5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood seized | Sakshi
Sakshi News home page

5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Published Wed, Feb 10 2016 11:27 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

అక్రమంగా రవాణా చేసేందుకు నిలవ ఉంచిన ఎర్ర చందనాన్ని రైల్వే కోడూరు పోలీసులు బుధవారం సీజ్ చేశారు.

అక్రమంగా తరలిస్తున్న రూ. 5 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్‌కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లిలో బుధవారం ఉదయం అటవీ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. వాగేటికోన నుంచి వస్తున్న కంటైనర్‌ను గుర్తించారు.

వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా.. అందులో ఉన్న డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో కంటైనర్ తెరిచి చూసిన అధికారులకు భారీ ఎర్రచందనం దుంగలు దర్శనమిచ్చాయి. 6 టన్నుల బరువున్న 200 దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement