ఎన్నికలకు ముందు రైతులు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం... బ్యాంకులకు రూపాయి చెల్లించవద్దు.. మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపైనే అంటూ హామీలు గుప్పించారు. అధికారం చేపట్టాక హామీలను మాఫీ చేస్తున్నారు. రోజుకో నిబంధన, పూటకో ఉత్తర్వులతో అందరినీ ఆయోమయూనికి గురిచేస్తూ మోసం చేస్తున్నారు. ఇదెక్కడి పాలన బాబూ అంటూ సీఎం చంద్రబాబునాయుడు తీరుపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తిరగబడే రోజు వచ్చేసరికి రూ.50 వేల రుణం మాఫీ చేస్తామంటూ ప్రకటనలు చేశారు. మొదటి విడతగా పంట రుణాలను, రెండో విడతగా రీషెడ్యూల్ రైతులకు, మూడో విడతగా బంగారు రుణాలు మాఫీ చేస్తామంటూ చెబుతున్నారు. మీ పాలనను ఇంకా నమ్మమంటారా అంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ రైతు వ్యతిరేకేనన్నది మరోసారి రుజువైందని విమర్శిస్తున్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజాతిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.
-శ్రీకాకుళం అగ్రికల్చర్/పాలకొండ/పలాస/సరుబుజ్జిలి/శ్రీకాకుళం అర్బన్/పలాస/మందస/ఆమదాలవలస రూరల్
భష్మాసుర హస్తం
చంద్రబాబు ఎన్నికల ముందు నుంచి రుణమాఫీ జపం చేస్తూనే ఉన్నారు. ఆరు నెలలు గడిచాక కుక్కలు మొరిగినట్టు ఇప్పుడేమో ఎంగిలిచేయి రైతుల వైపు దులిపేశారు. ఒక్కో రైతుకు రూ.లక్షకుపైబడి అప్పులు ఉంటే 20 శాతం ఇస్తారట. ఇలా అయితే రైతులకు రుణాలు ఎలా వస్తాయి. అటుతిప్పి ఇటుతిప్పి భష్మాసురహస్తం రైతునెత్తిన పెట్టేశాడు.
- ఖండాపు ప్రసాదరావు,
జిల్లా ఏరువాక సలహామండలి సభ్యులు
పాతపాలనే చూపిస్తున్నారు
2004 ముందు టీడీపీ ప్రభుత్వం అధినేత వ్యవసాయం దండగ అని రైతులు చిన్నబుచ్చుకునేలా పాలనసాగించారు. పాలనకు తొమ్మిదేళ్లు దూరమయ్యూరు. ఇప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆశ కల్పించారు. ఓట్లు దండుకున్నారు. పాతపాలనే చూపిస్తున్నారు. మళ్లీ రైతులు కూడా టీడీపీని ప్రతిపక్షంలోకే నెట్టేయడం ఖాయం. - గురుగుబెల్లి చలపతిరావు, రైతు,
బొబ్బిలిపేట గ్రామం, ఆమదాలవలస మండలం
ప్రజలు తిరగబడే రోజు వచ్చేసరికి...
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. అందుకే ఎంగిలిచేయి దులిపినట్టు రూ.50 వేల పంట రుణాన్ని మాఫీ చేస్తామంటూ ప్రకటించారు. దీనిని కూడా నమ్మలేం. ఐదు విడతలుగా రుణమాఫీ చేస్తామని, అందుకు బాండ్లు ఇస్తామని చెప్పడం మళ్లీ మోసం చేయడమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న మహాధర్నా కార్యక్రమంలో రైతులు పాల్గొనకుండా అడ్డుకోవడానికే మరో మోసపూరితమైన రుణమాఫీ ప్రకటనను చంద్రబాబు చేశారు. ఈ ఎత్తుగడలు సాగవు. బాబును నమ్మే రోజులు పోయాయి.
-జుత్తు జగన్నాయకులు, పలాస మాజీ ఎమ్మెల్యే
వాయిదాల పద్ధతి సరికాదు
వారుుదాల పద్ధతిలో రుణమాఫీ సరికాదు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి ఇపుడు రూ.50 వేల రుణగ్రహీతల రైతులకు పూర్తిగా చెల్లించి, ఆపైన రుణాలు తీసుకున్న రైతులకు మెలికలు పెట్టడం రైతులను మోసగించడమే. వ్యయవసాయ రుణాలన్నీ ఒకేసారి మాఫీ చేయూలి.
- బొంగి మల్లేశ్వరరావు, రైతు, సిద్ధిగాం, మందస మండలం
దగాచేశారు
చంద్రబాబు తొలి నుంచి ప్రజలను కళ్లబొళ్లి మాటలతో దగా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అంటూ దాదాపు ఆరు నెలలు దాటవేశారు. రూ.లక్షల్లో అప్పు లు ఉంటే ఇప్పుడు వేలల్లో పరిహారం చెల్లిస్తామని, మిగిలిన అప్పులను తమ పదవీ కాలం వరకు చెల్లిస్తూనే ఉంటామని చెప్పడం విడ్డూరం. ఇదేనా రైతు సంక్షేమం.
- విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్యే, పాలకొండ
హామీలు ‘మాఫీ’
Published Fri, Dec 5 2014 2:11 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement