subbaiah
-
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్ జగన్ నివాళులర్పించారు
-
వీర జవాను సుబ్బయ్యకు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి,తాడేపల్లి: వీర జవాను సుబ్బయ్యకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్(ట్విటర్)లో బుధవారం(డిసెంబర్11) ఒక పోస్టు చేశారు.‘రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్. జమ్మూలో విధి నిర్వహణలో సుబ్బయ్య వీరమరణం చెందారు.ల్యాండ్‌మైన్ నుంచి 30 మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నివాళులర్పిస్తున్నా’అని వైఎస్ జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 11, 2024 -
30మందిని కాపాడి ఆర్మీ జవాన్ వీరమరణం
కంభం/నార్పల: తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి కాపాడి.. తాను మాత్రం దాని బారిన బడి ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద సోమవారం విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్ ల్యాండ్‌మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య(45) జమ్మూలోని పూంచ్ జిల్లాలో 30 మంది జవానులతో కలిసి సరిహద్దు వద్ద కాపలా కాస్తున్నాడు. అంతలో అక్కడ ల్యాండ్‌మైన్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే తోటి జవాన్లను దూరంగా పంపించేసి తాను పొరపాటున దాని ఉచ్చులో చిక్కుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. అధికార లాంఛనాలు ముగించుకుని మృతదేహాన్ని బెంగళూరు వరకు విమానంలో.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తరలించనున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి వెంకట సుబ్బయ్య కొన్నేళ్ల కిందట చనిపోగా, తల్లి గాలెమ్మ గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ఆ తల్లి కుమారుడి ఫొటో పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. మృతుడి భార్య లీల స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం నార్పాల. ఇద్దరు పిల్లలతో ఆమె అక్కడే ఉంటోంది. మృతదేహాన్ని నార్పాల గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో బంధువులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్ భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. -
కామ మాంత్రికుడికి టీడీపీ నేతల పరామర్శ
రేణిగుంట(తిరుపతి జిల్లా): రేణిగుంట మండలం తారకరామానగర్‌లో క్షుద్రపూజల పేరుతో ఓ మహిళపై బలాత్కారానికి యత్నించిన కామ మాంత్రికుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ నేతలు తిరుపతి సబ్ జైల్లో పరామర్శించడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ ఎస్టీ సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న సుబ్బయ్య శ్రీకాళహస్తి పట్టణం బహదూర్‌పేటలో భూత మాంత్రికుడి అవతారం ఎత్తి దాదాపు పదేళ్ల నుంచి మంత్రాలు, తాయత్తులు కడుతూ ప్రజల మూఢ విశ్వాసాలను సొమ్ముచేసుకునే వాడు. తాంత్రిక పూజల ముసుగులో అతని అకృత్యాలు నిత్యకృత్యమైనా.. ఎవ్వరూ అతనిని ఎదిరించేందుకు సాహసించలేదు. ఈ క్రమంలో ఈ నెల 14న రేణిగుంట మండలం తారకరామానగర్‌లో క్షుద్రపూజల నెపంతో ఓ మహిళను నగ్నంగా పూజలో కూర్చోవాలని బలవంతం చేసి ఆమె నిరాకరించడంతో బలాత్కారం చేశాడు. ఈ ఘటనతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సుబ్బయ్యను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. కాగా, సబ్ జైల్లో ఉన్న నిందితుడు సుబ్బయ్యను బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురవారెడ్డి, టీడీపీ పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతిబాబు, రాష్ట్ర టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మనోహర్‌నాయక్, అమాస శివకుమార్‌లు కలిసి అరగంటకు పైగా అతనితో మంతనాలు జరిపారు. పార్టీ అధినాయకత్వం అండగా నిలుస్తుందని ఆయనకు భరోసా ఇచ్చారు. మహిళపై అకృత్యానికి పాల్పడి అరెస్టయిన సుబ్బయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని టీడీపీ వర్గాలే భావించాయి. అయితే అనూహ్యంగా జైల్లో ఉన్న అతన్ని కలిసి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంపై టీడీపీ శ్రేణులే నివ్వెరపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు చీదరించుకుంటున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్‌రెడ్డి బలహీనతలు సుబ్బయ్యకు బాగా తెలుసని, అవెక్కడ బయటపడతాయోనని పార్టీ వర్గాలు అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రచారం సాగుతోంది. -
కిలాడీ మాంత్రికుడు టీడీపీ నాయకుడు
-
నగ్నపూజల మాంత్రికుడు.. టీడీపీ నాయకుడు
రేణిగుంట: చేతబడి చేశారేమో అనే అనుమానంతో ఓ మహిళ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి చెందిన మాసారపు సుబ్బయ్య అనే మాంత్రికుణ్ణి ఆశ్రయించగా.. ఆ మాంత్రికుడు ఆమెపై బలాత్కారం చేయబోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ నాయకుడైన సుబ్బయ్య శ్రీకాళహస్తిలో మాంత్రికుడిగా చెలామణి అవుతున్నాడు. రేణిగుంట మండలం కరకంబాడికి చెందిన 35 ఏళ్ల మహిళకు చేతబడి వదిలిస్తానని చెప్పిన సుబ్బయ్య ఈ నెల 14న పూజా సామగ్రితో ఆమె ఇంటికి వెళ్లాడు. పూజలో నగ్నంగా కూర్చోవాలని మాంత్రికుడు సుబ్బయ్య కోరగా.. ఆమె నిరాకరించింది. దీంతో చేతులతో బంధించి బలాత్కారం చేయబోగా.. ఆమె తప్పించుకుని గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కామ మాంత్రికుడు సుబ్బయ్యను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. గోర్లతో రక్కి... చాకుతో పొడవబోయాడు ఆ మహిళ పూజలో నగ్నంగా కూర్చునేందుకు నిరాకరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. మాంత్రికుడు ఆమె వీపు, చేతి భాగంలో గోర్లతో రక్కి బలాత్కారం చేసేందుకు యత్నించాడని రేణిగుంట అర్బన్ సీఐ సుబ్బారెడ్డి వెల్లడించారు. అతని నుంచి విడిపించుకుని బయటకు వచ్చేందుకు ఆ మహిళ ప్రయత్నించగా.. నిమ్మకాయలు కోసిన చాకుతో ఆమెను పొడిచేందుకు ప్రయత్నించాడని తెలిపారు. దీంతో ఆమె ప్రాణభయంతో గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోగా మాంత్రికుడు కారులో పరారయ్యాడన్నారు. పదేళ్ల క్రితం ఆటో డ్రైవర్.. ఇప్పుడు టీడీపీ నేత మాంత్రికుడు మాసారపు సుబ్బయ్య పదేళ్ల క్రితం ఆటో తోలుకుంటూ జీవనం సాగించేవాడు. తనకు మంత్ర శక్తులు తెలసునని స్థానికులను నమ్మించి శ్రీకాళహస్తిలోని బహదూరుపేటలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటి వద్దే తాయెత్తులు కడుతూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నాడు. తిరుపతి జిల్లా టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సుబ్బయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల వెంకటసు«దీర్‌రెడ్డికి నమ్మిన బంటుగా చక్రం తిప్పుతున్నాడు. సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులతో వచ్చే అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి వశపర్చుకుని వారి మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా నిలదీస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడతానంటూ భయపెట్టేవాడు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొజ్జల సుదీర్‌రెడ్డి రాజకీయ భవిష్యత్ బాగుండాలని శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో సుబ్బయ్య తాంత్రిక పూజలు చేసి నరబలులు కూడా ఇచ్చాడన్న ఆరోపణలున్నాయి. దొంగ మాంత్రికుని ముసుగులో అకృత్యాలు, ఆగడాలకు పాల్పడుతున్న సుబ్బయ్య అక్రమాల డొంకను పోలీసులు కదిలించారు. సమగ్ర విచారణ చేపడుతున్నారు. విచారణలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగుచూసే వీలుంది. -
జీవితంలో ఒకటికాలేక.. మరణంతో ఒక్కటయ్యారు!
సాక్షి, చెన్నై: మేనమామ ఇంటికి కోడలిగా వెళ్లాలన్న ఓ యువతి ఆశలు అడియాశలయ్యాయి. తాను ఎంతగానో ప్రేమించిన మేనమామ కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ యువతి కూడా బలవన్మరణానికి పాల్పడింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించక పోవడంతో ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వివరాలు.. తిరునల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన ఆర్ముగం , సరస్వతి దంపతులకు సుధా(22), ఉదయ శంకర్(20) అనే పిల్లలు ఉన్నారు. సుధా ఓ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తన మేనమామ పెరియస్వామి కుమారుడు సుబయ్య(24)ను ప్రేమించింది. సుబయ్య కూడా సుధను ఇష్టపడ్డాడు. ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. అయితే వీరి ప్రేమకు కుటుంబ సభ్యులే అడ్డంకిగా మారారు. చదువుకునే వయస్సులో ప్రేమ వద్దంటూ వారించారు. దీంతో మనస్థాపం చెందిన సుబ్బయ్య బుధవారం రాత్రి పురుగుల మందు తాగేశాడు. ఆస్పత్రికి తరలించగా అర్ధరాత్రి సమయంలో మరణించాడు. ఈ సమాచారంతో సుధా తల్లడిల్లి పోయింది. జీవితంలో ఒకటి కాకున్నా, మరణంలోనైనా ఒక్కటి కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. గురువారం ఓ వైపు సుబయ్య మృతదేహానికి అంత్యక్రియలు జరగగా, మరో వైపు ఇంట్లో ఉరివేసుకుని సుధా ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన సుధా తల్లిదండ్రులు కుమార్తె మృత దేహాన్ని చూసి రోదించారు. ప్రేమను పక్కన పెట్టి చదువుకోవాలని సూచించినందుకు బలవన్మరణానికి పాల్పడి తమకు కడుపు కోత మిగిల్చారని వాపోయారు. చదవండి: (ప్రేమ జంట ఆత్మహత్య) ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
డాక్టర్ హత్య కేసులో ఏడుగురికి ఉరిశిక్ష
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నరాల వైద్యనిపుణుడు సుబ్బయ్యను చెన్నైలో హతమార్చిన కేసులో ఏడుగురికి ఉరిశిక్ష, ఇద్దరికి యావజ్జీవ విధిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. శిక్ష పడినవారిలో ప్రొఫెసర్ దంపతులు, వారి కుమారులు ఉండడం గమనార్హం. వివరాలు..తమిళనాడు, కన్యాకుమారి జిల్లా సామితోప్పునకు చెందిన ప్రభుత్వ డాక్టర్ సుబ్బయ్య 2013 సెప్టెంబర్ 9న చెన్నై రాజాఅన్నామలైçపురంలోని తన క్లినిక్ బయట దాడికి గురై 23న ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. హతుడు సుబ్బయ్య మేనమామ పెరుమాళ్ తన సోదరికి (సుబ్బయ్య తల్లికి) కన్యాకుమారీ జిల్లా అంజుగ్రామంలోని స్థలాన్ని ఇచ్చారు. దీన్ని సమీప బంధువులు ఆక్రమించుకున్నారు. కొన్ని కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని దక్కించుకోవాలని ఇరువర్గాలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. స్థల వివాదం మూడు తరాలుగా నడుస్తూ తీవ్రస్థాయికి చేరుకుంది. 2013లో ఉద్యోగవిరమణ పొందిన డాక్టర్ సుబ్బయ్య న్యాయస్థానం ద్వారా బంధువులపై పోరాడి ఆ స్థలాన్ని దక్కించుకున్నాడు. ఇందుకు కక్షకట్టిన బంధువులు కిరాయి గూండాల సహకారంతో చెన్నైలోని క్లినిక్ వద్ద డాక్టర్ సుబ్బయ్యను దారుణంగా హత్యచేశారు. ఈ కేసులో మేనమామ రెండో భార్య కుమారుడైన ప్రొఫెసర్ పొన్నుస్వామి, అతని భార్య ప్రొఫెసర్ మేరీ పుష్పం, వీరి కుమారులైన న్యాయవాది ఫాసిల్, ఇంజినీర్ బోరిస్‌తోపాటూ న్యాయవాది విల్సన్, ప్రభుత్వ డాక్టర్ జేమ్స్ సతీష్‌కుమార్, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్, మురుగన్, సెల్వప్రకాష్, అయ్యప్పన్.. ఈ పదిమందిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో అయ్యప్పన్ అప్రూవర్‌గా మారిపోయాడు. మొత్తం పది మంది నిందితుల్లో 9 మంది దోషులని నిర్ధారణైనట్లు చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది. పొన్నుస్వామి, న్యాయవాది ఫాజిల్, విలియం, డాక్టర్ జేమ్స్ సతీష్‌కుమార్, ఇంజనీర్ బేరిస్, మురుగన్, సెల్వప్రకాష్‌లకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మేరి పుష్పం, కిరాయి గూండాల్లోని కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఈ హత్య కేసుకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన పొన్నుస్వామి, అతని కుమారులు ఫాజిల్, బోరిస్‌లకు ఉరిశిక్ష పడడం గమనార్హం. అప్రూవర్‌గా మారి కేసు విచారణకు సహకరించిన అయ్యప్పన్‌ను కోర్టు విడిచిపెట్టింది. -
కోటీశ్వరుల్లో నంబర్–1 సుబ్బయ్య
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో అత్యంత ధనవంతుడిగా అన్నాడీఎంకే అభ్యర్థి ఇసక్కి సుబ్బయ్య నిలిచారు. ఆయన ఆస్తి రూ. 246 కోట్లుగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ల సమర్పణలో నిమగ్నమయ్యారు. ఇందులో మంత్రులు, మాజీలు, సిట్టింగ్‌లు అనేక మంది ఉన్నారు. వీరందరి ఆస్తులు కోట్లలోనే ఉన్నాయి. అయితే, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్, ఉపాధ్యక్షుడు మహేంద్రన్ ఆస్తులు మూడు డిజిట్ కోట్లలో ఉన్నాయి. కమలహాసన్ ఆస్తి రూ.177 కోట్లుగా, మహేంద్రన్ ఆస్తి 160 కోట్లుగా ఉన్నాయి. వీరందర్నీ తలదన్నే రీతిలో కోటీశ్వరుల జాబితాలో అన్నాడీఎంకే మాజీ మంత్రి ఇసక్కి సుబ్బయ్య నంబర్‌వన్‌గా నిలిచారు. 2011లో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఆస్తి విలువ రూ.60 కోట్లు. ఆ తర్వాత న్యాయశాఖమంత్రిగా పనిచేసినా 2016 ఎన్నికల్లో సీటు దక్కలేదు. తాజాగా ఆయనకు తిరునల్వేలి జిల్లా అంబాసముద్రం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది. దీంతో బుధవారం ఆ నియోజకవర్గంలో ఇసక్కి సుబ్బయ్య నామినేషన్ వేశారు. ఈ అఫిడవిట్లో తన ఆస్తి విలువ రూ. 246 కోట్లుగా ప్రకటించారు. తనతో పాటు భార్య మీనాక్షి పేరిట చర ఆస్తులు రూ. 6.86 కోట్లు అని, స్థిర ఆస్తులు రూ. 239 కోట్లు అని లెక్కచూపించారు. అప్పులు రూ. 5 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఇసక్కి సుబ్బయ్య ఆస్తి నాలుగు రెట్లు పెరగడం గమనార్హం. చెన్నై అన్నానగర్‌లో పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎంకే మోహన్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ రూ.211 కోట్లుగా ప్రకటించారు. చదవండి: స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా పది చదవని హీరో కమల్‌హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా..? -
'సుబ్బయ్య హత్యపై శవరాజకీయం చేస్తున్నారు'
సాక్షి, కడప : ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ నేత సుబ్బయ్య హత్య పై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్పందించారు. 'హత్యా రాజకీయాలు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ చెప్పడం సిగ్గుచేటు. ఈ హత్య పై వారిద్దరు శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. చెరుకులపాడు నారాయణను ఎవరు హత్య చేశారు. ఈ హత్యపై లోతైన విచారణ జరిపిస్తాం. ఆ హత్య ఎవరు చేశారో అప్పటి ప్రజలతో పాటు నాయకులకు తెలుసు. దివంగత రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు క్షమాభిక్ష పెట్టారు. కులాలను ,మతాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు కుల రాజకీయాలు, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ నేత సుబ్బయ్య పై మొత్తం 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి. గత టీడీపీ హాయంలో ఇదే సుబ్బయ్య పై 4 క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇవన్నీ టీడీపీ నాయకులకు తెలియదా...? బాధ్యతాయుమైన ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం తగదు. రాష్ట్రంలో ఏ మూలన ఏ చిన్న గొడవ జరిగినా అధికార పార్టీ పై వేయాలని చూడటం దారుణం. మా ప్రభుత్వం అధికారంలోకి జిల్లాలో వచ్చాక కేవలం 51 హత్యలు వివిద కారణాలు వల్ల జరిగాయి.. పారదర్శకంగా పాలన సాగిస్తుంటే విమర్శలు చేయడం దుర్మార్గం. సుబ్బయ్య భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. హత్య చేశారని భావిస్తున్న వ్యక్తి గతంలో సుబ్బయ్య కు స్నేహితుడు. ఇప్పుడు మాట్లాడుకోవడం లేదని హత్య ను వైసీపీ నేతలపై వేయడం ఎంతవరకు సమంజసమంటూ' ఆయన పేర్కొన్నారు. -
సుబ్బయ్యపై 2002 నుంచి 14 కేసులు
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలతో పైకి ఎదిగిన వ్యక్తని, ఆయన కొడుకు హత్యారాజకీయాల గురించి ట్వీట్లు చేయడం హాస్యాస్పదంగా ఉందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ప్రొద్దుటూరు సుబ్బయ్య మృతిపై విచారణ జరుగుతుందని, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సబబు కాదని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ టీడీపీ వాళ్లలా మేము మాట్లాడలేము. సుబ్బయ్యపై 2002 నుంచి 14 కేసులు ఉన్నాయి. టీడీపీ హయాంలోనే ఆయనకు రెండు కేసుల్లో శిక్ష పడింది. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించి ఈ రోజు సుబ్బయ్యను పొట్టన పెట్టుకుంది టీడీపీనే. తన తండ్రిని హత్య చేస్తేనే వదిలేసిన చరిత్ర వైఎస్సార్ కుటుంబానిది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించింది చంద్రబాబే. లోకేష్ ఈ మధ్య కొవ్వు తగ్గించుకున్నాడు...ఇప్పుడు మదం కూడా తగ్గించుకోవాలి. ఎవరో రాసిస్తే ట్వీట్ చేయడం కాదు.. వాస్తవాలు తెలుసుకో లోకేష్ బాబు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏబీవీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక
సాక్షి, అమరావతి బ్యూరో: ఏబీవీపీ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డా. ఎస్ సుబ్బయ్య (తమిళనాడు), ఆశీష్ చౌహాన్(హిమాచల్‌ప్రదేశ్)లు మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల్లో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎలక్షన్ ఆధికారి మమతా యాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరగనున్న ఏబీవీపీ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఏడాదిపాటు బాధ్యతలు నిర్వహించనుంది. -
చితిలో కాలని అప్పు
‘ఏమైనా సుబ్బయ్యన్న చేసినంత పనులు చేయటం మనవల్ల కాదు. తొలకరి రాలగానే ముందు దున్నే పొలం ఆయనదే. ఊళ్లో అందరి కంటే ముందే పంట వేయడం దగ్గర్నుంచి, మబ్బుతో లేచి వెళ్ళి మోటారేయటం కూడా అందరి కంటే ముందే’ అన్నాడు లక్ష్మీపతి ఇంటిముందున్న అరుగు మీద కూర్చుంటూ. ‘ఆ...నిజమే. కానీ అంత తొందరగా వెళ్ళొద్దన్నా వినడు. అందరూ నాలుగింటికెళ్తే ఈయన రెండు గంటలకే బయల్దేరుతాడు‘ విసుగ్గా అంది సుబ్బయ్య భార్య మునెమ్మ రోజూ లేపి టార్చ్, దుప్పటి, కర్ర అని అడగటం, తలుపుకు గొళ్ళెం పెట్టుకొమ్మని మంచి నిద్ర పాడుచేస్తాడన్న కోపంతో. ‘మనం రైతులం. అదున్లో పనిచెయ్యాల. నిద్ర, సుఖం చూసుకుంటే బ్రతకటం కష్టం. ఏమంటావురా లక్ష్మీపతి?‘ భార్య ఇచ్చిన కాఫీ గ్లాసు తీసుకుంటూ అన్నాడు సుబ్బయ్య. అప్పటికే మునెమ్మ ఇచ్చిన కాఫీ ఊదుకుని తాగుతూ ‘అవునక్కా. మనూళ్ళో అంతా అన్న ఈ వయసులో కూడా ఇంత హుషారుగా వుంటాడని, కొడుకులు ఇద్దరున్నా వాళ్ళకైనా ఇంత హుషారు లేదని అనుకుంటా వుంటారు’ అన్నాడు లక్ష్మీపతి. ‘ఏం హుషార్లే మామా..చీకట్లో ఎళ్ళి ఎన్ని సార్లు గతుకుల్లో పడ్డాడో, పాము కరిసిందో నీకూ తెల్సుకదా? కొంచెం ఆగితే మేమూ వస్తామన్నా ఇనడు కదా?’ అన్నాడు పెద్ద కొడుకు మాణిక్యం. ‘అంతేనా అందరి కంటే ముందే పంట అమ్మేస్తాడు. అప్పుడు ధర వుండదు. ధర పలికే సమయానికి మన దగ్గర పంట వుండదు. అంత ఆత్రం దేనికి చెప్పు. కొంచెం ఆగమంటే వినడు. అందుకే ప్రతిసారీ మనకే నష్టాలెక్కువ‘ భుజం మీది తువ్వాలు విసురుగా విదిల్చి తలకు చుట్టి ఆవు దగ్గరికి నడిచాడు చిన్నకొడుకు రాజేంద్ర పాత్రలో పాలు పిండటానికి. ఇంతలో రాజేంద్ర భార్య రమ ఉత్తరం తెచ్చి భర్త చేతికిచ్చింది. రాజేంద్ర గిన్నె పక్కన పెట్టి చదవసాగాడు. ‘ఎక్కడ్నుంచిరా ఉత్తరం రాజేంద్రా?‘ అడిగాడు సుబ్బయ్య. ‘మన ఉత్తేజ్ దగ్గర్నుంచీ నాన్నా. ఎంట్రన్స్ పరీక్షలు బాగా రాశానని రాశాడు‘ చెప్పాడు రాజేంద్ర. ‘సరే మరి మన జయరాం సంగతేందిరా?‘ పెద్దకొడుకుని అడిగాడు. ‘ఇద్దరూ అక్కడ్నే కదా కోచింగులో చేరుండేది. వాడూ బాగానే రాసినానన్నాడు నాన్నా’ చెప్పాడు మాణిక్యం. ‘ఎందుకైనా గానీ మంచి కాలేజీల్లో చేర్చడానికి డబ్బులు రెడీ చేసుకోమని అంటున్నారన్నా పిల్లోళ్ళిద్దరూ’ మాణిక్యంతో అన్నాడు రాజేంద్ర. ‘దేవుని దయవల్ల మంచి మార్కులొచ్చి ఫ్రీ సీట్లొస్తే ఇద్దరికీ బాగుండు. తిరుపతి వెంకన్న దగ్గరికి కాలినడకన వస్తానని మొక్కుకున్నా కూడా’ చెప్పింది మాణిక్యం భార్య సువర్ణ. ‘అయినా పోయినేడు మన స్వాతి పెళ్ళికి చేసిన అప్పే ఇంకా తీరలేదు’ నిట్టూర్చాడు మాణిక్యం. ‘ఈ సంవత్సరం మామిడి తోట బాగా కాసింది కదన్నా. తీర్చేద్దాం లే’ అంటూ పొలానికి బయలుదేరాడు రాజేంద్ర. మాణిక్యం కూడా టౌన్‌కి ఎరువుల కోసం బయలుదేరాడు. వరిలో సరిగా దిగుబడి రాలేదు. మామిడి ఆ సంవత్సరం మంచి ధర పలకలేదు. అప్పులు సగమే తీరాయి. ఆశాజీవిగా మరో పంట వేయడానికి మాత్రం సుబ్బయ్య కుటుంబం వెనక్కు తగ్గలేదు. మళ్లీ నాట్లు, ఎరువులు అంటూ పొలం పని ఎప్పట్లా జరుగుతోంది. ఈలోగా పెళ్లికి అప్పిచ్చిన వాళ్లు ఇంటి మీదికొస్తుంటే మునెమ్మ గాజులకు, సువర్ణ నెక్లెస్‌కు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. ఆ రాత్రి పెందలాడే భోంచేసి ముసుగుతన్నాడు సుబ్బయ్య. తొలికోడితో బాటే నిద్రలేచి ఏమనుకున్నాడో గానీ మునెమ్మను లేపకనే కర్ర, టార్చ్, దుప్పటి తీసుకుని తలుపు దగ్గరికి వేసుకుని వెళ్ళిపోయాడు. ఉదయం ఆరవుతోంది. నిద్రలేచి మునెమ్మ ముఖం కడుక్కొచ్చేలోగా వీధిలో కేకలు, గొడవ. ఇంట్లో వాళ్లంతా బయటకు పరుగుతీశారు. ఇద్దరు మనుషులు సుబ్బయ్య దేహాన్ని మోసుకొచ్చి వరండాలో పడుకో బెట్టారు. ఐదు గంటలకు పొలం వైపెళ్తున్న శివరాం గమనించాడట. హైటెన్షన్ వైరు మీద కాలేసి చచ్చిపడున్న సుబ్బయ్యను. చుట్టుపక్కల అందర్నీ కేకలేసి అంతా కలిసి పట్టుకొచ్చి చూసేసరికే ప్రాణం పోయి ఎంతసేపో అయ్యి వొళ్లు కర్రలా బిగుసుకుపోయుందట. సాయంత్రానికి సుబ్బయ్య దేహం మట్టిలో కలిసిపోయింది. మునెమ్మ అమ్మగారింటి వాళ్లు వచ్చారు. చివరిగా పసుపు కుంకుమలిచ్చి వెళ్ళారు. ‘ఒరే రాజేంద్రా! మామ ఫొటో పెద్దగా వుండి మన వాళ్లందరి పేర్లతో చుట్టుపక్కల పల్లెలందరికీ తెలిసేలా నాలుగైదు పేపర్లలో వేయించరా. అప్పుడే మన ఇంటిపేరు, మనం ఎంత ఘనంగా ఆయనకు కర్మ చేస్తున్నామో తెలిసేది‘ అన్నాడు వెనకింటి సుబ్బయ్య తమ్ముని కొడుకు నారాయణ. రాజేంద్ర, మాణిక్యం తమ కొడుకుల్ని ఆ పని చూడమని టౌనుకి పంపించారు. సాయంత్రానికి కాళ్లీడ్చుకుంటూ వచ్చారు వాళ్లు. ‘మనం అనుకున్నంత సైజుతో నాలుగైదు దినపత్రికల్లో వెయ్యాలంటే వందలు కాదు వేలు కావాలి ఏ మూలకూ సరిపోవు’ అని చెప్పారు. ‘అయితే ఏమైందిలేరా వెధవ డబ్బు ఇయ్యాళుంటుంది రేపు వుండదు. కానీ ఎప్పటికీ నిలిచేది మనం ఎంత గ్రాండ్‌గా ఆయన కర్మ చేశామన్నదే రా’ అన్నాడు నారాయణ. అప్పుడొచ్చాడు సుబ్బయ్య చిన్నతమ్ముడు ధనుంజయులు. ‘ఒరేయ్ అబ్బాయిలూ! అన్నకు సమాధి మాత్రం గ్రానైటు రాయితో బాగా కట్టించాల్రా. చుట్టుపక్కల ఏ వూళ్లో లేనంత బాగా వుండాలి’ అన్నాడు. ‘అది సరేగానీ అన్నా.. ముందు కర్మ రోజు ఏమేం వంటలనుకున్నారు? నా కూతురు వాళ్ల అత్తగారు, కోడలు వాళ్ల బంధువులు కూడా వస్తున్నారు బెంగళూరు, చెన్నైల నుంచి. మా అన్న కర్మంటే వాళ్లు భలే జరిగిందని అనుకోవాలి. లేకుంటే నాకు పరువు తక్కువ‘ అంది సుబ్బయ్య చెల్లెలు వరలక్ష్మి. ‘అదంతా రెడీనే అత్తా.. ఏమీ తక్కువ కాదు. లడ్డూ, జాంగ్రీ రెండురకాల వేపుళ్ళు, మూడురకాల పచ్చళ్ళు, రెండురకాల అన్నాలు, మామూలు అన్నం సాంబారు, అప్పడం వడియాలు, దప్పళం..’ అని మాణిక్యం చెప్తుంటే అడ్డొచ్చిందామె మళ్ళీ. ‘ఏంటీ ఇవన్నీ వంటవాళ్ళతోనా? సరుకులు సరంజామా అందిస్తూ మీరు కూర్చుంటే మా సంబంధులు మీరు బాగా రిసీవ్ చేసుకోలేదని అలుగుతార్రా. అయినా ఈ రోజుల్లో వంటవాళ్ల కన్నా కేటరింగ్‌కి ఆర్డర్ చేసేయండి. నా కొడుకు విజయ్ లేడూ వాడి ఫ్రెండ్‌ది ప్రక్క టౌన్లోనే కేటరింగ్ సర్వీస్. వాడు ఫోన్ చేస్తే చాలు వచ్చేస్తారు. డబ్బులిచ్చేయండంతే‘ అని తేల్చేసింది వరలక్ష్మి. ‘మాణిక్యం... మీరేమన్నా చేసుకోండి. కానీ మనూళ్లో పక్కూళ్లలో అంతా ఉన్న పద్ధతి ప్రకారం మర్చిపోకుండా కర్మ రోజు రాత్రి కథ చెప్పించాల్రా. ఏముంది... కథ చెప్పేవాళ్ళకు అన్నం పెట్టి ఓ పదివేలిస్తే చాలు’ అన్నాడు ఎదురింటి వెంకటేశ్వర్లు. తలలు ఊపారు గానీ మాణిక్యం, రాజేంద్రల ముఖాల్లో కళ లేకుండా పోయింది. రాత్రంతా ఇద్దరూ మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. ఒకసారి పోతే పోయిందిలే వెధవ డబ్బులు తండ్రి కోసమే కదా! అప్పుచేసైనా ఖర్చుపెట్టి నలుగుర్లో తండ్రికి బాగా చేయాలని అనుకున్నా, మరోసారి ఎలా తీర్చాలి ఇంతప్పు? ఇప్పుడున్న అప్పునే ఇంకా తీర్చలేదన్న భయం మరోవైపు అనిపించి. తెల్లవారు జామున కలత నిద్రపోయారు. దినం రోజుకు రెండ్రోజుల ముందొచ్చాడు మునెమ్మ తమ్ముడు. ‘ఒరేయ్ అబ్బాయిలూ! మా అక్క మెడ తరువాత బోసిగా వుండకూడదు. ఒకడు మెడలోకి పగడాలు, ముత్యాలతో హారం చేయించాలి. ఇంకొకడు నాలుగు గాజులు చేయించి చేతికి రెండు చొప్పున వేయండి. లేకుంటే సుబ్బయ్య కొడుకులు తల్లిని బికారి దాన్లా వదిలేశారని అనుకుంటారు. ఎక్కడికి పోతుంది? అంతా మీకే కదా?‘ అన్నాడు. ‘అంతా సరే గానీ దినం రోజు వంటలు తిని, గ్రానైటు రాయితో సమాధి కడితే సరిపోదురా. అవన్నీ ఆయన ఆత్మను స్వర్గానికి తీసుకుపోవు. ఒక మంచి పాడి ఆవును దూడతో సహా దానమివ్వాలి, కనీసం మీ శక్తికొద్దీ బంగారం, బట్టలు, కాసంత భూదానం కూడా చేస్తే ఎకాఎకిని ఆత్మ స్వర్గానికెళ్లిపోతుందట. పెదనాయన ఆత్మ అలమటిస్తే మనకే మంచిది కాదురా రాజిగా‘ ముక్కుచీదుతూ చెప్పింది సుబ్బయ్య పెద్ద తమ్ముడు కూతురు శ్యామల. ఆ రాత్రి రాజేంద్ర కనిపించలేదు. రాత్రి పది గంటల వరకు వెతికి వెతికి అంతా భయపడిపోయారు. చివరికి మర్నాడు ఉదయం రాజేంద్ర కొడుకు ఏడుస్తూ ఒక ఉత్తరం పట్టుకొచ్చి మాణిక్యం చేతికిచ్చాడు.‘అన్నా. నాన్న దినం బాగా జరగాలి. ఇప్పుడు ఇంట్లో వున్న మన కొడుకుల కాలేజీ సీట్ల కోసం అప్పుచేసి తెచ్చిన డబ్బులు సరిపోవు. మన ఈరిగాడు ఎవరికో కిడ్నీ కావాలని చెప్తుంటే విన్నాను. రెండు మూడు లక్షలు ఇస్తారంట. మనిషికి ఒక కిడ్నీ సాలంట. నాకేమి భయం లేదు. పెద్దకొడుకువి కాబట్టి నువ్వుంటే చాలు దినాలకు. నా కొడుకుతో పంపితే నేను హాస్పిటల్లోనే పుణ్యావాసం నీళ్ళు చల్లించుకుంటా. వారం రోజులకే ఇంటికొచ్చేస్తా’ అని రాసుంది. అది విన్న మునెమ్మకు ఎక్కడలేని ఆవేశం వచ్చేసింది. ‘రేయ్ మాణిక్యం.. ఎళ్ళి ఈరిగాడ్ని పట్టుకోని తమ్ముడ్ని తీసుకురా. ఒక్కపైసా కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. కార్డులేసి అందరికి దినం పత్రికలు పంపావుకదా అది సాలు. కథలు చెప్పించాల్సిన అవసరం లేదు. ఆత్మ వచ్చి కథలు వినదు. దానధర్మాలు మనస్ఫూర్తిగా వున్నప్పుడు వున్నదాంట్లో చెయ్యాలిగానీ అప్పులు చేసి చెయ్య పనిలేదు. భర్తపోయిన దుఃఖంలో వున్న నాకిప్పుడు నగలు సింగారించుకోవాలన్న కోరికేం లేదు. అసలు చనిపోయిన ఆయనే బ్రతికుంటే అప్పు చేసిన డబ్బులతో గ్రానైట్ సమాధి కడతానంటే ఒప్పుకునేవాడు కాదు. దానికన్నా మనవళ్ల చదువే ముఖ్యం. ఎవరి పరువు కోసమో, ఎవరి గొప్పల కోసమో మనం ప్రాణాల మీదికి తెచ్చుకోవాల్సిన పనిలేదు. వెళ్ళండ్రా’ అని కోపంగా అరిచేసరికి ఎక్కడి వాళ్ళక్కడ తేలుకుట్టిన దొంగల్లా జారుకున్నారు. మాణిక్యం, కొడుకులు అంతా వెళ్ళి ఆపరేషన్ టేబుల్ ఎక్కకముందే రాజేంద్రను వారించి ఇంటికి తీసుకొచ్చారు. మర్నాడు సిమెంటుతో కట్టిన తండ్రి సమాధికి పూజలు చేశారు. పంతులుకి దక్షిణ ఇచ్చారు. వంటవాళ్ళతో రుచికరమైన భోజనం చేయించి వడ్డించారు. అంతా హాయిగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కాలచక్రం పదేళ్లు తిరిగింది. మాణిక్యం కొడుకు ఇప్పుడు ఎందరికో కిడ్నీ వ్యాధుల్ని నయం చేసే స్పెషలిస్ట్ డాక్టరయ్యాడు. రాజేంద్ర కొడుకు ఇంజనీరై తాతకు మాంచి గ్రానైటు రాయితో, మెరిసే అక్షరాలు, సుబ్బయ్య ఫొటోతో సమాధి కట్టాడు. అంతే కాదు, ఆరోజు ముఖం తిప్పుకుంటూ వెళ్లిన వాళ్లంతా పెదవుల్లో నవ్వుల్ని సాగదీసుకుంటూ పెళ్లి సంబంధాలు చూడటానికి ఎగబడ్తున్నారు. లోకం నాలుకకు ఎన్నో చీలికలు. మనం అవసరమైనవే తీసుకోవాలి. లేదంటే ప్రతి నాలుకా విషపు కోరలతో వెంటబడుతుంది. ఆరోజు కాలిపోయిన సుబ్బయ్య కట్టె కోసం అప్పులు కూడా కరిగిపోయుంటే మిగిలిన వాళ్ళంతా కూడా జీవచ్ఛవాలయ్యేవాళ్లు. అందుకే తాహతునుబట్టి బతికినపుడే పైకెదిగే అవకాశం వుంటుంది. అనవసర గొప్పలకు పోకుంటే బాగుపడ్తారనటానికి సుబ్బయ్య కుటుంబమే ఉదాహరణైంది. - డేగల అనితాసూరి -
దాచేపల్లి నిందితుడి చివరి ఫోన్‌కాల్..
సాక్షి, గుంటూరు: దాచేపల్లిలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. 9 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య వ్యవహారం ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు పరారీలో ఉన్న సుబ్బయ్య ఆచూకీ కోసం పోలీసులు 17 బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మరో వైపు డ్రోన్ కెమెరాలతో కూడా కృష్ణా నది పరసర ప్రాంతాల్లో కూడా పోలీసులు గాలించారు. ఈ క్రమంలో సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. గురజాల మండలం తేలికుట్ల- దైద దగ్గరున్న అమరలింగేశ్వర దేవాలయం సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీస్ యంత్రాంగం అక్కడ వెళ్లి సుబ్బయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుబ్బయ్య ఎప్పుడు చనిపోయాడనే విషయాన్ని వైద్యులు నిర్థారిస్తారని డీజీపీ మాలకొండయ్య వెల్లడించారు. అయితే సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్టు తెలిపాడు. అందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డు బయటపడింది. ఆయన ఫోన్ కాల్ సంభాషణలో ‘పదిమందికి మంచి చెప్పి బతికేవాణ్ని.. కానీ అనుకోకుండా జరిగిపోయింది. నాకు చావడం ఒక్కడే మార్గం.. నేను చేయకూడని పని చేశాను. నా మొహం చూపెట్టుకోలేను. నేను చేసిన పనితో నా కొడుకు పరువు పోయింది. చావడానికే వెళ్తున్నాను.’ అని సుబ్బయ్య బంధువులకు తెలిపాడు. ఎలాంటి అఘాత్యం చేసుకోవద్దని బంధువులు వారిస్తున్నా సుబ్బయ్య వినిపించుకోలేదు. -
దాచేపల్లి అత్యాచార నిందితుడు ఆత్మహత్య
-
దాచేపల్లి నిందితుడి ఆత్మహత్య
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని దాచేపల్లిలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీస్తోంది. నిందితుడి అరెస్టులో పోలీసుల తాత్సారాన్ని నిరసిస్తూ ఆందోళనలు మిన్నంటాయి. బుధవారం జరిగిన ఈ సంఘటనకు నిరసనగా బాధితురాలి బంధువులు, కుటుంబ సభ్యులు వందలాది మంది ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిని అరెస్టు చేయాలంటూ బాధితురాలి బంధువులు రెండు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ అందోళనలో మూడు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో దాచేపల్లిలో గురువారం జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ వెంకటప్పల నాయుడు పర్యవేక్షణలో నిఘా ఏర్పాట్లు చేశారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. దీంతో 17 పోలీసు బృందాలతో నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరో వైపు పరారీలో ఉన్న నిందితుడు సుబ్బయ్య గురువారం బంధువులకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణానది పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఆత్మహత్య ఓ పక్క నిందితుడు సుబ్బయ్య కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గురజాల దైదా దగ్గర ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. అమరలింగేశ్వర దేవాలయం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు.. ఈ విషయాన్ని ధ్రువీకరించేందుకు ఘటనాస్థలికి బయలుదేరారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సుబ్యయ్యా? కాదా? అని పోలీసులు మరికాపేట్లో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మా తప్పు ఒప్పుకుంటున్నాం: హోం మంత్రి మరో వైపు దాచేపల్లి అత్యాచార ఘటన దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని శుక్రవారం చినరాజప్ప పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామి ఇచ్చారు. అత్యాచార ఘటనపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. తమ తప్పును ఒప్పుకుంటున్నామని ఆయన వెల్లడించారు. గుంటూరు జిల్లాలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటివి జరుగకుండా ప్రజల్లో కూడా అవగాహన రావాలని, మీడియా చైతన్య పర్చాలని చినరాజప్ప కోరారు. బాధితురాలి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ప్రకటించింది. -
ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడిగా సుబ్బయ్య
సాక్షి, ముంబై: బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జాతీయ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన డా.ఎస్ సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా ముంబైకి చెందిన ఆశిష్ చౌహాన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఏడాది పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారి డా.రామన్ త్రివేది తెలిపారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే ఏబీవీపీ 63వ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. -
వ్యక్తి దారుణహత్య
భార్య, కుమారుడే నిందితులు.. తాగి విసిగిస్తున్నాడని కడతేర్చారు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నం పోలీసుల విచారణతో బయటపడ్డ వాస్తవాలు అర్ధరాత్రి పూట నడిరోడ్డుపై శవం. ఆ మార్గంలో వెళ్లేవారు కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించగా తలపై బలమైన గాయమైన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే రోడ్డు ప్రమాదం జరిగినట్లు అనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని, ఆ ఇంటికెళ్లారు. భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే అసలు విషయాలు వెలుగచూశాయి. ప్రతి రోజూ తాగి ఇంటికొచ్చి చిత్రహింసలకు గురి చేస్తుండటంతో తామే కడతేర్చామని వారు ఒప్పుకున్నారు. అనంతపురం సెంట్రల్ : అనంతపురం మండలం కురుగుంట పంచాయతీలోని మల్లయ్య కొట్టాలకు చెందిన సుబ్బయ్య (48) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. సుబ్బయ్య కుటుంబం తోలుబొమ్మలాటలతో జీవనం సాగించేది. ఇటీవల కాలంలో సుబ్బయ్య తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజూ విపరీతంగా మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో పాటు వీధిలోని వారితో కూడా గొడవకు దిగేవాడు. అడ్డొచ్చిన భార్య సునందమ్మ, కుమారుడు నరేష్‌లపైనా చేయి చేసుకునేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో తాగి గొడవపడ్డాడు. ఇతని చేష్టలతో విసిగిపోయిన భార్య సునందమ్మ, కుమారుడు సరేష్‌లు కట్టెతో తలపై బలంగా కొట్టడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని సమీపంలోని అనంతపురం – కళ్యాణదుర్గం రహదారిపై పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారు. రహదారిపై మృతదేహం పడిందన్న సమాచారం అందుకున్న రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ జగదీష్‌లు అర్ధరాత్రే ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించారు. తలపై తప్ప మృతదేహంపై ఎక్కడా గాయాలు లేకపోవడంతో అనుమానం వచ్చింది. మృతుని వివరాలు కొనుగొన్న పోలీసులు నేరుగా వారి ఇంటికి వెళ్లారు. ఇంట్లో రక్తపు మరకలు ఆరకపోవడం, హత్యకు ఉపయోగించిన కట్టె లభ్యం కావడంతో భార్య, కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. హతుడి అన్న రామదాసు ఫిర్యాదు మేరకు భార్య సునందమ్మ, కుమారుడు సురేష్‌లపై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీష్ వివరించారు. -
11 ఎర్రచందనం దుంగల స్వాధీనం
రైల్వేకోడూరు రూరల్: మండలంలోని బాలుపల్లె ఫారెస్ట్ పరిధిలో వెలుగుదొనకొండ బీట్‌లో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్బీఓ వెంకట సుబ్బయ్య, టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ లక్ష్మయ్య శుక్రవారం తెలిపారు. కూంబింగ్‌లో భాగంగా చేపట్టిన తనిఖీలలో దుంగలతోపాటు గొడ్డళ్లు, వంట పాత్రలు, రంపాలను స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. -
పోలీసులపై ‘ఎర్ర’ స్మగ్లర్ల దాడి
అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న దుండగులను పట్టుకోవడానికి యత్నించిన పోలీసులపై దాడికి యత్నించారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక రామన్నకుంట సమీపంలోని ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ జరగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులపై స్మగ్లర్లు నాగరాజు, లక్ష్మయ్య, సుబ్బయ్య కత్తులతో దాడి చేశారు. ఈ దాడుల నుంచి తప్పించుకున్న పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
పిల్లలకు విషమిచ్చి.. తల్లి ఆత్మహత్య
బంధువుల శూలాల్లాంటి మాటలు ఆ మాతృమూర్తి హృదయాన్ని గాయపరిచాయి. ఇద్దరు కుమారుల అంగవైకల్యం గురించి సూటి పోటీ మాటలు వినలేక ఆమె అఘాయిత్యానికి పాల్పడింది. ఇద్దరు కుమారులకు పురుగుల మందు తాగించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లీ, ఓ కుమారుడు మృతి చెందగా, మరో కుమారుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామంలో మంగళవారం జరిగిన ఈ ఘోర విషాద ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరి సుజాత(24), మద్దిలేటి దంపతులకు మహేశ్ (9), సుబ్బయ్య (7) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ అంగవైకల్యంతో పుట్టారు. ఏ వేడుకకు వెళ్లినా బంధువులు వారి కుమారుల వైకల్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతుండడంతో సుజాత హృదయం తట్టుకోలేకపోయింది. మంగళవారం ఉదయం భర్తతోపాటు అత్త, మామలు పొలం పనులకు వెళ్లగా... ఇంట్లో ఉన్న సుజాత ఇద్దరు కుమారులకు పురుగుల ముందు ఇచ్చి తాను కూడా తాగింది. ఇది గమనించిన స్థానికులు వారిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుబ్బయ్య మృతి చెందాడు. వైద్యుల సూచన మేరకు సుజాతను ఢోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా... ఆమె అక్కడ ప్రాణాలు విడిచింది. మహేశ్ ప్రాణాపాయ పరస్థితుల్లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
చలి తీవ్రతకు వృద్ధుడు మృతి
జన్నారం: ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో చలి తీవ్రతకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. సుబ్బయ్య (55) శనివారం రాత్రి అందరితోపాటు నిద్రించగా, ఆదివారం ఉదయం చూసేసరికి ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. అనారోగ్య సమస్యలు లేవని, చలి తట్టుకోలేక మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడ ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలుగా ఉంది. -
ఎండవేడికి వృద్ధుడి మృతి
లక్కిరెడ్డిపల్లి (వైఎస్సార్‌జిల్లా): వర్షాలు లేక ఎండలు దంచి కొడుతుండడంతో వృద్ధుల ప్రాణాల మీదకు వస్తోంది. వైఎస్సార్‌జిల్లా లక్కిరెడ్డి పల్లి మండలం బి.ఎర్రగుడి గ్రామంలో ఎండవేడికి తట్టుకోలేక సుబ్బయ్య (70) అనే వృద్ధుడు పొలంలోనే ప్రాణాలు విడిచాడు. శుక్రవారం ఉదయం పొలం కాపలాకు వెళ్లిన సుబ్బయ్య సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. పొలంలోనే అతడు కూలబడిపోయి కనిపించాడు. ఎండకు తట్టుకోలేక అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.