స్వల్పకాలంలో రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3 షేర్లు ఇవే..! | NMDC, Sun Pharma, Voltas may clock double-digit gains in short term | Sakshi
Sakshi News home page

స్వల్పకాలంలో రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3 షేర్లు ఇవే..!

Published Wed, May 27 2020 1:51 PM | Last Updated on Wed, May 27 2020 2:44 PM

NMDC, Sun Pharma, Voltas may clock double-digit gains in short term - Sakshi

రిస్క్‌ రివార్డును ఎదుర్కోనగలిగే ఇన్వెస్టర్లకు అటో, ఫార్మా, ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లను సిఫార్సు చేస్తామని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ రీసెర్చ్‌ విశ్లేషకుడు విజయ్‌ జైన్‌ తెలిపారు. ఈ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే స్టాక్ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఇండెక్స్‌లో మెటల్‌ షేర్లు వాటి కాంజెస్టింగ్‌ జోన్‌ నుండి మీడియం-టర్మ్ సగటులను బ్రేక్‌ అవుట్‌ చేస్తున్నాయని ఆయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్పకాలానికి రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3స్టాకులను సిఫార్సు చేస్తున్నారు.

1.  షేరు పేరు: ఎన్‌ఎండీసీ
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.86
స్టాప్‌ లాస్‌: రూ.68
అప్‌ సైడ్‌: 15.60శాతం

విశ్లేషణ: డైలీ, వీక్లీ టైమ్‌ ఫ్రేమ్‌లో సుధీర్ఘ కన్సాలిడేషన్‌ తరువాత బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు బ్రేక్‌అవుట్‌ చూసింది. ఈ మెటల్‌ సెక్టార్‌లో ఇటీవల పాజిటివ్‌ మూమెంటమ్‌ నెలకొంది. రిలిటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ (ఆర్‌ఎస్‌ఐ) దాని యావరేజ్‌ లైన్‌ నుంచి అప్‌వర్డ్‌ క్రాస్‌ చేస్తోంది. ఈ సంకేతాలు రానున్న రోజుల్లో షేరు భారీ ర్యాలీని సూచిసున్నాయి. 

2. షేరు షేరు: సన్‌ ఫార్మా
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.535
స్టాప్‌ లాస్‌: రూ.425
అప్‌ సైడ్‌: 14.6శాతం 

విశ్లేషణ: గత నెలలో రూ.505 గరిష్టాల నుండి దిద్దుబాటు తర్వాత ధర, సమయం వారీగా షేరు కరెక‌్షన్‌ను పూర్తి చేసిందని మేము(రిలయన్స్‌ సెక్యూరిటీస్‌) నమ్ముతున్నాము. రాబోయే కొద్ది వారాల్లో ప్రస్తుత స్థాయిల నుండి మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. 

3. షేరు పేరు: వోల్టాస్‌
రేటింగ్‌: బై 
టార్గెట్‌ ధర: రూ.520
స్టాప్‌ లాస్‌: రూ.425
అప్‌ సైడ్‌: 13శాతం 

విశ్లేషణ: ఈ స్టాక్ బలమైన వాల్యూమ్‌లతో సబ్ రూ .430 వద్ద డబుల్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది.  ఆర్‌ఎస్‌ఐ ఇండెక్స్‌ యావరేజ్‌ బాండ్‌... సగటు బాండ్‌ను దాటి పైకి వెళ్లింది. ప్రస్తుత స్థాయిల నుంచి షేరు రాణిస్తుందని నమ్ముతున్నాము. రోజువారీ చార్టులలో డబుల్-బాటమ్ సపోర్ట్  ఓవర్‌సోల్డ్ స్టేటస్‌ రానున్న రోజుల్లో పదునైన అప్‌ మూమెంటమ్‌ను సూచిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement