నగ్నపూజల మాంత్రికుడు.. టీడీపీ నాయకుడు | The nudist magician is the TDP leader | Sakshi
Sakshi News home page

నగ్నపూజల మాంత్రికుడు.. టీడీపీ నాయకుడు

Published Thu, May 18 2023 4:27 AM | Last Updated on Thu, May 18 2023 10:54 AM

The nudist magician is the TDP leader - Sakshi

రేణిగుంట: చేతబడి చేశారేమో అనే అనుమానంతో ఓ మహిళ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి చెందిన మాసారపు సుబ్బయ్య అనే మాంత్రికుణ్ణి ఆశ్రయించగా.. ఆ మాంత్రికుడు ఆమెపై బలాత్కారం చేయబోయిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ నాయకుడైన సుబ్బయ్య శ్రీకాళహస్తిలో మాంత్రికుడిగా చెలామణి అవుతున్నాడు.

రేణిగుంట మండలం కరకంబాడికి చెందిన 35 ఏళ్ల మహిళకు చేతబడి వదిలిస్తానని చెప్పిన సుబ్బయ్య ఈ నెల 14న పూజా సామగ్రితో ఆమె ఇంటికి వెళ్లాడు. పూజలో నగ్నంగా కూర్చోవాలని మాంత్రికుడు సుబ్బయ్య కోరగా.. ఆమె నిరాకరించింది. దీంతో చేతులతో బంధించి బలాత్కారం చేయబోగా.. ఆమె తప్పించుకుని గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో కామ మాంత్రికుడు సుబ్బయ్యను అరెస్ట్‌ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.  

గోర్లతో రక్కి... చాకుతో పొడవబోయాడు 
ఆ మహిళ పూజలో నగ్నంగా కూర్చునేందుకు నిరాకరించి ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. మాంత్రికుడు ఆమె వీపు, చేతి భాగంలో గోర్లతో రక్కి బలాత్కారం చేసేందుకు యత్నించాడని రేణిగుంట అర్బన్‌ సీఐ సుబ్బారెడ్డి వెల్లడించారు.

అతని నుంచి విడిపించుకుని బయటకు వచ్చేందుకు ఆ మహిళ ప్రయత్నించగా.. నిమ్మకాయలు కోసిన చాకుతో ఆమెను పొడిచేందుకు ప్రయత్నించాడని తెలిపారు. దీంతో ఆమె ప్రాణభయంతో గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోగా మాంత్రికుడు కారులో పరారయ్యాడన్నారు.  

పదేళ్ల క్రితం ఆటో డ్రైవర్‌.. ఇప్పుడు టీడీపీ నేత 
మాంత్రికుడు మాసారపు సుబ్బయ్య పదేళ్ల క్రితం ఆటో తోలుకుంటూ జీవనం సాగించేవాడు. తనకు మంత్ర శక్తులు తెలసునని స్థానికులను నమ్మించి శ్రీకాళహస్తిలోని బహదూరుపేటలో మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటి వద్దే తాయెత్తులు కడుతూ ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నాడు. తిరుపతి జిల్లా టీడీపీ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సుబ్బయ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.

శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల వెంకటసు«దీర్‌రెడ్డికి నమ్మిన బంటుగా చక్రం తిప్పుతున్నాడు. సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులతో వచ్చే అమాయక ప్రజలకు మాయమాటలు చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు. మహిళలకు మాయమాటలు చెప్పి వశపర్చుకుని వారి మాన, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా నిలదీస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడతానంటూ భయపెట్టేవాడు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుదీర్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌ బాగుండాలని శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో సుబ్బయ్య తాంత్రిక పూజలు చేసి నరబలులు కూడా ఇచ్చాడన్న ఆరోపణలున్నాయి. దొంగ మాంత్రికుని ముసుగులో అకృత్యాలు, ఆగడాలకు పాల్పడుతున్న సుబ్బయ్య అక్రమాల డొంకను పోలీసులు కదిలించారు. సమగ్ర విచారణ చేపడుతున్నారు. విచారణలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగుచూసే వీలుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement