సాక్షి, గుంటూరు: దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు పరారీలో ఉన్న సుబ్బయ్య ఆచూకీ కోసం పోలీసులు 17 బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మరో వైపు డ్రోన్ కెమెరాలతో కూడా కృష్ణా నది పరసర ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలించారు. ఈ క్రమంలో సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గురజాల మండలం తేలికుట్ల- దైద దగ్గరున్న అమరలింగేశ్వర దేవాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీస్ యంత్రాంగం అక్కడ వెళ్లి సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్య ఎప్పుడు చనిపోయాడనే విషయాన్ని వైద్యులు నిర్థారిస్తారని డీజీపీ మాలకొండయ్య వెల్లడించారు.
అయితే సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్టు తెలిపాడు. అందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డు బయటపడింది. ఆయన ఫోన్ కాల్ సంభాషణలో ‘పదిమందికి మంచి చెప్పి బతికేవాణ్ని.. కానీ అనుకోకుండా జరిగిపోయింది. నాకు చావడం ఒక్కడే మార్గం.. నేను చేయకూడని పని చేశాను. నా మొహం చూపెట్టుకోలేను. నేను చేసిన పనితో నా కొడుకు పరువు పోయింది. చావడానికే వెళ్తున్నాను.’ అని సుబ్బయ్య బంధువులకు తెలిపాడు. ఎలాంటి అఘాత్యం చేసుకోవద్దని బంధువులు వారిస్తున్నా సుబ్బయ్య వినిపించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment