వేగావతి నది నుంచి యథేచ్ఛగా
ఇసుక అక్రమ రవాణా
ఉన్నతాధికారులకు ఐకేపీ అధికారుల ఫిర్యాదు
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయని స్థానిక అధికారులు
బొబ్బిలి : వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. నది నుంచి ఇసుక తరలింపునకు అనుమతి లేకపోయినా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. రాత్రి పది నుంచి తెల్లారి నాలుగు గంటల వరకూ వందలాది ట్రాక్ట ర్లు, ఎడ్ల బళ్లతో దందా కొనసాగిస్తున్నా రు. ఈ అక్రమాన్ని అరికట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తూ.. మరింత సహా య సహకారాలు అందిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాల మధ్య ఏర్పడిన అంతర్గత విభేదాలు వల్ల ఒకరు ఈ అక్రమాన్ని ప్రోత్సహిస్తుంటే, మరొకరు వాటికి అడ్డుకట్ట వేస్తూ.. పోలీసులకు అప్పగిస్తున్నారు.
బొబ్బిలి మండలంలో ఇసుక రవాణాకు ప్రధాన వనరు వేగావతి నది. ప్రభుత్వం విధి విధానాలు ఏర్పాటు చేయకముందు పారాది, పెం ట, అలజంగి, కారాడ, కొత్తపెంట ఇలా ఎక్కడ దొరికితే అక్కడ నాటుబళ్లు నుంచి లారీల వరకూ ఇసుకను తరలించేవారు. అప్ప ట్లో గ్రామాల్లో ఉన్న కట్టుబాట్లుతో గ్రామ కమిటీలే ఇసుకను తరలించడానికి డబ్బులు వసూలు చేసేవారు. అయితే ప్ర భుత్వం ఇసుకకు కూడా ధర నిర్ణయించడంతో పారాది రీచ్‌ను గత ఏడాది నవంబరు 7, పెంట దగ్గర రీచ్‌ను నవంబరు 10న అధికారులు ప్రారంభించారు. క్యూ బిక్ మీటరుకు 500 రూపాయల చొప్పున ఇసుక అవసరమున్న వాళ్లు మీసేవా కేంద్రాల్లో డబ్బులు కట్టాలి. ఆ వివరాలు వెంటనే ఆయా మహిళా సంఘాలకు ఆన్‌లైన్‌లో వెళుతుంది.
అక్కడ నుంచి ట్రాక్ట ర్లు ద్వారా వాటిని లబ్ధిదారులకు చేరవేస్తున్నారు. ట్రాక్టరు ఇసుక మూడు క్యూ బిక్ మీటర్లు అంటే 1500 రూపాయలు అవ్వగా, రవాణా ఛార్జీలు ఆరు వందల రూపాయలు అవుతుంది.ఇప్పటివరకూ పారాది రీచ్ నుంచి 3100 క్యూబిక్ మీట ర్లు, పెంట రీచ్ నుంచి 2600 క్యూబిక్ మీ టర్లు ఇసుక విక్రయాలు జరిగాయి. అయితే వారం రోజులుగా ఇసుక రవాణాకు ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం గణనీయంగా తగ్గిపోయింది. రోజుకు 35 ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తరలించే పరి స్థితి గతంలో ఉంటే, ఇప్పుడు ఆరేడు ట్రాక్టర్లు కూడా తిరగకపోవడంతో ఇందిరాకాంతి పథం అధికారులు అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
గతంలో అతి సులభంగా వందల రూపాయల్లోనే ఇసుకను తరలించే పరిస్థితి నుం చి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి రావడం తో అక్రమార్కులు రంగంలోకి దిగారు. భవన నిర్మాణాలు చేపట్టిన కాంట్రా క్టర్లతో కుమ్మక్కై అనధికార రవాణాకు తె ర తీశారు. రాత్రి వేళ రవాణాకు అధికారులను సహితం మెత్తపెట్టి వారి పనులు స జావుగా జరుపుకుంటున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల నేతృత్వంలో జరుగుతున్న ఇసుక విక్రయాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై, సా యంత్రం ఐదారు గంటలతో ముగుస్తుం ది. ఆ సయమం దాటిన తరువాత అక్ర మ రవాణా జోరు అందుకుంటుంది. మండలంలోని అలజంగి, కారాడ, కొత్తపెంట, బాడంగి మండలం పాల్తేరు వద్ద ఉన్న వేగావతి నది నుంచి రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుకను తరలించుకుపోతు న్నారని స్వయంగా రీచ్‌ల వద్ద ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ల డ్రైవర్లే చెప్పే పరిస్థితి ఉంది.
బొబ్బిలిలో ట్రైనీ ఎస్‌ఐగా పని చేసిన జీడీ బాబు రాత్రి వేళ పెట్రోలింగు చేస్తున్నప్పుడు ప్రతి రోజూ ఇసుక బళ్లను స్వాధీనం చేసుకొని అడ్డుకొనే వా రు. అయితే రెవెన్యూ అధికారులు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోవడంతో పోలీసులు కూడా నిరుత్సాహపడడం మొదలు పెట్టారు. గతంలో పోలీసులు అనుభవించిన పరిస్థితే ఇప్పుడు ఐకేపీ అధికారులకు కూడా ఎదురవుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకపోతే ఈ ఇసుక సిండికేట్లు ఇంకా విస్తరించే అవకాశం లేకపోలేదు.
ఇసుక దందా!
Published Thu, Feb 19 2015 12:30 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement
Advertisement