సేవలు బంద్!
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ సమాఖ్య అకౌంటెంట్లు (వీవోఏలు) కొద్ది రోజులుగా చేస్తున్న సమ్మె మహిళా సం ఘాల సేవలపై పెను ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా వారి సేవలు నిలిచిపోయాయి. బకాయి జీతాలు చెల్లించాలని, ఇతర డిమాండ్ల పరిష్కా రం కోరుతూ వీవోఏలు ఈ నెల 15 తేదీ నుంచి సమ్మెబాట పట్టిన విషయం విదితమే. దీంతో వీవోఏలు గ్రామ స్థాయిలో నిర్వహించాల్సిన విధులు, కార్యక్రమాలు, సంఘాల ప్రణాళికలు ఎక్కడివక్కడ స్తంభించిపోయూయి. ఇప్పటికే రుణ మాఫీ లేకపోడంతోపాటు ఆరు నెలలుగా నెల వాయిదాలు కూడా మహిళా సంఘాలు చెల్లించలేదు. దీంతో వడ్డీ పెరిగిపోయింది. దీని కితోడు పొదుపు నుంచి నుంచి బ్యాంకు ఆధికారులు రికవరీలు చేయడంతో ఇబ్బందుల్లో కూరుకుపోయూయి. ప్రస్తు తం ప్రభుత్వ విధానాలతో బలహీన పడిన సంఘాలకు వీవోఏల సమ్మె మరింత ఆర్థిక పరిస్థితిని కుంగదీసేలా చేసింది. పది రోజులుగా మహిళా సం ఘాల కార్యక్రమాలు నిలిచిపోయావి. ఫలితంగా సంఘాలు మరింత నష్టాల్లోకి వెళ్లగా సంఘ సభ్యులు కష్టాల్లో పడ్డారు.
వీవోఏలు నిర్వహిస్తున్న సేవలు
మహిళా గ్రూపులకు బ్యాంకుల ద్వారా లింకేజీలు ఇప్పించుట
గ్రామంలోని ఉన్న సంఘాల పుస్తకాల నిర్వహణ
గ్రామ సంఘం నగదు, ఇతర పుస్తకాల నిర్వహణ
సెల్ ద్వారా అన్‌లైన్‌లో సంఘాల డేటాను ప్రతి 15 రోజులకు ఒకసారి మొబైల్ కిపింగ్ విధానంలో సమాచారం పంపుట
జాబ్ మేళాలు నిర్వహనకు నిరుద్యోగుల సేకరణ
బీమా కట్టించుట, క్లయింలు చేయుట, (అయిదు రకాల బీమా పథకాల నిర్వహణ)
ఆభయ హస్తం పింఛన్లకి సిఫార్స్ చేయడం
బ్యాంకు రుణాలు రికవరీ చేయించుట
ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉండుట
ప్రతి నెలా సంఘాల సమావేశాలు నిర్వహించుట
సంఘాలు అడిట్ చేయించుట
బంగారు తల్లి పథకం నిర్వహణ
సంఘాలకు ఆధార్ నమోదు చేయించడం
మండల సమాఖ్యకి, గ్రామ సమాఖ్యకి అనుసంధానకర్తగా వ్యవహరించడం
సాక్షరభారత్ విధుల్లో పాలుపంచుకోవడం, పరీక్షల నిర్వహణ
సభలు, సమావేశాలకు జన సమీకరణ
ప్రభుత్వ కార్యక్రమాలు ఎయిడ్స్, వైద్యసేవలు, సర్వేలు, గ్రామ స్థాయిలో జరిగిన అన్ని కార్యక్రమల్లో పాల్గొనడం, అవగాహన కల్పించడం, ఇలా ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలోనూ వీవోఏలు భాగస్వామ్యులుగా ఉండి.. నిరంతర సేవలు అందిస్తున్నారు.
వీవోఏల సమ్మెతో నిలిచిన సేవలు
కొత్త లింకేజీలు పది రోజులుగా జరగడంలేదు
నిలిచిన బ్యాంకు లింకేజీ రికరీలు, ఎంఎంఎస్, ఏజీఎస్‌వై, స్త్రీనిధి రికవరీలు
నిలిచిన మొబైల్ కీపింగ్ సేవలు
స్తంభించిన గ్రామ సంఘం, మహిళా సంఘాల పుస్తకాల నిర్వహన
నిలిచిన బీమా పథకం ప్రీమియం వసూళ్లు
ఆగిన బీమా క్లైంల చెల్లింపులు
ఆగిపోరుున గ్రామ సభల నిర్వహణ
ఆధార్ నమోదు, బంగారు తల్లి దరఖాస్తుల స్వీకరణ
ఆగిన ఆడిట్ నిర్వహణ,
వీవోఏల ప్రధాన డిమాండ్లు
15 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి
మొబైల్ బుక్‌కీపింగ్‌కు నెలకు సంఘానికి రూ. 50 వీవో బుక్స్ రాసినందుకు నెలకు రూ. 300 బకాయితో సహా చెల్లించాలి.
అభయహస్తం, ఆర్‌డబ్ల్యూస్ సర్వే రుసుం వెంటనే చెల్లించాలి.
జిల్లా స్థాయిలో జాయింట్ మీటింగ్ యూనియన్ లీడర్స్‌తో ఏర్పాటు చేయాలి.
పెన్షనర్స్, రుణమాఫీ సమాచారం సేకరించినందుకు రుసుము నిర్ణయించి చెల్లించాలి.
రాజకీయ వేధింపులు, అధికారుల తొలగింపులు ఆపాలి.
గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు అందరికీ ఇవ్వాలి