వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం లక్కవారిపల్లె గ్రామ సమీపంలోని నక్కదోన అటవీ ప్రాంతంలో గురువారం పోలీసులు 14 మంది తమిళ కూలీలను అరెస్టు చేసి, 15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ ఎం.వి.రామకృష్ణయ్య తెలిపిన వివరాలివీ.. ముందస్తు సమాచారం మేరకు బద్వేలు సీఐ రామాంజినాయక్ , రూరల్ ఎస్‌ఐ నరసింహారెడ్డిలు అటవీ సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి నక్కదోన అటవీ ప్రాంతంలో గాలిస్తుండగా కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. వారు పోలీసులను చూడగానే గట్టిగా కేకలు వేస్తూ పోలీసులపైకి రాళ్లు, గొడ్డళ్లు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. సిబ్బంది వెంటపడి 14 మందిని అరెస్టు చేయగా మరికొంతమంది పారిపోయారు. వారి వద్ద నుంచి 334 కేజీల బరువు గల 15 ఎర్రచందనం దుంగలు, 15 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారంతా తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా హరూన్, పాపిరెట్టపట్టి తాలూకాలకు చెందిన వారు.
14 మంది తమిళ కూలీలు అరెస్టు
Published Thu, Sep 15 2016 7:47 PM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM
Advertisement