అక్రమంగా వాహనంలో తరలిస్తున్న 109 ఎర్ర చందనం దుంగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా వాహనంలో తరలిస్తున్న 109 ఎర్ర చందనం దుంగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమరు రూ. 1.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరులో గురువారం వెలుగుచూసింది. తెల్లవారుజామున ఓ వాహనంలో ఎర్ర చందనం దుంగలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 109 దుంగలు గుర్తించారు. పోలీసులను గుర్తించిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అటవీలో కూంబింగ్..
100 మంది తమళి కూలీలు ఎర్ర చందనం దుంగులను నరకడానికి అడవిలోకి వెళ్లారనే సమాచారంతో.. పోలీసులు గురువారం ఉదయం నుంచి బాల్‌పల్లి అటవీ ప్రాంతంలో కూంబిగ్ నిర్వహిస్తున్నారు. సుమారు 200 మంది పోలీసుల సాయంతో తిరుపతి కొండ లు, తలకోన, బాల్‌పల్లి ప్రాంతాల నుంచి పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి అడవిని జల్లెడపడుతున్నాడు.