dachepally
-
దాచేపల్లి, గురజాలకు మున్సిపాలిటీ హోదా
సాక్షి, దాచేపల్లి: దశాబ్దాల కల సాకరమైంది. దాచేపల్లి, గురజాల పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న మున్సిపాల్టీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీలల హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది . ఎన్నికల సమయంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీ హోదాను కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ప్రజల కలను నిజం చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను కలిసి దాచేపల్లి మున్సిపాల్టీగా, గురజాల, జంగమహేశ్వరపురం గ్రామాలను కలిసి గురజాల మున్సిపాల్టీలుగా రూపాంతరం చెందనున్నాయి. మున్సిపాల్టీల ఏర్పాటుతో పాటు అందుకు అవసరమైన సిబ్బంది, కార్యాలయం, ఫర్నిచర్‌తో ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపాల్టీలతో అభివృద్ధి.. దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ గత దశాబ్దాల నుంచి వినిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మున్సిపాల్టీలుగా మారుస్తున్నామని గొప్పలు చెప్పారే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పల్నాడు అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గానికి రూ.66 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. ఆ తర్వాత తంగెడ, మాచవరం గ్రామాల పరిధిలో ఎత్తిపోతల నిర్మాణాలకు రూ.188 కోట్ల ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దాచేపల్లి, నడికుడి, గురజాల, జంగమహేశ్వరపురంలో ఉన్న జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక, మానవ వనరులను పరిగణలోకి తీసుకుని దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపాల్టీలు ఏర్పడితే ప్రతి రోజు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం, ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందుతాయి. మున్సిపాల్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు వస్తాయి. తమ కల ఇన్నాళ్లకు నెరవేరతుండటంతో దాచేపల్లి, గురజాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పిడుగురాళ్ల మున్సిపాల్టీగా ఉండటంతో తాజాగా దాచేపల్లి, గురజాల పట్టణాలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. -
గుంటూరు జిల్లాలో 3 కొత్త నగర పంచాయతీలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటు అభివృద్ధి పనులు, ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా త్వరితగతిన వెలువడుతోంది. ఏళ్ల తరబడి కదలని, వదలని సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతోంది. ఇదే కోవలో తాజాగా జిల్లాలో కొత్త నగర పంచాయతీలు ఏర్పాటుకు ముందడుగు పడింది. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలను నగర పంచాయతీలుగా మార్చేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాంతాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో మేలు చేకూరనుంది. ఇక తమ ప్రాంతంలో సమస్యలు తీరందాటి అభివృద్ధి పరుగులు తీస్తుందని నిజాంపట్నం వాసులు అంటున్నారు. మరో వైపు పలనాడు రాళ్లపై ఇక అభివృద్ధి రాతలు కనిపిస్తాయని గురజాల, దాచేపల్లి–నడికుడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూడు కొత్త నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. మూడు మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా నగర పంచాయతీలు ఏర్పాటు అంశాన్ని అసెంబ్లీ ముందుకు ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి తీసుకెళ్లారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం దాచేపల్లి–నడికుడి, గురజాల కేంద్రాలుగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2015లో అప్పటి ప్రభుత్వం మేజర్ పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ఇచ్చిన జీవో తెరమరుగైంది. ఆ జీవోకు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జీవం పోసి ఈ నెల 31వ తేదీలోపు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఆధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 50 మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడేషన్ చేసేందుకు సంబంధిత వివరాలు పంపాలని కలెక్టర్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కోరారు. ఈ జాబితాలో జిల్లాలోని గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి–నడికుడి, గురజాల, రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నం మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఆయా మేజర్ పంచాయతీల సమాచారం సేకరించే పనుల్లో జిల్లా పంచాయతీ(డీపీవో) సిబ్బంది, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ అధికారులు నిమగ్నమయ్యారు. 12 అంశాల సేకరణ.. పురపాలక సంఘాలుగా అప్‌గ్రేడ్ చేయడం కోసం ఎంపిక చేసిన మేజర్ పంచాయతీల నుంచి 12 అంశాలపై వివరాలు డీపీవో అధికారులు సేకరించనున్నారు. పంచాయతీలో జనాభా, ఓటర్లు, పాఠశాలల సంఖ్య, వార్షిక ఆదాయం, అప్పులు, ఖర్చులు, విస్తీర్ణం సహా 12 అంశాలపై వారు వివరాలు తీసుకుంటున్నారు. రెండు పంచాయతీలు విలీనం.. మండల కేంద్రానికి 2–3 కి.మీ పరిధిలో ఉన్న పంచాయతీలను విలీనం చేసి మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజాంపట్నానికి మూడు కి.మీ పరిధిలో ఉన్న ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలను నిజాంపట్నంలోకి విలీనం చేసి నగర పంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు. నిజాంపట్నం పంచాయతీలో 19 వేలు, ఆముదాలపల్లి పంచాయతీలో 4 వేలు, బావోపాజీపాలెం పంచాయతీలో 2 వేల జనాభా నివసిస్తున్నారు. అదే విధంగా గురజాల పంచాయతీలో 27 వేలు జనాభా ఉన్నారు. అయితే ఈ గురజాల మండల కేంద్రానికి 3 కి.మీ పరిధిలో ఉన్న జంగమహేశ్వరపురాన్ని కలిపి గురజాల నగర పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. దాచేపల్లి మేజర్ పంచాయతీలో 19 వేలు, నడికుడి పంచాయతీలో19 వేల మంది జనాభా నివసిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నాం జిల్లాలో దాచేపల్లి–నడికుడి, నిజాంపట్నం, గురజాల పంచాయతీల అప్‌గ్రేడేషన్‌కు ప్రతిపాదనలు పంపామని కోరారు. ఆయా పంచాయతీల్లో జనాభా, విస్తీర్ణం, ఆదాయం, ఖర్చులు, పాఠశాలల సంఖ్య సహా 12 అంశాలపై వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 31వ తేదీలోపు వివరాలు సేకరించి ప్రతిపాదనలు పంపుతాం. – సూర్యప్రకాష్, ఇన్చార్జి డీపీఓ మేజర్ పంచాయతీల పేర్లు జనాభా కుటుంబాలు దాచేపల్లి – నడికుడి 38,462 9,800 నిజాంపట్నం (ఆముదాలపల్లి, బావోజీపాలెం పంచాయతీలు కలిపి) 25,547 6,803 గురజాల (జంగమహేశ్వరపురం కలిపి) 28,642 6,932 -
దాచేపల్లిలో టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు : దాచేపల్లిలో టీడీపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శనివారం పార్టీ ఆఫీసు ఎదుట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దిష్టి బొమ్మను దహనం చేశారు. సీఎస్ కేంద్రానికి ఏజెంట్‌గా పని చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. టీడీపీ నేత, రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసనకు దిగారు. కాగా తిరుమల శ్రీవారి బంగారం విషయంలో జరిగిన అవకతవకలు, కోడ్ అమల్లో ఉండగానే సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించడం తదితర విషయాలు ఇటీవల చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. ఇక అప్పటి నుంచి సీఎస్ లక్ష్యంగా టీడీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలోని రూ. లక్షల కోట్ల అవినీతి ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. -
పల్లెల్లో దాహం కేకలు !
సాక్షి, దాచేపల్లి : పల్లెవాసుల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. గుక్కెడు నీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని పరుగులు తీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవటంతో ప్రజలు మండిపడుతున్నారు. ఓట్లు కోసం గడప తొక్కే నాయకులు ఇప్పుడు నీటి సమస్యను పరిష్కరించకపోవటంతో వారి తీరును తప్పుపడుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి ఎద్దడి ఉంటే ముందు రోజుల్లో మరింతగా నీటి కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంతనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నప్పటికీ అధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించకపోవటంతో అనేక గ్రామాలకు కృష్ణమ్మ రావటంలేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన తాగునీటి పైలెట్ ప్రాజెక్ట్‌ల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించటంతో మంచినీటి సమస్యకు కారణంగా మారింది. పైపులైన్ల తొలగింపు.... నడికుడి పంచాయతీ పరిధిలోని నారాయణపురం,మన్షూర్షాపేట, అంజనాపురం, నడికుడి ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్య అధికంగా ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం కోసం తాగునీటి పైపులను తొలగించారు. నెలలు గడుస్తున్న రోడ్ల నిర్మాణాలు పూర్తికాక పైపులైన్లను అమర్చలేదు. దీంతో మంచినీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కేసానుపల్లి గ్రామంలో పలు బోర్లు మరమ్మతులకు గురికాగా మరికొన్ని బోర్లకు నీరు అందటంలేదు. భూగర్భ జలాలు అడుగంటిపోవటంతో బోర్లకు నీరు అందక పనిచేయటంలేదు. దీంతో ప్రజలు తాగునీటి కోసం పరుగులు తీస్తున్నారు. రైల్వేట్రాక్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో బోర్లు పనిచేయక కాలనీవాసులు నీటి కోసం అరకిలోమీటర్ దూరం వెళ్తున్నారు. దాచేపల్లిలోని పలు వార్డుల్లో మంచినీటి సమస్య ఉంది. మాదినపాడు, తంగెడ, తక్కెళ్లపాడు, గామాలపాడు, పొందుగల గ్రామాల్లో కూడా మంచినీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు... వేసవికాలం రావటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. గతేడాది వర్షపాతం తక్కువ మోతాదులో నమోదు కావటంతో భూగర్భ జలాలు స్థాయి పెరగలేదు. దీంతో బోర్లకు నీరు అందటంలేదు. ప్రస్తుతం 500 అడుగుల లోతులో బోర్లు వేసిన అర అంగుళం నీటి ధార రావటంలేదు. నాగులేరు, పలు వాగుల్లో అధికపార్టీ నాయకులు చెక్‌డ్యాంలను నిర్మించారు. కేవలం నిధులు డ్రా చేసుకునేందుకు వీటిని నిర్మించారే తప్ప నీరు నిలబడేందుకు కాదనే విషయం చెక్‌డ్యాంలను చూస్తే తెలుస్తుంది. మార్చిలో భూగర్భ జలాలు అడుగంటిపోతే ఏప్రిల్, మే నెలలో అసలు బోర్లు పనిచేయవనే ఆందోళన ప్రజలను వెంటాడుతోంది. రెండేళ్ల క్రితం డిసెంబర్ నుంచి మే నెలాఖారు వరకు మంచినీటి ఎద్దడి నెలకొనటంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిపై దృష్టిసారించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి ఎద్దడి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నడికుడికి చెందిన మందపాటి నాగిరెడ్డి ఫౌండేషన్, ఇరికేపల్లికి చెందిన ది మధర్ స్వచ్ఛంద సేవా సంస్థల వారు ట్యాంకర్ల ద్వారా ఉచితంగా మంచి నీటిని అందిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకున్న చొరవను ప్రభుత్వం చూపించకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల కోసం పైపులైన్లు తొలగించారు నారాయణపురంలో రోడ్ల నిర్మాణం కోసం మంచినీటి పైపులైన్లను తొలగించారు. పైపులను తీసేయటం వల్ల మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. గత నెల రోజుల నుంచి మంచినీటి కోసం పక్క వీధులకు వెళ్తున్నారు. పైపులైన్ల ద్వారా మంచినీరు సక్రమంగా అందటంలేదు. – షేక్ షరిఫ్. నారాయణపురం -
అమరావతిలో మహిళలకు రక్షణ కరువు!
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా చేస్తాం.. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారికి అదే ఆఖరి రోజవుతుంది.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షిస్తాం.. గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడి జరిగిన సమయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇవి.. అయితే ఆ తరువాత జిల్లాలో వరుసగా 20 ఘటనలు జరిగాయి. ఇంతవరకూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసిన దాఖలాలు గానీ, మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకున్న సందర్భం గానీ లేదు. జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి అతి చేరువలో ఉండే మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో యువతులపై లైంగిక దాడులకు పాల్పడి, హత్య చేస్తున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏడాది వ్యవధిలో రాజధాని ప్రాంతంలో నాలుగు వరుస ఘటనలు జరిగాయి. ప్రేమికులు నిర్మానుష్య ప్రాంతాల్లో కనిపిస్తే చాలు దాడులకు తెగబడడం, ప్రియుడిని బెదిరించో, లేక దాడి చేసో ప్రియురాలిపై లైంగిక దాడులకు యత్నించిన ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా మంగళగిరి మండలం నవులూరు వద్ద ప్రేమ జంటపై గుర్తుతెలియని వ్యక్తులు యువతిని హత్యచేసి, యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటనతో రాజధాని ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. రాజధాని ప్రాంతంలో ప్రేమజంటలపై దాడులు, యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నా వీటిలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యమంత్రి నివాసం పరిసర ప్రాంతాల్లోనే ఆందోళనకర ఘటనలు జరుగుతుండటం దారుణమని వారు వాపోతున్నారు. చంద్రబాబు రోజూ చెపుతున్న సింగపూర్ తరహా రాజధాని ఇదేనా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలో ఎన్నో ఘటనలు... 1. గత ఏడాది సీతానగరం రైల్వే బ్రిడ్జిపై ప్రేమికులను బెదిరించి ప్రియుడిపై దాడిచేసి కొట్టడంతోపాటు యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో అటుగా కొందరు వస్తున్న విషయం గమనించి పరారయ్యారు. పరువు పోతుందనే భయంతో ప్రేమ జంట పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 2. 2018, ఆగస్టులో చినకాకాని రాజ్‌కమల్ రోడ్డులో ఓ కానిస్టేబుల్ ఓ యువతితో ఉండగా, నలుగురు యువకులు వారిపై దాడిచేసి బంగారం లాక్కోవడమే కాకుండా యువతిని ముళ్ళపొదల్లోకి లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు పరారయ్యారు. 3. నాలుగు నెలల క్రితం మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలోని కోకాకోలా ఫ్యాక్టరీ వద్ద నిర్జన ప్రదేశంలో ఉన్న ప్రేమ జంటపై దాడిచేసి ముగ్గురు యువకులు ప్రియుడిని కొట్టి పంపించారు. యువతిపై రాత్రంతా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. తాజాగా నవులూరు సమీపంలో ప్రేమ జంటపై దాడి కలకలం సృష్టించింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ ప్రాంతవాసులను ముఖ్యంగా యువతుల తల్లిదండ్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పలు యూనివర్సిటీలు, కళాశాలలు ఉండటంతో యువతీ యువకులు ప్రేమ పేరుతో నిర్జన ప్రాంతాల్లో తిరుగుతుండటం పరిపాటిగా మారింది. ప్రేమ జంటలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన రాజధాని ప్రాంత ప్రజల్లో నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతో పాటు, డీజీపీ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరిస్తే నేరాలకు పాల్పడేవారికి భయం కలుగుతుందని, పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కొన్ని కేసులను నీరుగారుస్తుండటం మృగాళ్లకు చట్టం అంటే భయం లేకుండా ఉందని చెబుతున్నారు. -
గనులను మింగిన ఆత్మలు!
సాక్షి, గుంటూరు: దశాబ్దాల క్రితమే చనిపోయిన వారి ఆత్మలు తెల్లరాయి గనులను అక్రమంగా తవ్వేస్తూ కోట్లాది రూపాయలు దోచుకున్నాయట! ఆత్మలు అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామానికి చెందిన స్వామి రామకోటయ్య అనే వ్యక్తి 2013లో అక్రమంగా గనులు తవ్వేశాడని, జరిమానా చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు ఆయన పేరుతో నోటీసు ఇచ్చారు. నిజానికి రామకోటయ్య 1998లోనే కన్ను మూశాడు. తన 20 ఏళ్ల కిందటే తండ్రి చనిపోయాడని, 2013లో అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావు నెత్తీనోరూ బాదుకున్నా అధికారులు లెక్కచేయలేదు. ఆయనకు నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు దోషులను క్షేమంగా పక్కకు తప్పించి, అమాయకులను బలిపశువులను చేసేందుకు ప్రభుత్వ పెద్దలు పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసానుపల్లిలో పలువురికి మైనింగ్, విజిలెన్స్ అధికారులు నోటీసులిచ్చారు. రూ.1.55 కోట్ల జరిమానా చెల్లించాలని ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చారు. దాచేపల్లికి చెందిన మరో ఐదుగురికి నోటీసులు అందాయి. విలువైన గనులను పట్టపగలే అడ్డంగా దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా, దాంతో ఎలాంటి సంబంధంలేని తమకు నోటీసులు జారీ చేయడం ఏమిటని బాధితులు మండిపడుతున్నారు. సర్వే పేరిట అధికారుల హడావుడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల పరిధిలో అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రూ.వందల కోట్ల విలువైన ఖనిజ సంపదను అక్రమంగా దోచేస్తూ, ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టడంపై న్యాయస్థానం మండిపడింది. దీంతో హైకోర్టుకు సమాధానం చెప్పుకోవడానికి ఆయా ప్రాంతాల్లో అధికారులు మూడు రోజులపాటు సర్వే పేరిట హడావుడి చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి, అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని అమాయకుల మెడకు చుట్టేందుకే నోటీసులు జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించడానికేనా? దాచేపల్లి పట్టణంతోపాటు కేసానుపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు 2013 నుంచి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, పెనాల్టీ చెల్లించాలని నోటీసులు జారీ చేయడంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మైనింగ్ అంటే ఏమిటో కూడా తెలియని తమకు నోటీసులు అందడంతో భయాందోళనకు గురయ్యారు. నోటీసుల్లో పేర్కొన్న సర్వే నంబర్లలో తమ పేర్లు ఏమైనా ఉన్నాయా అనే దానిపై మీ–సేవా కేంద్రాల్లో ఆరా తీశారు. ఎక్కడా తమ పేర్లు లేనట్లుగా గుర్తించి ఈసీలు తీసుకున్నారు. కేసానుపల్లికి చెందిన స్వామి రామకోటయ్య సర్వే నంబరు 336/6లో 16 సెంట్ల విస్తీర్ణంలో అక్రమ మైనింగ్‌కు పాల్పడి, మొజాయిక్ చిప్స్ 5,834 మెట్రిక్ టన్నులు దోచుకున్నాడని, దాని విలువకు పది రెట్లు పెనాల్టీ వేసి మొత్తం రూ.28.23 లక్షలు చెల్లించాలంటూ 2013 ఆగస్టు 16 తేదీతో ఉన్న నోటీసును అధికారులు జారీ చేశారు. ఈ నోటీసును రామకోటయ్య కుమారుడు స్వామి రామలింగేశ్వరరావుకు అందించారు. 1998లో తన తండ్రి రామకోటయ్య చనిపోయినట్లుగా పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని రామలింగేశ్వరరావు చూపినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. నోటీసు తీసుకోకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. అదే గ్రామానికి చెందిన గుదె పేరయ్య సర్వే నంబరు 244లో 66 సెంట్ల విస్తీర్ణంలో 2015లో అక్రమ మైనింగ్‌కు పాల్పడి 32 వేల మెట్రిక్ టన్నుల మొజాయిక్ చిప్స్‌ను అక్రమంగా దోచేశాడని, పెనాల్టీ రూ.1.56 కోట్లు చెల్లించాలని 2017 మే 19 తేదీతో నోటీసు ఇచ్చారు. వ్యవసాయం చేసుకునే తాను అక్రమ మైనింగ్‌కు పాల్పడడం ఏమిటని పేరయ్య ప్రశ్నించినా అధికారులు వినిపించుకోలేదు. అలాగే మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చారు. సదరు సర్వే నంబర్లలో మైనింగ్ జరిగిన దాఖలాలు లేవని, ఆ ప్రాంతంలో ఎస్టీ కాలనీ ఉందని చెబుతున్నారు. సర్వే నంబరు 244 సమీపంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న అక్రమ క్వారీ ఉంది. మైనింగ్ మాఫియాను వదిలిపెట్టి, అమాయకులకు నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజులపాటు సర్వే నిర్వహించిన మైనింగ్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేను రక్షించేందుకే అమాయకులకు నోటీసులు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత గనులు తవ్వుతారా? ‘‘మా నాన్న స్వామి రామకోటయ్య 1998లో మరణించారు. సర్వేనంబర్ 336/6లో ఉన్న 16 సెంట్లలో మా నాన్న అక్రమంగా గనులు తవ్వారని, రూ.28,23,843 జరిమానా చెల్లించాలని అధికారులు నోటిసు ఇచ్చారు. ఈ నోటీసు 2013 ఆగస్టు 16న జారీ అయినట్లు ఉంది. మా నాన్న చనిపోయిన 20 ఏళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చారో అర్థం కావట్లేదు. – స్వామి రామలింగేశ్వరరావు, కేసానుపల్లి అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు ‘‘అధికారులు 3 రోజుల క్రితం ఇంటికి వచ్చి మా నాన్న పేరయ్య పేరిట నోటీసులిచ్చారు. సర్వే నంబర్ 244లో ఉన్న 66 సెంట్ల స్థలంలో అక్రమంగా మైనింగ్ చేసినందుకు రూ.1.55 కోట్ల పెనాల్టీ చెల్లించాలని ఆ నోటీసులో ఉంది. ఆ సర్వే నంబర్లో మాకు సెంటు స్థలం కూడా లేదు. గనుల కేసులో అమాయకులను ఇరికించాలని చూస్తున్నారు’’ – గుదె అనంతరామయ్య, కేసానుపల్లి చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం ‘‘కొందరు అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు అప్పట్లో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ఆధారంగా పెనాల్టీలు చెల్లించాలని నోటీసులు పంపాం. 2013, 2017లో కేసులు నమోదు కావడంతో ఆ తేదీలతోనే నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కేసు విచారణకు, ఈ నోటీసులకు సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తికి నోటీసు ఎలా ఇచ్చారో పరిశీలిస్తాం’’ – పాపారావు, మైనింగ్ డీడీ, ఇన్చార్జి విజిలెన్స్ ఏడీ -
దాచేపల్లి ఘటన నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం
-
దాచేపల్లి ఘటనపై స్పందించిన వైఎస్ జగన్
-
సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లాడు
సాక్షి, విజయవాడ: గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య(55)ను పట్టుకునేందుకు 17 ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాచేపల్లి ఘటన దారుణమన్నారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. రిక్షావాలా అయిన సుబ్బయ్యకు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయని, ఇద్దరు భార్యలు అతడిని వదిలేశారని వెల్లడించారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న అతడు మానసిక వైఫల్యంతోనే ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నామన్నారు. ఘటన తర్వాత సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్లినట్టు తెలిసిందన్నారు. చనిపోవడానికి వెళ్తున్నట్టు దారిలో కనిపించిన వ్యక్తికి చెప్పినట్టు తెలిపారు. ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో 7 అత్యాచార ఘటనలు జరగడం దురదృష్టకరమని డీజీపీ వ్యాఖ్యానించారు. ఈ ఏడు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. దాచేపల్లి కేసులో ఈ కేసులో పోలీసులు సమన్వయంతో వ్యహరిస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ఆందోళనకారులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. -
సాక్షి ఉర్దూ న్యూస్ 5th May 2018
-
దాచేపల్లి ఘటనపై స్పందించిన వైఎస్ జగన్
సాక్షి, మచిలీపట్నం: ఏపీలో సంచలనం రేపుతున్న దాచేపల్లి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విటర్లో స్పందించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో అభంశుభం తెలియని 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరగడం దారుణం అన్నారు. ఏపీలో గత కొంతకాలం నుంచి అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయంటూ వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనల్లో దోషులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారని ట్వీట్లో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోని కారణంగా ఇలాంటి దారుణాలు ఏపీలో అధికంగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. అత్యాచార కేసుల్లో తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, దీనికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా అంటూ వైఎస్ జగన్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. కాగా, మైనర్ బాలికపై అత్యాచార ఘటనతో దాచేపల్లి అట్టుడుకిపోతోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి సుబ్బయ్య అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానంటూ బాలికను ఆ మృగాడు బెదిరించాడు. అయితే ఇంటికి వచ్చిన బాలిక కడుపునొప్పి అనడంతో ఆరా తీయగా కీచకపర్వం వెలుగుచూసింది. చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన సుబ్బయ్యను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. నిందితుడిని శిక్షించాలంటూ స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో దాచేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం నిందితుడు సుబ్బయ్య పరారీలో ఉన్నాడు. -
దాచేపల్లిలో దారుణం.. మిన్నంటుతున్న ఆందోళనలు
సాక్షి, గుంటూరు : తొమ్మిదేళ్ల బాలికపై 55 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు దాచేపల్లిలో జరిగిన ఈ దారుణంపై స్థానికులు మండిపడుతున్నారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దాచేపల్లిలో బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మాచర్లలో ముస్లింలు ఆందోళన చేశారు. రోడ్డుపై రాస్తారోకో చేశారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలిపారు. నిందితుడు సుబ్బయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని... ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొనసాగుతున్న బంద్.. బాలికపై అఘాయిత్యం నేపథ్యంలో దాచేపల్లిలో చేపట్టిన బంద్ కొనసాగుతోంది. వ్యాపారస్తులు తమ దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడ్ని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన దాచేపల్లి గ్రామస్తులు నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ నేతలు అండగా నిలిచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా పరామర్శించారు. ఆడుకుంటున్న బాలికను తీసుకెళ్లి.. దాచేపల్లిలో ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను... అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. అనంతరం బాలికను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపి వెళ్లాడని స్థానికులు చెప్తున్నారు. బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గురజాల ఆస్పత్రికి తరలించారు. విషయం బయటపడడంతో సుబ్బయ్య పరారయ్యాడు. బాలిక బంధువులు ఆస్పత్రి దగ్గరకు చేరుకుని ఆందోళన చేశారు. చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన సుబ్బయ్యను వెంటనే అరెస్ట్ చేసి... కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. వెంటనే న్యాయం చేయాలంటూ రాత్రంతా అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై బైఠాయించారు. రోడ్డుపై టైర్లను తగులబెట్టి నిరసన తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నిందితుడిని శిక్షించాలంటూ స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో దాచేపల్లిలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైవేపై పెద్దఎత్తున ట్రాఫిక్ జామైంది. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని జిల్లా కలెక్టర్ శశిధర్ పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరిగిన ఘటన అత్యంత బాధాకరమైందని, చిన్నారి ఆరోగ్యం నిలకడగా వుందని, దాచేపల్లిలోనే ఎస్పీ ఉండి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా ఈ ఘటనపై స్పందించినట్టు తెలిసింది. నిందితుడిని పట్టుకొని.. కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించరాదని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. -
దాచేపల్లి బంద్‌కు పిలుపు
గుంటూరు: దాచేపల్లిలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై సుబ్బయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటంతో స్థానికులు నార్కట్‌పల్లి-అద్ధంకి రహదారిపై బైఠాయించి వృద్ధుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ముస్లిం సంఘాల నాయకులు బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గురువారం మధ్యాహ్నాంలోపు అరెస్ట్ చేస్తామని హమీ ఇవ్వడంతో గురువారం ఉదయం ఆందోళన విరమించారు. బాలికపై అత్యాచారానికి నిరసనగా గురువారం దాచేపల్లి బంద్‌కు స్థానికులు పిలుపునిచ్చారు. -
గుంటూరులో కత్తులతో దాడి.. ఇద్దరు మృతి
-
కృష్ణమ్మపైమరో వారధి
తంగెడ(దాచేపల్లి), న్యూస్‌లైన్: ఆ ఒడ్డు.. ఈ ఒడ్డు.. నడిమధ్య ఏరడ్డు. దానిపై వారధి నిర్మిస్తే రెండు జిల్లాల మధ్య ప్రయాణం ఎంతో సులువు. దీనికోసం గుంటూరు, నల్గొండ జిల్లాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు వారి ఆశలు ఫలించబోతున్నాయి. తంగెడ, మఠంపల్లిలను కలుపుతూ కృష్ణమ్మపై భారీ వారధి నిర్మాణం కానుంది. రోడ్లు భవనాలశాఖ మంజూరు చేసిన రూ.50 కోట్ల నిధులతో 840 మీటర్ల పొడవున 21 పిల్లర్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. నల్గొండ వైపు 600 మీటర్లు, గుంటూరు జిల్లా వైపు 260 మీటర్ల మేర అప్రోచ్ రోడ్డును నిర్మించనున్నారు. 2014 జనవరి మొదటివారంలో శంకుస్థాపన చేసేందుకు న ల్గొండ జిల్లా మఠంపల్లి వైపు ఏర్పాట్లు చేస్తున్నామని, ఏడాదిన్నర కాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నామని ఆర్ అండ్ బి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బల్లకట్టే దిక్కు.. కృష్ణానదిపై వారధి నిర్మాణం కోసం గుంటూరు, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జిల్లాల మధ్య ప్రవహించే నదిపై బ్రిడ్జి నిర్మిస్తే ప్రయాణ దూరం 60 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లకు తగ్గుతుంది. దాచేపల్లి మండలంలోని తంగెడ నుంచి కృష్ణానదికి ఆవల ఉన్న నల్గొండ జిల్లా మఠంపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్య క్షేత్రానికి చేరాలంటే పొందుగల బ్రిడ్జి మీదుగా దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే నదిపై 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే మఠంపల్లి చేరుకోవచ్చు. ఐదారేళ్ల నుంచి బల్లకట్టు సౌకర్యం ఉండటంతో నల్గొండ జిల్లా కు వెళ్లాల్సిన ప్రయాణికులు, వాహనదారులు తంగెడ వద్ద బల్లకట్టుపై ప్రయాణిస్తున్నారు. కృష్ణాకూ దగ్గరి దారి.. బల్లకట్టు ద్వారా నల్గొండ జిల్లా మీదుగా కృష్ణా జిల్లాలోకి కూడా తక్కువ దూరంలో వెళ్లవచ్చు. దీంతో నల్గొండ జిల్లాతోపాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పరిసరాలకు కూడా బల్లకట్టుపైనే ప్రయాణికులతోపాటు లారీల ద్వారా సరుకు రవాణా చేస్తున్నారు. రోజుకు దాదాపు 80 నుంచి 100 లారీలు బల్లకట్టు మీదుగా నది దాటుతుంటాయి. తంగెడలో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తయ్యే సిమెంట్ ఈ బల్లకట్టు మీదుగానే లారీల ద్వారా కృష్ణాజిల్లాకు పంపిస్తున్నారు. కొన్ని ఫ్యాక్టరీలకు కావాల్సిన ముడిసరుకు కూడా తంగెడ నుంచి తరలిస్తున్నారు. కానీ, నిర్వాహకులు బల్లకట్టును నిలిపివేసినప్పుడు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వర్షాలు కురిసి నదిలో నీటి ప్రవాహం పెరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ముందుగా బల్లకట్టు నిలిపివేస్తున్నారు. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నది మధ్యలో నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. వారధి నిర్మాణం పూర్తయితే ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. ప్రయాణ దూరం, సమయం, ఖర్చు కూడా తగ్గుతుంది.