్యూటర్‌పై ఎంబ్రాయిడరీ వర్క్‌లో శిక్షణ ఇచ్చారు. ఇది నాకెంతో ఉపయోగపడుతుంది. ముడిసరుకు సేకరణ, వ్యాపారం, మార్కెటింగ్ అంశాల్లో పూర్తి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వమే ఉచితంగా యంత్రాలను అందించడం చాలా ఆనందంగా ఉంది. – టి.తనూజ స్రవంతి, విశాఖపట్నం నాపై నమ్మకం పెరిగింది సొంతంగా పరిశ్రమ పెట్టి కనీసం నలుగురికి ఉపాధి కల్పించాలన్న కోరిక ఉంది. కానీ ఎలా చేయాలో తెలియదు. ఇంట్లోనే క్లాత్ బ్యాగ్‌లు కుడుతుంటాను. వాటిపై అవసరమైన బ్రాండింగ్ కోసం మరో చోటకు వెళ్లాల్సి వస్తోంది. వ్యాపారంపైనా అవగాహన లేదు. ఈ ఏడాది ఎస్‌హెచ్‌జీలో చేరాను. మెప్మా ‘మహిళా పట్టణ ప్రగతి యూనిట్ల’ ఉచిత శిక్షణలో స్క్రీన్ ప్రింటింగ్, జ్యూట్ బ్యాగ్‌ల తయారీ, వ్యాపార మెళకువలు తెలుసుకున్నాను. నేను పూర్తిస్థాయిలో వ్యాపారం చేయగలనన్న నమ్మకం లభించింది. – బి.రాజేశ్వరి, ఏలూరు మహిళా ప్రగతి లక్ష్యంగా శిక్షణ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలనేది సీఎం జగన్మోహన్రెడ్డి ఆశయం. అందుకు అనుగుణంగా మెప్మా ఆధ్వర్యంలో జగనన్న మహిళా మార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్లు వంటివి ఏర్పాటు చేసి విజయం సాధించాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహిళా ప్రగతి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు కోరుకున్న రంగాల్లో ఉచిత శిక్షణ ఇచ్చాం. ఇంటిని చక్కదిద్దుకుంటూనే పిల్లల బాగోగులు చూసుకుంటున్న మహిళలకు మెప్మా అండగా ఉంటుంది. పరిశ్రమలు స్థాపించి నిర్వహించగల సామర్థ్యం మహిళలకు ఉంది. మార్కెటింగ్ విషయంలో మెప్మా వారికి అండగా నిలబడుతుంది. పదిరోజుల్లో 111 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. యూనిట్లు ఏర్పాటు తర్వాత వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకారం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, ఎండీ, మెప్మా -
సెక్స్ రాకెట్.. మహిళా సంఘాల మండిపాటు
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల షికాగోలో వెలుగుచూసిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మహిళా ఐక్యకార్యాచరణ సంఘం నాయకురాలు దేవి ప్రశ్నించారు. టాలీవుడ్లో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న క్యాస్టింగ్ కౌచ్, తాజాగా షికాగో సెక్స్ రాకెట్ విషయాలపై తెలుగు సినీపరిశ్రమను తాము ప్రశ్నిస్తున్నామని, మొత్తం 24 మహిళా సంఘాలు తరఫున తాము ఈ రెండు అంశాలపై మాట్లాడుతున్నామని తెలిపారు. మహిళా సంఘాల కార్యాచరణ తరఫున నిర్వహించిన మీడియా సమావేశంలో దేవీ మాట్లాడారు. సినీ పరిశ్రమకు సంబంధించి మూడుసార్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, టాలీవుడ్, ఎఫ్డీసీ పెద్దలతో చర్చలు జరిపామని తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా క్యాష్ కమిటీ వేస్తామని సినీ నటుల అసోసియేషన్ (మా) చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దేవీ మండిపడ్డారు. క్యాష్ కమిటీలో మహిళా, సామాజిక సంఘాల ప్రతినిధులను నియమించుతామని చెప్పారని, అది జరగలేదన్నారు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం వెలుగుచూసిన తరువాత కో ఆర్డినేషన్ వ్యవస్థను తీసేస్తామని చెప్పారు, కానీ ఎక్కడా ఆ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులకు అవకాశాలు ఇప్పించేందుకు బ్రోకర్ వ్యవస్థ ఉండకూడదని తాము సినీ పెద్దలకు చెప్పామని తెలిపారు. ఆఖరికీ డ్యాన్సింగ్, యాక్టింగ్ స్కూళ్లలోనూ మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారని, వీటి నివారణకు తగిన నియమ నిబంధనలతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని దేవి డిమాండ్ చేశారు. మహిళా హక్కుల కార్యకర్త సజయ మాట్లాడుతూ.. బాధితులకు కనీసం మాట్లాడటానికీ భయపడే పరిస్థితి నెలకొందని, కళమాతల్లికి సేవ అని చెత్త మాట్లాడుతూ.. మహిళలనే బలిపశువులు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు ఎలా జరిగింది అని చెప్పే దమ్ము ఎవరికీ లేదని, కానీ, బాధితులను భయపెట్టి.. వారిని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, ఇది వ్యవస్థీకృత నేరమని ఆమె ధ్వజమెత్తారు. ఈ విషయమై ఇంతవరకు టాలీవుడ్ పట్టించుకోకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా కేంద్రంగా జరుగుతున్న సెక్స్ రాకెట్లో సినీ పెద్దల ప్రోత్సాహం ఉందని మరో మహిళా సంఘం నేత సుజాత అన్నారు. ఈ పరిస్థితిపై సమగ్ర చర్చ జరగాలని, నిజాలు వెలికితీయాలని ఆమె అన్నారు. -
మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు
-
సుబ్బయ్య మృతదేహాన్ని మాకు అప్పగించాలి: మహిళలు
సాక్షి, గుంటూరు : బాలికపై అత్యాచారం, నిందితుడి మృతి పరిణామాల నేపథ్యంలో దాచేపల్లి సెంట్రల్లో శుక్రవారం సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రులు చినరాజప్ప, ప్రతిపాటి పుల్లారావు కాన్వాయ్‌ను మహిళలు అడ్డుకున్నారు. సుబ్బయ్య మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మంత్రులను మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నడిరోడ్డుపై సుబ్బయ్య మృతదేహాన్ని తగలబెట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. ఇక నిందితుడు మృతిచెందడంతో దాచేపల్లి వాసులు సంబరాలు జరుపుకుంటున్నారు. నల్ల జెండాలతో యువత బైక్ ర్యాలీ నిర్వహించగా... దానిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో నిందితుడు సుబ్బయ్య మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయింది. అయితే, అతడి మృతదేహాన్ని తీసుకునేందుకు బంధువులు ముందుకు రావడం లేదు. దీంతో గురజాల గ్రామపంచాయతీకి అప్పగించేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న గురజల గ్రామపంచాయతీ సిబ్బంది.. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
స్త్రీనిధి.. రూ.45 కోట్లు
చుంచుపల్లి: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళికలను సిద్ధం చేసింది. జిల్లాలోని 18,121 మహిళా సంఘాలకు రూ. 45 కోట్లు అందించేందుకు గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు వార్షిక ప్రణాళిక రూపొందించారు. 2017–18లో రుణ లక్ష్యం రూ.25.14 కోట్లు పెట్టుకోగా, మహిళా సంఘాలకు రూ.32.35 కోట్లు పంపిణీ చేశారు. లక్ష్యానికి మించి రూ.7.21 కోట్లు అధికంగా రుణాలు ఇచ్చారు. సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తున్న స్త్రీ నిధి రుణాలతో మహిళలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. జిల్లాలోని 18,121 మహిళా సంఘాల్లో 1,64,867 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ప్రయోజనం కలగనుంది. ఈ ఏడాది రూ.20 కోట్లు పెరిగిన లక్ష్యం మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే రుణాల లక్ష్యం పెరుగుతోంది. స్త్రీనిధి ద్వారా కేవలం రుణ అర్హత సాధించిన సంఘాలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. 2016–17లో మహిళా సంఘాలకు రూ.19.52 కోట్ల రుణం లక్ష్యం పెట్టుకోగా రూ.16.95 కోట్లను అందజేశారు. 3,479 సంఘాలకు అందజేసి లక్ష్యంలో 86.84 శాతం నమోదు చేశారు. 2017–18లో రూ.25.14 కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా, రూ.32.35 కోట్లను అందించారు. 5,779 గ్రూపులకు రుణాలు ఇచ్చి లక్ష్యానికి మించి 128 శాతం నమోదు చేశారు. ఇక 2018–19లో గతేడాది కంటే రూ.20 కోట్లు అధికంగా రూ.45 కోట్లు అందించేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మైక్రో, జనరల్, టైనీ రుణాల రూపంలో రూ.1.25 కోట్లను 312 గ్రూపులకు చెల్లించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీకి అధికారులు ఇప్పటికే చేపట్టారు. -
‘వర్మను వెంటనే అరెస్ట్ చేయండి’
-
‘వర్మను వెంటనే అరెస్ట్ చేయకపోతే..’
సాక్షి, విశాఖపట్నం: వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని విశాఖ మహిళాసంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మంగళవారం ఈ మేరకు నగర జాయింట్ పోలీస్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసింది. ఆడవాళ్లను అంగడి సరుకుగా చేసి తన వ్యాపారంగా మార్చుకుంటున్నాడని మహిళా సంఘాల నేతలు దుయ్యబట్టారు. సమాజంపై చెడు ప్రభావం చూపే వికృత దుర్మార్గపు ఆలోచనలను ప్రచారం చేస్తూ యువతను పెడతోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో సభ ఏర్పాటు చేస్తానని రాంగోపాల్‌వర్మ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని, ఇక్కడకు వస్తే తప్పకుండా ఆయనను అడ్డుకుంటామని హెచ్చరించారు. తక్షణమే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని, లేని పక్షంలో మహిళా సంఘాలన్నీ ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని తెలిపారు. -
వర్మపై మరో కేసు.. వారంలోగా అరెస్ట్ చేయకపోతే!
సాక్షి, ద్వారకానగర్ (విశాఖపట్నం) : వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ విశాఖలో మహిళా సంఘాలు కొనసాగించిన దీక్షపై పోలీసులు ఎట్టకేకలకు స్పందించారు. దర్శకుడు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మహిళా సంఘాలు తమ నిరాహార దీక్షను ముగించారు. అయితే వారం రోజుల్లోగా రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేయకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని మహిళలు తెలిపారు. కాగా, వర్మకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళా సంఘాలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ వర్మపై ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్మపై సెక్షన్ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. మహిళల దీక్షతో ఎట్టకేలకు పోలీసులు మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ‘గాడ్ సెక్స్ ట్రూత్’ పేరిట వర్మ వివాదాస్పద సినిమా తీయడంతో పాటు టీవీ చర్చలలో మాట్లాడుతూ మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి వర్మను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏపీలోనూ వర్మపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
వర్మను అరెస్టు చేయాల్సిందే!
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ) : సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ రెండోరోజు గురువారం కూడా మహిళా సంఘాలు తమ దీక్ష కొనసాగించాయి. వర్మకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కులో మహిళా సంఘాలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు వర్మపై ఎంవీపీ జోన్ పోలీసు స్టేషన్లో సెక్షన్ 504, 509 కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్మపై సెక్షన్ 306, 354 ఏ, 67 ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ డిమాండ్ చేస్తున్నాయి. ‘గాడ్ సెక్స్ ట్రూత్’ పేరిట వర్మ వివాదాస్పద సినిమా తీయడం.. ఈ సినిమాపై టీవీ చర్చల సందర్భంగా మహిళా సంఘాల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసులలో ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వర్మను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ వర్మపై కేసులు నమోదుకావడం ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది. రాంగోపాల్‌వర్మను తీవ్రంగా శిక్షించాలని, లైంగిక స్వేచ్ఛ మహిళలకు కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అతనిపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. మహిళా సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు మణి, లక్ష్మి, విమల, మాట్లాడారు. వైఎస్సార్సీపీ నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వర్మ వ్యాఖ్యానాలు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళాలపై దాడులు, చిన్నారులపై హత్యలు, యువతులపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ మహిళా నేతలు శ్రీదేవి వర్మ, షబీరా బేగం, శశికళ, పీవోడబ్ల్యూ నేతలు, పలు సంఘాల మహిళలు పాల్గొన్నారు. కాగా, వర్మపై ఐద్వా మహిళా సంఘం నాయకురాలు మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీజోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
మహిళా సంఘాలపై రాజకీయ పెత్తనం
– నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఎంఎస్ అధ్యక్షులు – రెండేళ్లు దాటినా కొత్త వారిని ఎన్నుకోని వైనం – రాజకీయ నేతల కనుసన్నల్లో మండల సమాఖ్యలు – వత్తాసు పలుకుతున్న ఏపీఎంలు, ఏసీలు అనంతపురం టౌన్ : మహిళా సంఘాలపై రాజకీయం స్వారీ చేస్తోంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం ఊదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిబంధనల ప్రకారం గ్రామ సంఘాలు, మండల, జిల్లా సమాఖ్యల్లో ఆఫీస్ బేరర్స్ (అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి) పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. రెండవ సంవత్సరం పోటీ చేయవచ్చును అయితే మూడో సంవత్సరం పోటీకి అర్హత ఉండదు. కానీ జిల్లా వ్యాప్తంగా 14 మండలాల అధ్యక్షులకు పదవీ కాలం ముగిసినా అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఆత్మకూరు, కూడేరు, ధర్మవరం, రామగిరి, తాడిమర్రి, కనగానపల్లి, గాండ్లపెంట, శెట్టూరు, బ్రహ్మసముద్రం, గోరంట్ల, అమరాపురం, తనకల్లు, గుంతకల్లు, విడపనకల్లు మండల సమాఖ్య అధ్యక్షులు రెండేళ్లకు పైబడినా ఇంకా అధ్యక్షులుగానే కొనసాగుతున్నారు. పదవీ కాలం రెండేళ్లు ముగియగానే మండల స్థాయిలో ఉన్న ఏపీఎంలు, క్లస్టర్ స్థాయిలోని ఏరియా కో ఆర్డినేటర్లు ఎన్నికలు నిర్వహించేలా చూడాలి. అయితే వీరు పట్టించుకోలేదు. తమకు అనుకూలమైనవారు అధ్యక్షులుగా ఉంటే తాము ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంటుందని భావించడంతో పాటు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. ఉన్నత స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా దీనిపై ఆరా తీసిన దాఖలాలు లేవు. జిల్లా సమాఖ్యకు జరిగిన ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన బహిర్గతమైంది. నిబంధనలు ఇలా..: ఆఫీస్ బేరర్స్ ఎన్నికలు జరపడానికి 30 రోజుల ముందు పాలకవర్గం సభ్యులకు నోటీసుల ద్వారా సమాచారం ఇవ్వాలి. అర్హత ఉన్న ఓటరు జాబితాను తయారు చేసి సంస్థల కార్యాలయాల్లో ప్రదర్శించాలి. నాలుగు రోజుల ముందు రిజిస్ట్రేషన్ సీఆర్పీలతో తప్పనిసరిగా ఆఫీస్ బేరర్స్‌కు కావాల్సిన అర్హతలు, విధులు, బాధ్యతలపై శిక్షణ ఇవ్వాలి. మండల సమాఖ్యల్లో ఎన్నికలు జరిగేటప్పుడు జిల్లా సమాఖ్య ఈసీ సభ్యుల నుంచి, జిల్లా సమాఖ్యలో ఎన్నికలు జరిగితే ఇతర జిల్లాల్లోని జిల్లా సమాఖ్యల ఈసీ సభ్యుల నుంచి గానీ, రిజిస్ట్రేషన్ సీఆర్పీల నుంచి గానీ ఎన్నికల నిర్వహణాధికారిని ఈసీ సభ్యుల ఆమోదంతో నియమించుకోవాలి. కానీ జిల్లా సమాఖ్య ఎన్నికల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఏకంగా 14 మందికి పదవీ కాలం ముగిసిందంటూ ఓటు హక్కు కల్పించలేదు. చివరకు రచ్చ కావడంతో సర్దుబాటు చర్యలు చేపట్టారు. కాగా పదవీ కాలం ముగిసినా 14 మంది అధ్యక్షులుగా ఎలా కొనసాగుతున్నారన్నది అధికారులకే తెలియాలి. ఈ క్రమంలో ఏసీలు, ఏపీఎంలపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది ప్రశ్నార్థకం. –––––– పరిశీలిస్తాం.. ఆయా మండలాల నుంచి రికార్డులు తెప్పించి పరిశీలిస్తా. పదవిలో ఎలా కొనసాగుతున్నారో చూడాలి. ఎన్నికలకు సంబంధించి విధివిధానాలకు లోబడి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం. – వెంకటేశ్వర్లు, పీడీ, డీఆర్డీఏ –––––– -
మహిళా గ్రూపుల తరలింపునకు చర్యలు
మిరుదొడ్డి: రాష్ట్ర అవతరణ అనంతరం తొలిసారిగా విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఐకేపీ మహిళా సమాఖ్య గ్రూపులను తరలించడానికి చర్యలు చేపట్టినట్లు పీడీ సత్యనారాయణ తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఐకేపీ ఏసీలకు, ఏపీఎంలకు , సీసీలకు, మహిళా గ్రూపు వీవో లీడర్లకు మహిళల తరలింపుపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లస్టర్ పరిధిలో 5120 మహిళా గ్రూపులు ఉన్నాయన్నారు. జిల్లా నుండి మోదీ సభకు తరలించడానికి సుమారు 4000 బస్సులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రతి బస్సు ఆయా గ్రామాలకు 7న ఉదయం 6 గంటలకే చేరుకుంటుందని తెలిపారు. ఒక్కో బస్సుకు 50 మందిని కేటాయించి, ఒక వీకో లీడర్‌ను, ఒక క్లస్టర్ కోఆర్డినేటర్‌ను నియమిస్తామన్నారు. బస్సులో తరలివెళ్లేవారికి ఆహారం, మంచి నీరు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభకు తరలి వెళ్లే మహిళలు వ్యక్తిగతంగా ఎలాంటి వస్తువులు వెంట తెచ్చుకోకుండా చేసుకోవాలని తెలిపారు. సభకు వెళ్లే ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఆర్టీసీ బస్సులు మినహాయించి ప్రైవేటు వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. సభకు వెళ్లిన ప్రతి మహిళా గ్రూపును సభ అనంతరం క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చే వరకు ఐకేపీ ఏపీఎంలు, సీసీలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ మదుసూధన్, ఐకేపీ ఏపీఎం కృష్ణారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మినర్సమ్మ, వివిధ మండలాలకు చెందిన ఏపీఎంలు, ఏరియా కో ఆర్డినేటర్లు, సీసీలు మహిళా సంఘాల వీవో లీడర్లు తదితరులు పాల్గొన్నారు. -
'నమ్మించి.. గొంతుకోశాడు..'
విజయవాడ: పొదుపు సంఘాలను ముంచడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు.. మహిళాశక్తి అంటే ఏంటో నిరూపిస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ వాగ్దానాన్ని వెంటనే అమలుచేయాలని, మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష మహిళా సంఘాల రాష్ట్ర సదస్సు శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. బెల్టుషాపులను ఎత్తివేస్తామని చెప్పిన బాబు.. మద్యం అమ్మకాలను అంచెలంచెలుగా పెంచుతూ మహిళలను నమ్మించి గొంతుకోశారని విమర్శించారు. మహిళా సాధికారత పేరుతో డ్వాక్రా మహిళల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నారన్నారు. అవినీతిలో భాగస్వాములను చేసుకునేందుకు ఇసుక రీచ్‌లు, మద్యం దుకాణాల టెండర్లకు మహిళలను ఆహ్వానించిన చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐద్వా నాయకురాలు వి.ప్రభావతి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు ఎన్.విష్ణు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు టి.అరుణ, అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.లలిత ప్రసంగించారు. మహిళా సంఘాలకు మద్దతుగా సీపీఎం రాష్ట కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.నాగేశ్వరరావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి పి.వి.సుందరరాజు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ర్ట కార్యదర్శి ఎన్.మూర్తి పాల్గొన్నారు. -
చంద్రబాబుకు కోపం వచ్చింది..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ సంగతి ఏం చేశారంటూ తనను ప్రశ్నించిన మహిళలపై ఆయన ఒక్కసారిగా మండిపడ్డారు. విజయవాడలో ఉన్న సీఎం చంద్రబాబుని మహిళా సంఘాల ప్రతినిధులు శుక్రవారం కలిశారు. వాళ్లు రుణమాఫీ గురించి ప్రస్తావించగానే ఒక్కసారిగా మహిళలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల నుంచి కనీసం వినతిపత్రం కూడా తీసుకోకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో సీఎం వ్యవహార శైలిపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. విషయం తెలిసి... నాలుక కరుచుకున్న చంద్రబాబు, నిరసన తెలుపుతున్న మహిళల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని వారికి చెప్పారు. -
చేతివాటానికి చెక్!
తాండూరు : పొదుపు సంఘాలనూ అవినీతిపరులు వదలడం లేదు. మహిళల ఆర్థికాభివృద్ధికి సహకరించేదిపోయి వారికి మంజూరైన నిధుల్లోంచి కమీషన్లు నొక్కేస్తున్న వైనం బయట పడింది. వేలు వందల్లో కాదు.. ఏకంగా ఈ కమీషన్లు రూ.లక్షల్లోకి చేరుకున్నాయి. జిల్లాలోని అర్బన్ ప్రాంతంలో కొనసాగుతున్న మహిళా సంఘాలకు ఈ బెడద ఎక్కువగా ఉంది. మహిళా సంఘాల వ్యవహారాలు చూస్తున్న కొందరు రీసోర్స్ పర్సన్ (ఆర్పీ)లు కమీషన్లు దండుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని పసిగట్టిన జిల్లా పేదరిక నిర్మూలన సంస్థ (అర్బన్ ఐకేపీ మెప్మా) వెంటనే నివారణ చర్యలు ప్రారంభించింది. బ్యాంకు లింకేజీ/ రుణాల మంజూరు వ్యవహారాల్లో ఆర్పీల ప్రమేయానికి చెక్ పెట్టింది. ఇక నుంచి ఆర్పీలతో సంబంధంలేకుండా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు మెప్మా అధికారులు లేఖలు రాశా రు. ఇకపై ఆర్పీలు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేదు. సంఘాల సభ్యు లు బ్యాంకుకు వెళ్లి అధికారులను కలవా ల్సి ఉంటుంది. సంఘాల సభ్యులు అందరూ వస్తేనే రుణాలు మంజూరు చేయాలని ఐకేపీ జిల్లా అధికారులు బ్యాంకులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. అర్బన్‌లో 3,701 సంఘాలు.. జిల్లాలో ఐకేపీ అర్బన్ పరిధి కిందకు వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, మేడ్చల్, పెద్ద అంబ ర్‌పేట్ మున్సిపాలిటీలు వస్తాయి. ఈ ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 3,701 మహిళా పొదుపు సంఘాలు పనిచేస్తున్నాయి. 2015-16 సంవత్సరానికి 1,201 సంఘాలు బ్యాంకు లింకేజీకి అర్హత సాధించాయి. వీరికి రూ.31.71 కోట్ల రుణాల లింకేజీ లక్ష్యం. ఇప్పటివరకు 195 సంఘాలకు రూ.5.51 కోట్ల బ్యాంకు లింకేజీ జరిగింది. ఇదీ ఆర్పీల పని.. కొత్త సంఘాల ఏర్పాటు, పొదుపు ఎలా చేయాలి, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆర్పీలు పర్యవేక్షించాలి. రుణాల రికవరీ జరిగేలా చూస్తుండాలి. కానీ కొందరు ఆర్పీలు బ్యాంకు రుణాల మంజూరులో జోక్యం చేసుకుంటున్నా రు. తమకు అనుకూలమైన సంఘాల్లో ఒకరిద్దరు సభ్యులను వెంట బెట్టుకొని బ్యాంకు వెళుతున్నారు. సం ఘాలకు రుణాలు మంజూరు వ్యవహారాలన్నీ వీరే చక్కపెడుతున్నారు. ఇదంతా చేసినందుకు కొందరు ఆర్పీలు మంజూ రైన రుణ మొత్తంలో 5-10 శాతం మేరకు వాటాలు దండుకుంటున్నారని తెలుస్తోంది. రూ.కోట్లలో జరుగుతున్న రుణా ల లింకేజీలో వాటాల పర్వం రూ. లక్షల్లో జరుగుతున్నట్టు సమాచారం. సదరు ఆర్పీల వల్లనే రుణాలు మంజూ రవుతున్నట్టు భావిస్తున్న సంఘాల సభ్యులు వాటాలు సమర్పించుకుంటూ నష్టపోతున్నారు. కొత్తగా సంఘం ఏర్పాటు చేసుకొనే మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ వ్యవహారాలు అధికంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వాటాల వ్యవహారం రుణాల రికవరీ మీద ప్రభావం పడుతుంది. వాటాలు మినహా మిగతా రుణ డబ్బులు చెల్లిస్తామని సంఘాలు చెబుతున్నాయని, ఎం దుకని అడిగితే ముందే ఆర్పీలకు డబ్బు కట్టామని పలు సంఘాల సభ్యులు చెబుతున్నారని బ్యాంకు అధికారి చెప్పారు. అవకతవకలను అరికట్టేందుకే.. సంఘాల ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను అరికట్టేందుకు బ్యాంకు లింకేజీ, రుణాల మంజూరులో ఆర్పీల ప్రమేయం లేకుండా చేస్తున్నాం. ఈ మేరకు మెప్మా జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ ఇటీవల బ్యాంకులకు లేఖలు రాశారు. కొందరు ఆర్పీలు రుణాల మంజూరు చేయించినందుకు డబ్బులు తీసుకోవడం వల్ల సంఘాల సభ్యులు నష్టపోతున్నారు. నిజాయితీగా పొదుపు చేసిన సంఘాలకు రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటాల వ్యవహారాలను పూర్తిగా నిర్మూలించి సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - ఏపీడీ బ్రహ్మయ్య -
వడ్డీ రాయితీ సున్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్ :మహిళా సంఘాలను ఈ ప్రభుత్వం నట్టేట ముంచేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు పూర్తిగా మర్చిపోయింది. ఇక గత ప్రభుత్వం ప్రకటించిన సున్నా వడ్డీ రాయితీ కూడా విడుదల చేయడంలేదు, ఫలితంగా మహిళా సంఘాలు క్రమంగా నీరసిస్తున్నాయి. 2012 జూలైలో అప్పటి ప్రభుత్వం మహిళా స్వయంశక్తి సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు మూడు విడతల్లో వడ్డీ రాయితీ కూడా విడుదల చేసింది. అయితే గత 15 నెలలుగా దీన్ని విడుదల చేయకపోవడంతో బ్యాంకుల్లో సంఘాల పేరిట బకాయిలో భారీగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో 33,900 సంఘాలకు సంబంధించి గత డిసెంబర్ నాటికే రూ.629 కోట్ల రుణాలు ఉన్నాయి. వీటికి వడ్డీ రూపంలో మరో రూ.69 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ భారం సంఘాలపైన పడుతోంది, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో స్వయంశక్తి సంఘాలకు పావలా వడ్డీ రుణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయన ఉన్నన్నాళ్లు ప్రతి మూడు నెలలకు వడ్డీని లెక్క గట్టి, అందులో 75 శాతాన్ని నేరుగా మహిళా సంఘాల ఖాతాలకు జమ చేసేవారు, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం మహిళలకు మరింత చేరువకావాలన్న ఉద్దేశంతో సున్నా వడ్డీ రాయితీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ ప్రభుత్వంతోపాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రాయితీ మొత్తాలను విడుదల చేయడంలో విఫలమయ్యాయి. రుణమాఫీ ఊసే లేదు వడ్డీ రాయితీ పరిస్థితి అలా ఉంటే.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కొత్తలో ఏవో ప్రకటనలు చేసినా.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. హామీలను నమ్మి నెల వాయిదాలు కట్టడం మానేసిన మహిళా సంఘలు ప్రభుత్వం తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యి. కొన్ని బ్యాంకులు వడ్డీ కింద సంఘాల పొదుపు ఖాతాల్లోని నగదును వారికి చెప్పకుండానే జమచేసుకుంటున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి జిల్లాలో మాఫీకి అర్హమైన 37,488 సంఘాల పేరిట రూ.447 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. సంఘానికి లక్ష రూపాయలు చొప్పున విడుదల చేస్తామని రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పొంతన లేని హామీలతో ప్రభుత్వం తమను మోసం చేస్తోందని మహిళా సంఘాల సభ్యులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టకపోతే గ్రూపు రద్దు చేస్తామంటున్నారు రుణం మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న రుణాలకు వడ్డీలు గుంజుతున్నారు. ఇందిరాగాంధీ గ్రూపు ద్వారా రూ.1.60 లక్షల రుణం కట్టాల్సి ఉంది. ఈ మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు సభ్యురాలికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి, రుణంతో పాటు సుమారు రూ. 25 వేల వడ్డీ చెల్లించమంటున్నారు. ఈ మొత్తం చెల్లించకపోతే గ్రూపును రద్దు చేస్తామని ఐకేపీ అధికారులు హెచ్చరిస్తున్నారు. -వై.లక్ష్మి, ఇందిరాగాంధీ గ్రూపు అధ్యక్షురాలు, ధర్మవరం ఇప్పటికే రూ.20 వేల వడ్డీ చెల్లించాం రుద్రమదేవీ గ్రూపు సభ్యులు రూ. 2 లక్షల రూణం కట్టాల్సి ఉంది. రుణమాఫీ వస్తుంది.. కట్టనక్కర్లేదని చెప్పారు. తీరా ఇప్పుడు రుణమాఫీ లేదని, ఎప్పుడో సభ్యురాలికి పదివేలు చొప్పున ఇస్తాం.. ఇప్పడు మాత్రం అప్పుతో పాటు వడ్డీలు చెల్లించాలని అంటున్నారు. ఇప్పటికే మా పొదుపు సొమ్ము నుంచి రూ. 20 వేల వడ్డీ కట్టించుకున్నారు. ఇంకా రూ.రెండు లక్షల రుణంతో పాటు రూ.9 వేల వడ్డీ కట్టమంటున్నారు. - యండ సత్తెమ్మ, రుద్రమదేవి గ్రూపు అధ్యక్షురాలు, ధర్మవరం -
ఇసుక దందా!
వేగావతి నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ఉన్నతాధికారులకు ఐకేపీ అధికారుల ఫిర్యాదు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయని స్థానిక అధికారులు బొబ్బిలి : వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. నది నుంచి ఇసుక తరలింపునకు అనుమతి లేకపోయినా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. రాత్రి పది నుంచి తెల్లారి నాలుగు గంటల వరకూ వందలాది ట్రాక్ట ర్లు, ఎడ్ల బళ్లతో దందా కొనసాగిస్తున్నా రు. ఈ అక్రమాన్ని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తూ.. మరింత సహా య సహకారాలు అందిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాలు వల్ల ఒకరు ఈ అక్రమాన్ని ప్రోత్సహిస్తుంటే, మరొకరు వాటికి అడ్డుకట్ట వేస్తూ.. పోలీసులకు అప్పగిస్తున్నారు. బొబ్బిలి మండలంలో ఇసుక రవాణాకు ప్రధాన వనరు వేగావతి నది. ప్రభుత్వం విధి విధానాలు ఏర్పాటు చేయకముందు పారాది, పెం ట, అలజంగి, కారాడ, కొత్తపెంట ఇలా ఎక్కడ దొరికితే అక్కడ నాటుబళ్లు నుంచి లారీల వరకూ ఇసుకను తరలించేవారు. అప్ప ట్లో గ్రామాల్లో ఉన్న కట్టుబాట్లుతో గ్రామ కమిటీలే ఇసుకను తరలించడానికి డబ్బులు వసూలు చేసేవారు. అయితే ప్ర భుత్వం ఇసుకకు కూడా ధర నిర్ణయించడంతో పారాది రీచ్‌ను గత ఏడాది నవంబరు 7, పెంట దగ్గర రీచ్‌ను నవంబరు 10న అధికారులు ప్రారంభించారు. క్యూ బిక్ మీటరుకు 500 రూపాయల చొప్పున ఇసుక అవసరమున్న వాళ్లు మీసేవా కేంద్రాల్లో డబ్బులు కట్టాలి. ఆ వివరాలు వెంటనే ఆయా మహిళా సంఘాలకు ఆన్లైన్లో వెళుతుంది. అక్కడ నుంచి ట్రాక్ట ర్లు ద్వారా వాటిని లబ్ధిదారులకు చేరవేస్తున్నారు. ట్రాక్టరు ఇసుక మూడు క్యూ బిక్ మీటర్లు అంటే 1500 రూపాయలు అవ్వగా, రవాణా ఛార్జీలు ఆరు వందల రూపాయలు అవుతుంది.ఇప్పటివరకూ పారాది రీచ్ నుంచి 3100 క్యూబిక్ మీట ర్లు, పెంట రీచ్ నుంచి 2600 క్యూబిక్ మీ టర్లు ఇసుక విక్రయాలు జరిగాయి. అయితే వారం రోజులుగా ఇసుక రవాణాకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం గణనీయంగా తగ్గిపోయింది. రోజుకు 35 ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తరలించే పరి స్థితి గతంలో ఉంటే, ఇప్పుడు ఆరేడు ట్రాక్టర్లు కూడా తిరగకపోవడంతో ఇందిరాకాంతి పథం అధికారులు అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో అతి సులభంగా వందల రూపాయల్లోనే ఇసుకను తరలించే పరిస్థితి నుం చి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి రావడం తో అక్రమార్కులు రంగంలోకి దిగారు. భవన నిర్మాణాలు చేపట్టిన కాంట్రా క్టర్లతో కుమ్మక్కై అనధికార రవాణాకు తె ర తీశారు. రాత్రి వేళ రవాణాకు అధికారులను సహితం మెత్తపెట్టి వారి పనులు స జావుగా జరుపుకుంటున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల నేతృత్వంలో జరుగుతున్న ఇసుక విక్రయాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై, సా యంత్రం ఐదారు గంటలతో ముగుస్తుం ది. ఆ సయమం దాటిన తరువాత అక్ర మ రవాణా జోరు అందుకుంటుంది. మండలంలోని అలజంగి, కారాడ, కొత్తపెంట, బాడంగి మండలం పాల్తేరు వద్ద ఉన్న వేగావతి నది నుంచి రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుకను తరలించుకుపోతు న్నారని స్వయంగా రీచ్‌ల వద్ద ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లే చెప్పే పరిస్థితి ఉంది. బొబ్బిలిలో ట్రైనీ ఎస్ఐగా పని చేసిన జీడీ బాబు రాత్రి వేళ పెట్రోలింగు చేస్తున్నప్పుడు ప్రతి రోజూ ఇసుక బళ్లను స్వాధీనం చేసుకొని అడ్డుకొనే వా రు. అయితే రెవెన్యూ అధికారులు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులు కూడా నిరుత్సాహపడడం మొదలు పెట్టారు. గతంలో పోలీసులు అనుభవించిన పరిస్థితే ఇప్పుడు ఐకేపీ అధికారులకు కూడా ఎదురవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే ఈ ఇసుక సిండికేట్లు ఇంకా విస్తరించే అవకాశం లేకపోలేదు. -
సేవలు బంద్!
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ సమాఖ్య అకౌంటెంట్లు (వీవోఏలు) కొద్ది రోజులుగా చేస్తున్న సమ్మె మహిళా సం ఘాల సేవలపై పెను ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా వారి సేవలు నిలిచిపోయాయి. బకాయి జీతాలు చెల్లించాలని, ఇతర డిమాండ్ల పరిష్కా రం కోరుతూ వీవోఏలు ఈ నెల 15 తేదీ నుంచి సమ్మెబాట పట్టిన విషయం విదితమే. దీంతో వీవోఏలు గ్రామ స్థాయిలో నిర్వహించాల్సిన విధులు, కార్యక్రమాలు, సంఘాల ప్రణాళికలు ఎక్కడివక్కడ స్తంభించిపోయూయి. ఇప్పటికే రుణ మాఫీ లేకపోడంతోపాటు ఆరు నెలలుగా నెల వాయిదాలు కూడా మహిళా సంఘాలు చెల్లించలేదు. దీంతో వడ్డీ పెరిగిపోయింది. దీని కితోడు పొదుపు నుంచి నుంచి బ్యాంకు ఆధికారులు రికవరీలు చేయడంతో ఇబ్బందుల్లో కూరుకుపోయూయి. ప్రస్తు తం ప్రభుత్వ విధానాలతో బలహీన పడిన సంఘాలకు వీవోఏల సమ్మె మరింత ఆర్థిక పరిస్థితిని కుంగదీసేలా చేసింది. పది రోజులుగా మహిళా సం ఘాల కార్యక్రమాలు నిలిచిపోయావి. ఫలితంగా సంఘాలు మరింత నష్టాల్లోకి వెళ్లగా సంఘ సభ్యులు కష్టాల్లో పడ్డారు. వీవోఏలు నిర్వహిస్తున్న సేవలు మహిళా గ్రూపులకు బ్యాంకుల ద్వారా లింకేజీలు ఇప్పించుట గ్రామంలోని ఉన్న సంఘాల పుస్తకాల నిర్వహణ గ్రామ సంఘం నగదు, ఇతర పుస్తకాల నిర్వహణ సెల్ ద్వారా అన్లైన్లో సంఘాల డేటాను ప్రతి 15 రోజులకు ఒకసారి మొబైల్ కిపింగ్ విధానంలో సమాచారం పంపుట జాబ్ మేళాలు నిర్వహనకు నిరుద్యోగుల సేకరణ బీమా కట్టించుట, క్లయింలు చేయుట, (అయిదు రకాల బీమా పథకాల నిర్వహణ) ఆభయ హస్తం పింఛన్లకి సిఫార్స్ చేయడం బ్యాంకు రుణాలు రికవరీ చేయించుట ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉండుట ప్రతి నెలా సంఘాల సమావేశాలు నిర్వహించుట సంఘాలు అడిట్ చేయించుట బంగారు తల్లి పథకం నిర్వహణ సంఘాలకు ఆధార్ నమోదు చేయించడం మండల సమాఖ్యకి, గ్రామ సమాఖ్యకి అనుసంధానకర్తగా వ్యవహరించడం సాక్షరభారత్ విధుల్లో పాలుపంచుకోవడం, పరీక్షల నిర్వహణ సభలు, సమావేశాలకు జన సమీకరణ ప్రభుత్వ కార్యక్రమాలు ఎయిడ్స్, వైద్యసేవలు, సర్వేలు, గ్రామ స్థాయిలో జరిగిన అన్ని కార్యక్రమల్లో పాల్గొనడం, అవగాహన కల్పించడం, ఇలా ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలోనూ వీవోఏలు భాగస్వామ్యులుగా ఉండి.. నిరంతర సేవలు అందిస్తున్నారు. వీవోఏల సమ్మెతో నిలిచిన సేవలు కొత్త లింకేజీలు పది రోజులుగా జరగడంలేదు నిలిచిన బ్యాంకు లింకేజీ రికరీలు, ఎంఎంఎస్, ఏజీఎస్వై, స్త్రీనిధి రికవరీలు నిలిచిన మొబైల్ కీపింగ్ సేవలు స్తంభించిన గ్రామ సంఘం, మహిళా సంఘాల పుస్తకాల నిర్వహన నిలిచిన బీమా పథకం ప్రీమియం వసూళ్లు ఆగిన బీమా క్లైంల చెల్లింపులు ఆగిపోరుున గ్రామ సభల నిర్వహణ ఆధార్ నమోదు, బంగారు తల్లి దరఖాస్తుల స్వీకరణ ఆగిన ఆడిట్ నిర్వహణ, వీవోఏల ప్రధాన డిమాండ్లు 15 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి మొబైల్ బుక్కీపింగ్కు నెలకు సంఘానికి రూ. 50 వీవో బుక్స్ రాసినందుకు నెలకు రూ. 300 బకాయితో సహా చెల్లించాలి. అభయహస్తం, ఆర్‌డబ్ల్యూస్ సర్వే రుసుం వెంటనే చెల్లించాలి. జిల్లా స్థాయిలో జాయింట్ మీటింగ్ యూనియన్ లీడర్స్‌తో ఏర్పాటు చేయాలి. పెన్షనర్స్, రుణమాఫీ సమాచారం సేకరించినందుకు రుసుము నిర్ణయించి చెల్లించాలి. రాజకీయ వేధింపులు, అధికారుల తొలగింపులు ఆపాలి. గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందరికీ ఇవ్వాలి -
ఐకేపీ సిబ్బంది చేతివాటం
మెదక్ రూరల్, న్యూస్‌లైన్ : ఐకేపీ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి మహిళా గ్రూపు సభ్యులకు తెలియకుండా రూ.లక్షలను స్వాహా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి బాధిత మహిళల కథనం ఇలా ఉంది. మెదక్ మండల పరిధిలోని హవేళిఘణపూర్ గ్రామంలో 34 మహిళా గ్రూపులున్నాయి. కాగా గ్రామానికి చెందిన స్రవంతి, శ్రీఆంజనేయ, ఇందిర గ్రూపులతో పాటు శ్రీనిధి పథకం నుంచి సదరు సభ్యులకు తెలియకుండా గ్రామ వెలుగు సీఏ కార్యాలయానికి చెందిన ఓ అధికారిణి సహకారంతో సుమారు రూ. 5 లక్షలను డ్రాచేశారని బాధిత మహిళలు శనివారం విలేకరుల ముందు వాపోయారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమకు తెలియకుండానే ఖాతాలనుంచి గత ఆరునెలలుగా డబ్బులను డ్రా చేశారని పేర్కొన్నారు. ఈ విషయం తమకు తెలియడంతో సంబంధిత ఐకేపీ అధికారుల దృష్టికి తీసుకవెళ్లామన్నారు. వారు వచ్చి డ్రా చేసిన డబ్బులను తిరిగి బ్యాంకులో జమ చేయాలని చెప్పి, సదరు వెలుగు సీఏకు కొంత సమయం ఇచ్చారని తెలిపారు. దీంతో కొద్దిపాటి డబ్బులను తిరిగి చెల్లించిన సదరు సీఏ ఇచ్చిన వాయిదాల ప్రకారం బ్యాంకులో కట్టడంలేదని తెలిపారు. దీంతో తమకు ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలను కోల్పోతున్నామని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమానికి పాల్పడిన సీఏతో పాటు ఆమెకు సహకరించిన అధికారిపై చట్టరీత్యా చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అధికారి వివరణ ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం సరితను న్యూస్‌లైన్ వివరణ కోరగా హవేళిఘణపూర్ గ్రామంలో మూడు మహిళా గ్రూపులతో పాటు శ్రీనిధి నుంచి గ్రామ సీఏ సుమారు రూ. 5 లక్షలు స్వాహా చేసిన మాట వాస్తవమేనన్నారు. కాగా తిరిగి బ్యాంకులో జమచేయాలని చెప్పి కొంత వ్యవధి ఇచ్చామన్నారు. ఇప్పటివరకు రూ. 50 వేలు రికవరీ చేశామని త్వరలో మొత్తం రికవరీ చేస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన గడువులోగా చెల్లించకుంటే పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడతామని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఐకేపీ ప్రాజెక్టు డెరైక్టర్ దృష్టికి సైతం తీసుకవెళ్లామని తెలిపారు. కాగా ఈ విషయంలో సీఏతో పాటు మరో అధికారి హస్తం ఉందని సదరు సీఏ తెలిపారన్నారు. కాగా ఆదిశగా కూడా విచారణ చేపడతున్నామని తెలిపారు. విచారణలో వాస్తవాలు తేలితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
నారి- సమరభేరి
ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు నానాతంటాలు పడుతున్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వివిధ పథకాలను ప్రకటిస్తున్నాయి. గడచిన ఏడాదికాలంలో ఢిల్లీలో మహిళలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఒకవైపు మహిళలకు భద్రత కల్పించాలనే డిమాండ్‌తోపాటు వారి హక్కుల పరిరక్షణ కోసం పలు రూపాల్లో ఉద్యమాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులు, లింగ వివక్ష నుంచి విముక్తి కల్పించాలంటూ అనేక మహిళా సంఘాలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదుపరి ఏర్పాటయ్యే ప్రభుత్వం.... రాజధాని నగరంలో మహిళల కోసం అవలంబించాల్సిన విధివిధానాలపై రెండు స్వచ్ఛంద మహిళా సంస్థలు మేనిఫెస్టోను విడుదల చేశాయి. న్యూఢిల్లీ:దేశ రాజధానిలోనే తొలిసారిగా రెండు ప్రముఖ మహిళా సంఘాలు గురువారం ఓ మేనిఫెస్టోను విడుదల చేశాయి. తమ తమ మేనిఫెస్టోలో మహిళలపట్ల వివక్ష సమస్య పరిష్కారానికి కట్టుబడాలని ఆయా పార్టీలకు ఈ రెండు సంఘాలు ఈ సందర్భంగా సూచించాయి. సార్వత్రిక, శాసనసభ ఎన్నికల్లో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని అవి సూచించాయి. మహిళా వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ సంస్థతోపాటు, ఉమెన్ పవర్ కనెక్ట్ (డబ్ల్యూపీసీ)లు ముసాయిదా ప్రణాళికను తయారుచేశాయి. ఈ విషయమై సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ సంస్థ డెరైక్టర్ రంజనాకుమారి మాట్లాడుతూ ‘మహిళల పట్ల వివక్షను అంతమొందించే విషయంలో నిబద్ధతతో వ్యవహరించాలి. రాజకీయ పార్టీలన్నీ మహిళలపట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. సమాజంలో లింగ సమానత్వాన్ని అమల్లోకి తీసుకొస్తామంటూ హామీ ఇవ్వాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేపట్టి 17 సంవత్సరాలైంది. అందువల్ల మా పిలుపునకు అన్ని రాజకీయ పార్టీలు స్పందించాల్సిన తరుణమిదే’నని అన్నారు. కాగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో రంజనాకుమారి, డబ్ల్యూపీసీ సీనియర్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రాధికా ఖజూరియా, స్త్రీ శక్తి సంస్థ అధ్యక్షురాలు రేఖామోడీ, ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ సంస్థ అధ్యక్షురాలు బీనా జైన్లు పాల్గొన్నారు.కాగా శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామంటూ ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఈ విషయమై సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ సంస్థ డెరైక్టర్ రంజనాకుమారి డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత, పౌష్టికాహారం, విద్య, ఉపాధి అవకాశాలు, ఆరోగ్యం తదితర విషయాల్లో అన్నిపార్టీలు చురుకైన పాత్ర పోషించాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు తప్పనిసరిగా తమవంతు కృషి చేయాలన్నారు. మహిళలు, ఆడశిశువులపట్ల వివక్షను అంతమొందించాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని అన్నారు. దీనినే ఈ మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కేడర్‌లో మహిళలు కూడా ఉండేవిధంగా చూడాలన్నారు. పార్టీలో లింగ సమానత్వం తప్పనిసరిగా పాటించేవిధంగా చేయాలన్నారు. అన్ని వ్యవస్థల్లోనూ మహిళా భాగస్వామ్యం ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. 33 శాతం రిజర్వేషన్ అనేది మహిళల హక్కు అని పేర్కొన్నారు. వాస్తవానికి మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండాలని కోరుకోవడం లేదన్నారు. కేవలం 33 శాతం మాత్రమే కోరుతున్నామన్నారు. వ్యవస్థలను సక్రమంగా, సమర్థంగా నడపగలిగే సామర్థ్యం మహిళలకు ఉందని, అందువల్లనే వారికి ఇవ్వాలని కోరుతున్నామని ఆమె వివరించారు.