ఎర్ర చందనం స్మగ్లర్లు.. పోలీసులపై దాడి చేశారు.
అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న దుండగులను పట్టుకోవడానికి యత్నించిన పోలీసులపై దాడికి యత్నించారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక రామన్నకుంట సమీపంలోని ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ జరగుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులపై స్మగ్లర్లు నాగరాజు, లక్ష్మయ్య, సుబ్బయ్య కత్తులతో దాడి చేశారు. ఈ దాడుల నుంచి తప్పించుకున్న పోలీసులు ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో దొంగ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.