సాక్షి, ముంబై: బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జాతీయ అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన డా.ఎస్ సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా ముంబైకి చెందిన ఆశిష్ చౌహాన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఏడాది పాటు ఈ పదవుల్లో కొనసాగనున్నట్లు ఎన్నికల అధికారి డా.రామన్ త్రివేది తెలిపారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే ఏబీవీపీ 63వ జాతీయ సమావేశాల్లో వీరిద్దరూ బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment