ఎర్రచందనం దేశ సరిహద్దులు ఎలా దాటుతోంది?
టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు ప్రశ్న
తిరుపతి మంగళం: మనదేశంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా అత్యం త విలువైన ఎర్రచందనం ఆంధ్ర రాష్ట్రం తో పాటు దేశ సరిద్దులు దాటి ఇతర దేశాలకు ఎలా వెళుతోందని టాస్క్‌ఫోర్స్ డీఐజీ మాగాంటి కాంతారావు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు లేకుం డా ఒక్క దుంగ కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం కపిలితీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీఐజీ విలేకరుల సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తాము కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నామన్నారు.
తమకు ఎవరి సహకారం లభిం చకున్నా కేవలం 150మంది సిబ్బందితో ఎర్రచందన అక్రమ రవాణాను, బడా స్మగ్లర్ల ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. శేషాచల అడవుల్లోకి తమిళనాడులోని జావాదీహిల్‌కు చెందిన కూలీలు రాకుం డా చాలావరకు కట్టడి చేశామన్నారు. అటవీ, టాస్క్‌ఫోర్స్ అధికారులపై ఎర్ర స్మగ్లర్లు దాడులకు పాల్పడాలంటే భయపడేలా చేశామన్నారు. అయితే ఎర్రచందనంతో పాటు అడవుల్లో అక్కడక్కడా ఉన్న శ్రీగంధం చెట్లపై కూడ ఎర్రస్మగ్లర్ల కన్ను పడిందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. డీఎస్పీలు శ్రీధర్‌రావు, హరినాథ్‌బాబు, మహేశ్వరరాజు పాల్గొన్నారు.