వచ్చేవారంలో ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ బాసిన్ తెలిపారు. ఆ వారంలో కన్సాలిడేషన్ తర్వాత ఆగస్ట్‌లో ఫార్మా షేర్ల ర్యాలీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ తరుణంలో సిప్లా, లుపిన్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఇప్కా ల్యాబ్స్, కేడిల్లా హెల్త్‌కేర్ షేర్లను కొనుగోలు చేయవచ్చని భాసిన్ సిఫార్సు చేస్తున్నారు. ఈ 5కంపెనీలకు ఫార్మా రంగంలో మంచి పేరు ఉందన్నారు. జనరిక్, ల్యాబ్, ఏపీఐ ఒప్పందాల విషయంలో ఈ కంపెనీలు అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. టెక్నికల్‌గానూ ఈ షేర్ల ర్యాలీకి సిద్ధమైన విషయాన్ని ఛార్ట్‌లు చెబుతున్నాయన్నారు. నిఫ్టీతో పాటు మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగే సత్తా ఈ షేర్లకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికీ బుల్‌మార్కెట్లోనే ఫార్మా షేర్లు:
లాభాల స్వీకరణతో ఇటీవల ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయని అయితే ఇప్పటికీ ఈ షేర్లు బుల్ మార్కెట్లోనే ఉన్నాయని బాసిస్ తెలిపారు. మార్కెట్ మార్చిలో కనిష్టస్థాయిని తాకినపుడు ఫార్మా షేర్ల ర్యాలీ ప్రారంభమైందన్నారు. ‘‘మూడేళ్ల పాటు స్తబ్దుగా ట్రేడైన ఈఫార్మా షేర్లు గత 3నెలల పాటు లాభాల పంట పండిచాయి. నిజానికి ఇండెక్స్‌ల మార్చి కనిష్టం స్థాయి నుంచి 33శాతం రికవరికి ఫార్మా షేర్లు అందించిన తోడ్పాటు అభినందననీయం. ప్రభుత్వరంగ షేర్ల రీ-రేటింగ్ కారణంగా ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో నిధులు అధిక బీటా స్టాకుల్లోకి వెళ్లిపోతున్నాయి’’ అని బాసిన్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment