recommendations
-
మా వాడే.. కోరుకున్న చోటుకు పంపండి!
సాక్షి, అమరావతి: అప్పుడూ ఇప్పుడూ అని లేదు టీడీపీ నాయకులు లేటర్ ఇస్తే అదే ఆర్డర్, వారు ఎప్పుడు చెబితే అప్పుడు వారు లేఖలిచ్చిన ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిందే. విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలు గడిచిన తర్వాత సిఫారసు బదిలీలకు తెరతీశారు. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా ఇన్చార్జులు ఇచ్చిన సిఫారసు లేఖలతో ఉపాధ్యాయులు విద్యాశాఖ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమకు సిఫారసు ఉందని, తాము కోరుకున్న చోటకు బదిలీ, డెప్యూటేషన్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో విద్యా సంవత్సరం మధ్యలో అందించిన సిఫారసులపై ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. విద్యాశాఖలోని ఉన్నతాధికారులపై టీడీపీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా లేఖలను పరిశీలించి అవకాశం కల్పించాలని రాష్ట్ర కార్యాలయం నుంచి డీఈవోలకు ఆదేశాలు అందడం గమనార్హం. ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో దాదాపు 9 వేల మంది ఉపాధ్యాయులను ఇటీవల బదిలీ చేశారు. కూటమి నాయకులు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలు ఉన్నవారికి నిబంధనల ప్రకారం అర్హత లేకున్నా వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. అప్పటికే ఒక యూనిట్ పరీక్షలు పూర్తవడంతో పాటు దాదాపు 30 శాతం సిలబస్ సైతం పూర్తయ్యాక.. విద్యా సంవత్సరం మధ్యలో ఈ బదిలీల పర్వం చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ ప్రక్రియ ముగియగానే ఇప్పుడు తాజాగా నేతల సిఫారసులతో వందల్లో ఆశావహులు రావడం మొదలైంది. -
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్‌గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్‌లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలి
న్యూఢిల్లీ: టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటువేయాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసింది. అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రశ్నలడిగేందుకు వ్యాపార వేత్త హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకు న్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చిన విష యం తెలిసిందే. ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీకి పంపారు. బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్ సోంకార్ సారథ్యంలో గురువారం సమావేశమైన 10 మంది సభ్యుల ఎథిక్స్ కమిటీ 479 పేజీల నివేదిను ఆమోదించింది. పదిహేను రోజుల వ్యవధిలో ముగ్గురిని ప్రశ్నించి దీనిని తయారు చేశామని సోంకార్ చెప్పారు. ఎంపీ మొయిత్రాను సస్పెండ్ చేయా లన్న సిఫారసును కమిటీలోని నలుగురు వ్యతిరేకించగా ఆరుగురు బలపరిచారని తెలిపా రు. కాగా, ఒక ఎంపీపై అనర్హత వేటు వేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫారసు చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దీనిపై ఎంపీ మొయిత్రా స్పందిస్తూ.. ఇదంతా ముందుగానే ఖరారు చేసిన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికి తనను బహిష్కరించినా, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ సభలోకి అడుగుపెడతానన్నారు. ఈ నివేదికను ఎథిక్స్ కమిటీ పార్లమెంట్ ముందుంచుతుంది. అనంతరం చర్చ, ఆపైన చర్యలపై ఓటింగ్‌కు పెడతారు. ఎంపీ మహువా మొయిత్రా లంచం తీసుకున్నారంటూ అక్టోబర్ 14న బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే, లాయర్ జై అనంత్ దేహద్‌రా య్‌తో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది. ఇలా ఉండగా, తమ ఎంపీ మొయిత్రాను టీఎంసీ గట్టి గా సమర్థించింది. బీజేపీ సారథ్యంలోని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రశ్నించిన వారిని వేధిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఆరోపణలు రుజువు కాకు ండానే పార్లమెంటరీ కమిటీ ఆమెపై చర్యలకు ఎలా సిఫారసు చేస్తుందని ప్రశ్నించారు. -
Padma Awards 2024: ‘పద్మ అవార్డులకు ప్రతిపాదనలు పంపండి’
న్యూఢిల్లీ: ప్రతిభావంతులైన వ్యక్తులను గుర్తించి, వారి గొప్పదనం, విజయాలు పద్మ అవార్డులతో సత్కరించడానికి అర్హులను భావించినట్లయితే ఆ పేర్లను సిఫారసు చేయాలని ప్రజలను సోమవారం కేంద్రం కోరింది. 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు నామినేషన్లు, ప్రతిపాదలను 2023 మే ఒకటో తేదీ నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపింది. పద్మ అవార్డుల సిఫారసులకు ఆఖరు తేదీ సెప్టెంబర్ 15. ప్రతిపాదనలను ఆన్లైన్లో https://awards.gov.in ద్వారా పంపాలని కోరింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో గౌరవిస్తుంది. -
మా సిఫార్సులను... పదేపదే తిప్పి పంపొద్దు..
న్యూఢిల్లీ: న్యాయమూర్తులుగా తాము చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పదేపదే తిప్పి పంపజాలదని సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి స్పష్టం చేసింది. పలు హైకోర్టులకు న్యాయమూర్తులుగా ఇప్పటికే పలుమార్లు చేసిన ఐదు గత సిఫార్సులను తాజాగా మరోసారి కేంద్రానికి పంపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌తో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం మంగళ, బుధవారాల్లో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీరిలో తాను స్వలింగ సంపర్కినని ప్రకటించుకున్న సీనియర్ అడ్వకేట్ సౌరభ్ కృపాల్ కూడా ఉన్నారు. ఆయనను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న 2021 నవంబర్ 11 నాటి సిఫార్సును కొలీజియం తాజాగా పునరుద్ఘాటించింది. న్యాయవాదులు ఆర్.జాన్ సత్యంను మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా, సోమశేఖర్ సుందరేశన్‌ను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా తిరిగి సిఫార్సు చేసింది. వీరితో పాటు అమితేశ్ బెనర్జీ, సఖ్య సేన్‌ను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులుగా వెంటనే నియమించాలని కూడా పేర్కొంది. అలాగే కర్నాటక, అలహాబాద్, మద్రాస్ హైకోర్టులకు న్యాయమూర్తులుగా మరో 20 పేర్లను సిఫార్సు చేసింది. వీరిలో 17 మంది న్యాయవాదులు, ముగ్గు్గరు జడ్జిలున్నారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఉద్దేశించి కొలీజియం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ సిఫార్సులను కేంద్రం పదేపదే తిప్పి పంపడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. అమితేశ్, సేన్ పేర్లను కేంద్రం ఇప్పటికే రెండేసిసార్లు తిప్పి పంపింది. అమితేశ్ తండ్రి జస్టిస్ యు.సి.బెనర్జీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. గోధ్రాలో సబర్మతి రైలు ప్రమాదం వెనక కుట్ర కోణమేదీ లేదని తేల్చిన కమిషన్‌కు సారథి. ఇక సత్యం ప్రధాని మోదీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ విధానాలు, పథకాలపై సుందరేశన్ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని వారి పేర్లను కేంద్రం తిప్పి పంపింది. ఈ అభ్యంతరాలను కొలీజియం తాజాగా తోసిపుచ్చింది. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించడం రాజ్యాంగపరమైన పదవులు చేపట్టేందుకు అడ్డంకి కాబోదని స్పష్టం చేసింది. -
ఓఎన్జీసీ గ్యాస్‌పై ధరల పరిమితి
న్యూఢిల్లీ: గ్యాస్ ధరల పరిమితిని తేల్చేందుకు ఏర్పాటైన కిరీట్ పారిఖ్ కమిటీ తన సిఫారసులను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. ప్రభుత్వరంగ సంస్థల పురాతన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజవాయువుపై ధరల పరిమితిని సూచించనున్నట్టు అధికార వర్గాల సమాచారం. దీనివల్ల సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఉత్పత్తి పరంగా క్లిష్టమైన క్షేత్రాల విషయంలో ఎటువంటి మార్పుల్లేకుండా ప్రస్తుత ధరల విధానానికే మొగ్గు చూపించనుంది. అంతిమంగా వినియోగదారుడికి సహేతుక ధర ఉండేలా సిఫారసులు ఇవ్వాలని ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం గతంలో కోరడం గమనార్హం. పాత కాలం నాటి గ్యాస్ క్షేత్రాలను ఎక్కువగా ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా నిర్వహిస్తున్నాయి. వీటికి సంబంధించి వ్యయాలను ఇప్పటికే ఈ సంస్థలు రికవరీ చేసుకుని ఉంటాయన్న ఉద్దేశ్యంతో ధరల పరిమితికి కమిటీ మొగ్గు చూపించనుంది. అలాగే, కిరీట్ పారిఖ్ కమిటీ కనీస ధర, గరిష్ట ధరలను కూడా సిఫారసు చేయవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా ధరలు ఉత్పత్తి రేటు కంటే దిగువకు పడిపోకుండా చూడొచ్చన్నది ఉద్దేశ్యంగా ఉంది. గ్యాస్ ధరలు సుమారు 70 శాతం మేర పెరిగి మిలియన్ బ్రిటిష్ ధర్మ యూనిట్‌కు 8.57 డాలర్లకు చేరడం తెలిసిందే. -
ఏఆర్‌సీల క్రమబద్ధీకరణకు ఆర్బీఐ కమిటీ సిఫార్సులు
ముంబై: అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్సీ) పనితీరును క్రమబద్ధీకరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. మొండి అసెట్స్‌ను విక్రయించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం, దివాలా కోడ్ ప్రక్రియలో పరిష్కార నిపుణులుగా వ్యవహరించేందుకు ఏఆర్‌సీలను కూడా అనుమతించడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ. 500 కోట్లు పైబడిన ఖాతాల విషయంలో వాటిని విక్రయిస్తే వచ్చే విలువ, సముచిత మార్కెట్ ధరను బ్యాంకులు ఆమోదించిన ఇద్దరు వేల్యుయర్లతో లెక్క గట్టించాలని కమిటీ సూచించింది. రూ. 100 కోట్లు –500 కోట్ల మధ్య అకౌంట్లకు ఒక్క వేల్యుయర్‌ను నియమించవచ్చని పేర్కొంది. రుణాన్ని రైటాఫ్ చేయగలిగే అధికారాలు ఉన్న అత్యున్నత స్థాయి కమిటికే.. రిజర్వ్ ధరపై తుది నిర్ణయాధికారం ఉండాలని తెలిపింది. సంబంధిత వర్గాలు డిసెంబర్ 15లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు పంపాల్సి ఉంటుంది. ఇటు బాకీల రికవరీ, అటు వ్యాపారాలను పునరుద్ధరణ అంశాల్లో ఏఆర్‌సీల పనితీరు అంత ఆశావహంగా లేకపోతున్న నేపథ్యంలో వాటి పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ సారథ్యంలో కమిటీ ఏర్పడింది. -
పీఆర్సీ సిఫార్సుల అమలుకు సర్కారు సానుకూలం
సాక్షి, అమరావతి: పీఆర్సీ సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సమీర్ శర్మ మాట్లాడుతూ.. పీఆర్సీ సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే వారం పీఆర్సీ కమిటీ అధికారులతో సమావేశమై పూర్తిస్థాయిలో చర్చిస్తామన్నారు. పీఆర్సీ నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలన్న డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. దీనిని సంబంధించి సంగ్రహ నివేదికను వారం రోజుల్లోగా అందిస్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సుమారు రెండేళ్లుగా ఆశాజనకంగా లేవని, వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సర్వీసెస్, హెచ్ఆర్ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాలు తెలిపిన అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్వీసెస్, హెచ్ఆర్ఎం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 2010లో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగ్గా.. పదేళ్ల అనంతరం ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌చంద్ర, ప్రవీణ్‌కుమార్, ఎస్ఎస్ రావత్, వి.ఉషారాణి, గోపాలకృష్ణ ద్వివేది, బి.రాజశేఖర్, కార్యదర్శి శ్యామలరావు, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
మాన్యువల్ స్కావెంజర్ల వ్యవస్థ ఇంకెన్నాళ్లు?
సాక్షి, న్యూఢిల్లీ: చేత్తో మలమూత్రాలను ఎత్తిపోసే కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్లు) మరణాలపై సంబంధిత అథారిటీలదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పేర్కొంది. దేశంలో ఈ వ్యవస్థను గతంలోనే నిషేధించినా ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు కార్మికుల రక్షణ, భద్రతకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకు ఎన్హెచ్ఆర్సీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసుల అమలు విషయంలో తీసుకున్న చర్యలపై మూడు నెలల్లో నివేదిక అందించాలని సూచించింది. ఎన్హెచ్ఆర్సీ సిఫార్సులు ► మాన్యువల్ స్కావెంజర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. వారి పిల్లలకు ఉపకార వేతనాలతో కూడిన విద్య అందించాలి. ► కార్మికుల డేటాబేస్ ఏర్పాటు చేయాలి. ► సెప్టిక్ ట్యాంకులు, కాలువలను శుభ్రం చేసే వారికి హెల్మెట్లు, రక్షణ జాకెట్లు, గ్లౌజులు, బూట్లు, రక్షణ కళ్లజోళ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టార్చిలైట్లను స్థానిక సంస్థలు లేదా నియమిత సంస్థలు అందజేయాలి. ► ప్రమాదకర రసాయనాల శుద్ధికి నిపుణులైన కార్మికులను వినియోగించాలి. వారికి ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వర్తింపజేయాలి. ► యంత్రాలతో శుభ్రం చేసేలా మురుగు కాలువలను నిర్మించాలి. ► నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బయో టాయిలెట్లు నిర్మించాలి. ► పాతం కాలం మరుగుదొడ్లను ఆధునిక మరుగుదొడ్లుగా మార్చాలి. -
కరోనా వ్యాక్సినేషన్: నిపుణుల ప్యానల్ కీలక సిఫార్సులు
సాక్షి, ఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై నిపుణుల ప్యానల్ కీలక సిఫార్సులు చేసింది. కరోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాత టీకా తీసుకుంటే మంచిందని ఎన్టీఏజీఐ సూచించింది. ఈ వ్యవధిని గతంలో ఆరు నెలలుగా సూచించిన ఎన్టీఏజీఐ.. ఇప్పుడు తొమ్మిది నెలలకు పెంచింది. ప్రస్తుతం 9 నెలల వ్యత్యాసం ఉండాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను ఎన్టీఏజీఐ.. కేంద్రానికి పంపింది. కరోనా బారినపడి కోలుకున్నవారు తొలి డోసు టీకాకు ఎక్కువ కాలం గ్యాప్ ఉంటే మంచిందని ప్యానెల్ తెలిపింది. తొమ్మిది నెలల అనంతరం టీకా తీసుకోవడం ద్వారా శరీరంలో అధిక మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని పేర్కొంది. చదవండి: భారత్: తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు సింగపూర్ వేరియంట్ థర్ఢ్‌వేవ్ కు కారణం కావచ్చు: కేజ్రీవాల్ -
ఫేస్బుక్లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...!
ప్రస్తుత కాలంలో బ్యాంకుల్లో అకౌంట్లు, ఫేస్బుక్లో అకౌంట్లు లేని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఫేస్బుక్లో మనకు తరుచూగా వేరే వ్యక్తులు లేదా గ్రూపులకు సంబంధించిన రికమన్డేషనులు వస్తుంటాయి. మనకు ఫలానా వ్యక్తులు లేదా గ్రూపులు నచ్చితే మనం వాటిలో జాయిన్ అవుతాం. ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీలు సాంకేతికతను అందిపుచ్చుకున్నాయి. అంతేకాకుండా సామాజిక సంస్థలు కూడా ఫేస్బుక్లో గ్రూపులను క్రియేట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో రాజకీయ, సామాజిక సంస్థల ఖాతాలను మనకు రికమెన్డేషన్గా ఈ గ్రూప్‌లు కనిపించవు. ప్రస్తుతం ఫేస్బుక్ ఈ విషయంపై పనిచేస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా గ్రూప్‌లో ఫేస్బుక్ నియమాలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను బ్లాక్ చేయనుంది. కొన్ని ఫేస్బుక్ గ్రూపులు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా ఉపయోగిస్తున్నారని పరిశోధకులు, పౌర హక్కుల సంస్థలు చాలాకాలంగా ఫేస్‌బుక్‌ను హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వీటిని అరికట్టడానికి సంస్థ పలు చర్యలను తీసుకోవాలని భావించింది. ఏదైనా అంశంపై కొత్తగా సృష్టించే ఫేస్బుక్ గ్రూపులకు కచ్చితంగా ఫలానా గ్రూపును ఫేస్బుక్ మానిటర్ చేయనుంది. ఫలానా గ్రూప్ అర్హత సాధించాలంటే 21 రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉందని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ టామ్ ఎలిసన్ తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో, ఫేస్బుక్ వినియోగదారులకు హెల్త్ గ్రూప్‌లను రికమెన్డేషన్ చేయడాన్ని ఆపివేసింది. ఈ గ్రూపుల్లో ఉండే వారికి సరైన సమాచారాన్ని ఎక్కువగా అందించలేకపోయాయి , ఆ సమాచారంతో కొంతమంది వ్యక్తులు ఇబ్బందులకు గురైయ్యారని ఫేస్బుక్ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు, జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి కొన్ని నెలల ముందు, కొన్ని ఫేస్బుక్ గ్రూప్‌లు తప్పుడు సమాచారాన్ని, హింసాత్మక సంఘటనలు ప్రేరేపించేలా చేసాయని ఫేస్బుక్ తెలిపింది. ఈ గ్రూప్‌లు ఇతర ఫేస్బుక్ యూజర్లకు రికమెన్డేషన్ చూపించకుండా ఉన్న పలు ఫేస్బుక్ గ్రూప్‌లు గణనీయంగా పెరిగాయని ఫేస్బుక్ తెలిపింది. -
ఆగస్ట్‌లో ఈ 5ఫార్మా షేర్లను కొనండి: సంజీవ్ భాసిన్
వచ్చేవారంలో ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకునే అవకాశం ఉందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ బాసిన్ తెలిపారు. ఆ వారంలో కన్సాలిడేషన్ తర్వాత ఆగస్ట్‌లో ఫార్మా షేర్ల ర్యాలీకి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ తరుణంలో సిప్లా, లుపిన్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, ఇప్కా ల్యాబ్స్, కేడిల్లా హెల్త్‌కేర్ షేర్లను కొనుగోలు చేయవచ్చని భాసిన్ సిఫార్సు చేస్తున్నారు. ఈ 5కంపెనీలకు ఫార్మా రంగంలో మంచి పేరు ఉందన్నారు. జనరిక్, ల్యాబ్, ఏపీఐ ఒప్పందాల విషయంలో ఈ కంపెనీలు అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నాయని తెలిపారు. టెక్నికల్‌గానూ ఈ షేర్ల ర్యాలీకి సిద్ధమైన విషయాన్ని ఛార్ట్లు చెబుతున్నాయన్నారు. నిఫ్టీతో పాటు మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగే సత్తా ఈ షేర్లకు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ బుల్మార్కెట్లోనే ఫార్మా షేర్లు: లాభాల స్వీకరణతో ఇటీవల ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయని అయితే ఇప్పటికీ ఈ షేర్లు బుల్ మార్కెట్లోనే ఉన్నాయని బాసిస్ తెలిపారు. మార్కెట్ మార్చిలో కనిష్టస్థాయిని తాకినపుడు ఫార్మా షేర్ల ర్యాలీ ప్రారంభమైందన్నారు. ‘‘మూడేళ్ల పాటు స్తబ్దుగా ట్రేడైన ఈఫార్మా షేర్లు గత 3నెలల పాటు లాభాల పంట పండిచాయి. నిజానికి ఇండెక్స్‌ల మార్చి కనిష్టం స్థాయి నుంచి 33శాతం రికవరికి ఫార్మా షేర్లు అందించిన తోడ్పాటు అభినందననీయం. ప్రభుత్వరంగ షేర్ల రీ-రేటింగ్ కారణంగా ఇన్వెస్టర్లు పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో నిధులు అధిక బీటా స్టాకుల్లోకి వెళ్లిపోతున్నాయి’’ అని బాసిన్ చెప్పుకొచ్చారు. -
ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈ 5రంగాలు అనుకూలం.!
ప్రస్తుతం మార్కెట్లో రిస్క్‌ను ఎదుర్కోనే సత్తా కలిగిన ఇన్వెస్టర్లకు మార్కెట్ నిపుణుడు అతుల్ భోలే 5రంగాల షేర్లను సూచిస్తున్నారు. ఫైనాన్సియల్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, సిమెంట్, టెలికాం రంగాల షేర్లు అందులో ఉన్నాయి. ఏడాది నుంచి ఏడాదిన్నర కాలపరిమితి దృష్ట్యా కొనుగోలు చేయవచ్చని భోలే సలహానిస్తున్నారు. ఈ 5రంగాల షేర్లపై విశ్లేషణలను ఇప్పుడు చూద్దాం... ఫైనాన్షియల్ స్టాక్స్: ప్రస్తుత ర్యాలీ ముగింపు తర్వాత కూడా ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశం ఉంది. ఈ రంగాల షేర్ల ధరలను పరిశీలిస్తే, కోవిడ్-19 పతనం తర్వాత జరిగిన రికవరీలో భాగంగా ఇప్పటికీ 35శాతం వెనకబడి ఉన్నాయి. ఇదే సమయంలో ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లు ప్రీ-కోవిడ్ స్థాయిలో లేదా అంతకుమించి రికవరీని సాధించాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఈరంగ షేర్లు ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అగ్రో కెమికల్స్, ఫైర్టిలైజర్ స్టాక్: ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదు అవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఫెర్టిలైజర్ కంపెనీలకు కలిసొచ్చే అంశం అవుతుంది. ప్రపంచస్థాయి అగ్రో కెమికల్స్ కంపెనీలకు ఏమాత్రం తక్కువగా కాకుండా మనదేశ అగ్రో కంపెనీలు నిర్వహణ సామర్థా్యన్ని కలిగి ఉన్నాయి. కోవిడ్ అనంతరం పలు అంతర్జాతీయ అగ్రో కంపెనీలు చైనా నుంచి భారత్‌కు తరలిరావాలనే యోచనలో ఉన్నాయి. కాబట్టి అటు వ్యాపార కోణం నుంచి అగ్రి కెమికల్స్ కంపెనీలకు కలిసొస్తుంది. సిమెంట్, టెలికాం షేర్లు: గత మూడేళ్లుగా ఈ రంగాల్లో కన్సాలిడేట్ జరిగింది. ప్రస్తుతం సిమెంట్, టెలికాం కంపెనీలు కన్షాలిడేట్ అనంతరం లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ధరల శక్తిని తిరిగి పొందుతున్నాయి. వాల్యూవేషన్ వృద్ధి అవుట్‌లుక్ కూడా చాలా బాగుంది. ఆ అంశాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ షేర్లు ర్యాలీ చేసే అవకాశం ఉంది. -
జెఫ్పారీస్ బ్రోకరేజ్ నుంచి 3 స్టాక్ సిఫార్సులు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పారీస్ మూడు స్టాకులపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. ఫినోలాక్స్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ అందులో ఉన్నాయి. ఈ 3షేర్లకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేర్ల టార్గెట్ ధరలను పెంచింది. ఈ 3 షేర్లు మార్చి కనిష్టస్థాయిల నుంచి 29-71శాతం లాభపడ్డాయి. ఇప్పుడు ఈ 3కంపెనీల షేర్లపై బ్రోకరేజ్ సంస్థ విశ్లేషణలను చూద్దాం..! 1.ఫినోలాక్స్ ఇండస్ట్రీస్: ఈ క్యూ4లో కంపెనీ అమ్మకాలు 21శాతం క్షీణించగా, నికరలాభం 39శాతం నష్టాన్ని చవిచూసింది. వార్షిక ప్రాతిపాదిక ఈ క్వార్టర్లో పైప్స్లు/పీవీసీ రెసిస్ అమ్మకాల వాల్యూమ్స్ 20శాతం క్షీణించాయి. అయితే ఇదే సమయంలో పైప్‌ల విభాగపు మార్జిన్ అధిక స్థాయిలో మెరుగైంది. ఎర్నింగ్ గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ.., కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇప్పటికీ బలంగానే ఉంది. నికర రుణం ఈక్విటీ నిష్పత్తి 0.03గా ఉంది. నేపథ్యంలో షేరు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ., షేరు టార్గెట్ ధరను రూ.500కు పెంచింది. ఈ షేరు మార్చి కనిష్టం నుంచి 71.4శాతంగా రికవరిని సాధించింది. 2.కేఈఐ ఇండస్ట్రీస్: సంస్థకు అప్పులు తక్కువగా ఉన్నాయి. వినియోగ సామర్థ్యం 60-65శాతాన్ని చేరుకుంది. వినియోగం ఇంజనీరింగ్ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతుల దృష్ట్యా డిమాండ్ వైపు ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సవాళ్లను ఎదుర్కోవడానికి కంపెనీకి గల బలమైన బ్యాలెన్స్ షీట్ సహకరిస్తుంది. ఈ సానుకూల పరిణామాలతో షేరు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.400కు పెంచడమైంది. మార్చి కనిష్టం నుంచి షేరు 68శాతం లాభపడింది. 3.ఐసీఐసీఐ బ్యాంక్: నాణ్యమైన అస్తులను కలిగి ఉంది. ప్రస్తుత ధర వాల్యూయేషన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఇటీవల తన అనుబంధ సంస్థలో వాటాను విక్రయించి రూ.3900 కోట్లను సమీకరించింది. గత కొంతకాలంగా ప్రైవేట్‌రంగ బ్యాంక్ సెక్టార్లో కెల్లా మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ షేరు గతంలో కేటాయించిన రూ.450ల కొనుగోలు టార్గెట్ ధరను రూ.460కి పెంచింది. ఈ టార్గెట్ ధర ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 25శాతం అధికంగా ఉంది. -
ఏడాది కాలానికి 3స్టాక్ సిఫార్సులు
షేరు పేరు: ఎస్బీఐ బ్రోకరేజ్ పేరు: హెచ్డీఎఫ్సీ బ్రోకరేజ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.218 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: ప్రస్తుత సంక్షోభ పరిస్థితిల్లో లయబిలిటీ రిస్క్‌లను ఎదుర్కోనే శక్తి సామర్థా్యలు ఎస్బీఐకు పుష్కలంగా ఉన్నాయి. సంస్థలో ప్రభుత్వం మెజార్టీ వాటాను కలిగి ఉండటం, డిపాజిట్లు క్రమంగా పెరుగుదల ఇందుకు సహకరిస్తున్నాయి. లోక్‌బుక్ నాణ్యత కారణంగా అసెట్ క్వాలిటీ విషయంలో అనేక ఇతర పెద్ద బ్యాంకుల కంటే మెరుగైన స్థానంలో ఉంది. కాబట్టి షేరును ప్రస్తుత మార్కెట్ ధర(రూ.189.55) వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రూ.152-157 పరిధి వరకు పడిన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: టెక్ మహీంద్రా బ్రోకరేజ్ పేరు: హెచ్డీఎఫ్సీ బ్రోకరేజ్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్: రూ.601 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: కోవిడ్-19 ప్రేరేపిత లాక్డౌన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితులు ఐటీ రంగాన్ని పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. దీంతో ప్రముఖ గ్లోబల్ కమ్యూనికేషన్ కంపెనీలు నెట్వర్క్ వ్యవస్థపై ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. కనెక్టివిటీకి డిమాండ్ పెరగడం కూడా ఈ షేరుకు కలిసొచ్చే అంశంగా ఉంది. కమ్యూనికేషన్ వర్టికల్లో అగ్రస్థానానికి చేరుకునేందుకు టెక్ మహీంద్రాకు పుష్కలంగా అవకాశాలున్నాయి. కాబట్టి ఈ షేరును రూ.500-508 శ్రేణిలో కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే రూ.455-460 శ్రేణి వరకు పతనమైన ప్రతిసారి కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: జేకే సిమెంట్స్ బ్రోకరేజ్ పేరు: మోతీలాల్ ఓస్వాల్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్: రూ.1450.00 కాల వ్యవధి: ఒక ఏడాది విశ్లేషణ: వ్యాపార విస్తరణతో ద్వారా అమ్మకాలు, ఆదాయ వృద్ధి జరగుతుందని అంచనా. ఉత్తర, మధ్య భారత్‌లో అమ్మకాలు పెరుగుతాయని అంచనా. కొత్తగా కంపెనీ పెట్టే వ్యయంతో ఉత్పాదక సామర్థ్యం పెరగుతుంది. తద్వారా కంపెనీ వార్షిక సగటు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రూ.1450.00 టార్గెట్ ధరతో ప్రస్తుత మార్కెట్ ధర(రూ.1419.95) వద్ద కొనుగోలు చేయడం ఉత్తమం. -
రిలయన్స్ సెక్యూరిటీస్ నుంచి టాప్-3 స్టాక్ సిఫార్సులు
అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ర్యాలీతో సూచీలు ఈ వారాంతాన్ని లాభంతో ముగించాయి. రాబోయే 3-6 నెలల్లో సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయననే ‘ఆశ’లు కూడా సూచీల సానుకూల సెంటిమెంట్‌కు కలిసాచ్చాయి. భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం వివాదం, ఈ కంపెనీ త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడం, ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ మందగమనం లాంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., ఈ వారంలో సూచీలు లాభాలను ఆర్జించగలిగాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 951 పాయింట్లు, నిఫ్టీ 272 పాయింట్లు చొప్పున ఎగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.7 శాతం లాభపడ్డాయి. రానున్న రోజుల్లో మార్కెట్ మిశ్రమ వైఖరిని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ రిలయన్స్ సెక్యూరిటీస్ 3 స్టాకులను సిఫార్సు చేసింది. టెక్నికల్ అంశాలను బేరీజు వేసుకుని వచ్చే 3నెలల్లో ఈ 3షేర్లు 22శాతం వరకూ లాభాలను పంచవచ్చని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. షేరు పేరు: పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.100 అప్‌సైడ్: 17శాతం విశ్లేషణ: ఇటీవల షేరు స్వల్పకాలిక, మీడియం టర్మ్ యావరేజ్‌లకు బలమైన వాల్యూమ్స్‌తో క్రాష్ కావడంతో షేరు ప్రస్తుత స్థాయి నుంచి మంచి ప్రదర్శన కనబరచవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది షేరు గరిష్టం రూ.134 నుంచి తన 50శాతం రిట్రేస్‌మెంట్‌ను రూ.74 వద్ద పూర్తి చేసింది. వీక్లీ ఛార్ట్‌లో ఏర్పడిన హయ్యర్ బాటమ్స్ షేరులో బలాన్ని చూపుతున్నాయి. వీక్లీ ఆర్ఎస్ఐ తన యావరేజ్ లైన్‌ను అధిగమిచడం షేరు బలమైన బ్రేక్ అవుట్‌ను సూచిస్తుంది. సెక్టార్లో పాజిటివ్ మూమెంటమ్ కూడా షేరు తదుపరి ర్యాలీకి కలిసొస్తుంది. షేరు పేరు: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ. 439 అప్‌సైడ్: 11శాతం విశ్లేషణ: షేరు తన వీక్లీ ఛార్ట్‌లో రూ.380-385 పరిధిలో ట్రిపుల్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. డైలీ ఛార్ట్‌లో ఇన్సైడ్ రేంజ్ బ్రేక్ అవుట్ ఇవ్వొచ్చు. డైలీ ఆర్ఎస్ఐ 50 స్థాయిపై ట్రేడ్ అవుతోంది. ఇది అప్పర్ హాండ్‌లో షేరు బుల్లిష్ సెట్ ఏర్పాటును ఇండికేట్ చేస్తుంది. ఈ షేరుకు రూ.375-385 పరిధిలో మల్టీపుల్ మద్దతు ధరలను కలిగి ఉంది. ఇది ప్రస్తుత షేరు వద్ద కొనుగోలుకు రిస్క్-రివార్డుకు మంచి అవకాశం. షేరు పేరు: సన్ ఫార్మా రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.590 అప్‌సైడ్: 22శాతం విశ్లేషణ: ఈ షేరు గతవారంలో రూ.515 వద్ద రికార్డు స్థాయిని తాకి కరెక్షన్కు లోనైంది. తర్వాత షేరు దాని దీర్ఘకాలిక యావరేజ్ నుండి తిరిగి వచ్చింది. సెక్టార్ ప్రస్తుతం అప్‌ట్రెండ్‌లో ఉంది. వీక్లీ ఛార్ట్‌లో హైయర్ బాటమ్ ఫార్మేషన్‌ను నమోదు చేసింది. రానున్న నెలల్లో బలమైన మూమెంటం ఉటుందని మంత్లీ ఛార్ట్లు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ షేరు 34నెలల యావరేజ్ బలమైన వ్యాల్యూమ్స్‌తో బ్రేక్ చేసింది. -
నెలలో 13శాతం ఆదాయం ఇచ్చే 3షేర్లు
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న భారత ఈక్విటీ మార్కెట్ ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ రిసెర్చ్ హెడ్ షితిజ్ గాంధీ అంచనా వేశారు. మార్కెట్లో పట్టును సాధించే క్రమంలో బుల్స్, బేర్ మధ్య జరుగుతున్న తీవ్ర పోరాటంలో నిఫ్టీ ఇండెక్స్ 10000-9700 పరిమితి శ్రేణిలో కదలాడవచ్చని ఆయన అన్నారు. ‘‘డెరివేటివ్స్ విభాగంలో కాల్ రైటర్లు 10వేల కాల్ స్ట్రైక్ వద్ద భారీ ఓపెన్ ఇంట్రెస్ట్‌ను బిల్డప్ చేశారు. ఈ స్థాయి నిఫ్టీకి కీలక నిరోధంగా పనిచేయవచ్చు. అలాగే నిఫ్టీకి 9800 వద్ద, 9700 వద్ద పుట్ రైటింగ్ తక్కువగా జరిగింది. ఈ నేఫథ్యంలో డౌన్‌సైడ్ ట్రెండ్‌లో ఈ స్థాయిలు కీలక మద్దతు స్థాయిలుగా మారవచ్చు.’’ అని షితిజ్ తెలిపారు. టెక్నికల్ కోణంలో పరిశీలిస్తే స్టాక్ ఆధారిత యాక్షన్‌తో మార్కెట్లో రానున్న రోజుల్లో అస్థిరత నెలకొని ఉంటుందని సెంకడరీ ఓసిలేటర్లు సూచిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ విషయానికొస్తే, 19,600-20,600 శ్రేణిలో కన్సాలిడ్ అవ్వోచ్చు. ఏదైనా సైడ్ బ్రేక్ మార్కెట్‌కు మరింత దిశానిర్దేశం చేయవచ్చని షితీజ్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 3నుంచి 4వారాల కాలపరిమితిలో 10-13శాతం రాబడులను ఇచ్చే 3స్టాక్స్‌లను ఆయన సిఫార్సు చేస్తున్నారు. షేరు పేరు: రాలీస్ ఇండియా రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.295 స్టాప్ లాస్: రూ.240 అప్‌సైడ్: 11శాతం విశ్లేషణ: గడచిన 3వారాల నుంచి ఈ షేరు రూ.200-230 శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి డైలీ ఛార్ట్‌లో దాని స్వల్ప, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్‌ల కంటే అధికంగా ఉన్నాయి. ధీర్ఘకాలిక కన్సాలిడేషన్ ఛార్ట్స్‌లో దీర్ఘచతురస్ర ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. ఈ వారం, షేరు అధిక వాల్యూమ్‌లతో నిర్వచించిన పరిధి కంటే కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కాబట్టి ట్రేడర్లు రూ.240 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.295 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.260-265 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: గోద్రేజ్ ఆగ్రోవేట్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.483 స్టాప్ లాస్: రూ.385 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: ఈ ఏడాది మార్చిలో 300 స్థాయికి పతనమైన తర్వాత, షేరు తన కనిష్టస్థాయిల నుంచి వేగంగా రికవరిని సాధించింది. డైలీ ఛార్ట్‌లో 100 రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్కంటే మరోసారి మూమెంటం ఊపందుకుంది. అదనంగా, దాదాపు 7-వారాల సుదీర్ఘ కన్సాలిడేట్ తర్వాత అధిక వాల్యూమ్స్‌తో ధరల వేగం పుంజుకుంది. కాబట్టి ట్రేడర్లు రూ.385 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.483 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.420-425 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: బర్గర్ పేయింట్స్ రేటింగ్: బై టార్గెట్: రూ.555 స్టాప్ లాస్: రూ.468 అప్ సైడ్: 10శాతం విశ్లేషణ: ఈ స్టాక్ డైలీ ఛార్టులలో దాని స్వల్ప, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్‌ల కంటే స్థిరంగా ఉంది. టెక్నికల్ పాయింట్ కోణంలో స్టాక్ డైలీ చార్టులలో కప్ అండ్ హ్యాండిల్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. సెంకడరీ ఓసిలేటర్ల ప్యాట్రన్లు షేరు అప్‌సైడ్ ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు రూ.468 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.555 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.500-505 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. -
స్వల్పకాలంలో రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3 షేర్లు ఇవే..!
రిస్క్ రివార్డును ఎదుర్కోనగలిగే ఇన్వెస్టర్లకు అటో, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లను సిఫార్సు చేస్తామని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు విజయ్ జైన్ తెలిపారు. ఈ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే స్టాక్ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఇండెక్స్‌లో మెటల్ షేర్లు వాటి కాంజెస్టింగ్ జోన్ నుండి మీడియం-టర్మ్ సగటులను బ్రేక్ అవుట్ చేస్తున్నాయని ఆయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్పకాలానికి రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. 1. షేరు పేరు: ఎన్ఎండీసీ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.86 స్టాప్ లాస్: రూ.68 అప్ సైడ్: 15.60శాతం విశ్లేషణ: డైలీ, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో సుధీర్ఘ కన్సాలిడేషన్ తరువాత బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు బ్రేక్అవుట్ చూసింది. ఈ మెటల్ సెక్టార్లో ఇటీవల పాజిటివ్ మూమెంటమ్ నెలకొంది. రిలిటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) దాని యావరేజ్ లైన్ నుంచి అప్‌వర్డ్ క్రాస్ చేస్తోంది. ఈ సంకేతాలు రానున్న రోజుల్లో షేరు భారీ ర్యాలీని సూచిసున్నాయి. 2. షేరు షేరు: సన్ ఫార్మా రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.535 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 14.6శాతం విశ్లేషణ: గత నెలలో రూ.505 గరిష్టాల నుండి దిద్దుబాటు తర్వాత ధర, సమయం వారీగా షేరు కరెక్షన్ను పూర్తి చేసిందని మేము(రిలయన్స్ సెక్యూరిటీస్) నమ్ముతున్నాము. రాబోయే కొద్ది వారాల్లో ప్రస్తుత స్థాయిల నుండి మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. 3. షేరు పేరు: వోల్టాస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.520 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: ఈ స్టాక్ బలమైన వాల్యూమ్‌లతో సబ్ రూ .430 వద్ద డబుల్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. ఆర్ఎస్ఐ ఇండెక్స్ యావరేజ్ బాండ్... సగటు బాండ్‌ను దాటి పైకి వెళ్లింది. ప్రస్తుత స్థాయిల నుంచి షేరు రాణిస్తుందని నమ్ముతున్నాము. రోజువారీ చార్టులలో డబుల్-బాటమ్ సపోర్ట్ ఓవర్‌సోల్డ్ స్టేటస్ రానున్న రోజుల్లో పదునైన అప్ మూమెంటమ్‌ను సూచిస్తున్నాయి. -
ఏసీసీ, శ్రీ సిమెంట్స్ షేర్లపై ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ బుల్లిష్
నిఫ్టీకి రానున్న రోజుల్లో 8800- 9300 శ్రేణిలో కీలకం కానుందని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ సీనియర్ సాంకేతిక నిపుణుడు షితిజ్ గాంధీ అంచనా వేస్తున్నారు. అలాగే వచ్చే రోజుల్లో బుల్స్, బేర్స్ మధ్య భీకరపోరు కొనసాగుతుందని, మార్కెట్ అధిక స్థాయిలో ఒత్తిడి ఎదుర్కోనే అవకాశం ఉందని గాంధీ అంటున్నారు. స్టాక్-నిర్దేశిత యాక్షన్ ట్రేడింగ్‌తో మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోందని అంటున్నారు. డౌన్ సైడ్‌లో, నిఫ్టీ 8800 స్థాయిని కోల్పోతే అమ్మకాలు మరింత తీవ్రతరం కావచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నిఫ్టీ ఇండెక్స్ 8600 స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు. ఇక అప్‌సైడ్ ట్రెండ్‌లో... నిప్టీకి 9300 వద్ద కీలకమైన మద్దతు స్థాయి ఉంది. ఈ స్థాయిలో కాల్ రైటర్స్ ఇక్కడ షార్ట్ కవరింగ్ చూడవచ్చని గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో షితిజ్ గాంధీ సిమెంట్ షేర్లపై తన సమగ్ర విశ్లేషణలను వివరించారు. షేరు పేరు: ఏసీసీ సిమెంట్స్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.1,425 స్టాప్ లాస్: రూ.1150 అప్ సైడ్: 12శాతం విశ్లేషణ: రూ.950ల నుంచి వీ-ఆకారపు రివకరీ తరువాత, స్టాక్ మంగళవారం డైలీ ఛార్ట్‌లో 100 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అధిగమించగలిగింది. షేరు గత నాలుగు వారాల నుంచి రూ.1100- రూ.1250ల స్థాయిలో కన్సాలిడ్ అయ్యింది. ఈ వారంలో స్టాక్ సుధీర్ఘ కన్సాలిడేషన్ తర్వాత నిర్వచించిన పరిధి కంటే కొత్త బ్రేక్ అవుట్‌ను చూసింది. పెరుగుతున్న ధరలతో పాటు పెరుగుతున్న వాల్యూమ్‌లు స్టాక్ అప్‌ట్రెండ్ ర్యాలీని సూచిస్తున్నాయి. కావున ట్రేడర్లు రూ.1150 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.1,425 టార్గెట్ ధరగా పెట్టుకొని రూ.1250-1260 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. షేరు పేరు: శ్రీ సిమెంట్ రేటింగ్: కొనవచ్చు టార్గెట్ ధర: రూ.23600 స్టాప్ లాస్: రూ.18500 అప్ సైడ్: 15శాతం విశ్లేషణ: రూ.18,000-20,000 స్థాయిలో ఐదు వారాల పాటు సుధీర్ఘ కన్సాలిడేషన్ తరువాత, డైలీ ఛార్ట్‌లో నిర్వచించిన పరిధి కంటే సరికొత్త బ్రేక్అవుట్ ఇచ్చింది. అలాగే డైలీ చార్టులలో దాని 200 రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ను అధిగమించగలిగింది. ఇక టెక్నికల్‌గా పరిశీలిస్తే.., దీర్ఘచతురస్ర ప్యాట్రన్పైన బ్రేక్ అవుట్‌ను చూడవచ్చు. ఇది సాధారణంగా కొనసాగింపు ప్యాట్రన్‌గా ట్రేడ్ చేయబడుతుంది. కావున ట్రేడర్లు రూ.18,500 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.23,600 టార్గెట్ ధరగా పెట్టుకొని రూ.20,500-20,650 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. -
ఈ 2 ఫైనాన్స్ షేర్లకు మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ రేటింగ్
ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ పైనాన్షియల్ షేర్లపై ‘‘బుల్లిష్’’ వైఖరిని కలిగి ఉంది. ముఖ్యంగా ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. ఈ రెండు షేర్లపై బ్రోకరేజ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా సమగ్ర నివేదికను ఇప్పుడు పరిశీలిద్దాం... ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో ఫైనాన్స్ రంగ షేర్లు ప్రదర్శన అంత బాగాలేదు. ఇటీవల స్థూల ఆర్థికవ్యవస్థలో ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనలు ఫైనాన్స్ రంగంలో అధిక స్లిపేజ్‌లు, రుణ వ్యయాలకు దారితీశాయి. ఇంతకు ముందు కార్పోరేట్ ఎన్పీఏలు పెరగడం.. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఫైనాన్స్ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటుంది. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలు ఎన్బీఎఫ్సీలు, మధ్య స్థాయి బ్యాంకులకు అధిక ఎక్స్పోజర్ను కలిగి ఉంటాయని సిద్ధార్థ నివేదికలో పేర్కోన్నారు. ధీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నప్పుడు మధ్య స్థాయి బ్యాంకులు, ఎన్బీఎబీఎఫ్సీలతో పోలిస్తే ఈ రంగంలో పెద్ద బ్యాంకులుగా పేరొందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మరింత బలపడే అవకాశం ఉంది. అలాగే ఈ రెండు బ్యాంకులపై ఎక్స్పోజర్ల ఒత్తిడి స్వల్ప కాలానికే పరిమితమయ్యే ఆస్కారం ఉంది. ఒకటి లేదా రెండు క్వార్టర్లో మాత్రమే షేర్లపై ఎక్స్పోజర్ల ఒత్తిడి ఉండవచ్చు. అలాగే ఆస్తి నాణ్యత, అధిక స్లిప్పేజీలు మాత్రమే కాకుండా ప్రస్తుత వాతావరణంలో మనుగడ కోసం అదనపు మూలధనాన్ని సమీకరించుకోగలవు. కాబట్టి మేము ఈ రంగంలో ప్రధాన షేర్లైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, లేదా ఐసీఐసీఐ బ్యాంక్‌లను కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు సలహానిస్తున్నామని సిద్ధార్థ తెలిపారు. -
‘ఉత్తమ’ సిఫారసులు!
సాక్షి సిటీ బ్యూరో, రంగారెడ్డి జిల్లా: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బుధవారం రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్ జిల్లాలో 60 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదలైంది. రంగారెడ్డి జిల్లాలో 51 మందిని ఎంపిక చేశారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. హైదరాబాద్ జిల్లా విషయా నికొస్తే....గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఆలస్యమైంది. అంతేకాదు ఉపాధ్యాయుల ఎంపికపై తుది జాబితా వెల్లడికి ముందే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ జిల్లా విద్యాశాఖ ఇవేవీ పట్టించుకోకుండా పనితీరును కాకుండా పైరవీకారులకు, అనర్హులకు జాబితాలో చోటు కల్పించినట్టు తెలిసింది. ఒకే పాఠశాల నుంచి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేయడం, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకు పెద్దపీఠ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుడంతో విద్యాశాఖ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. దీనిపై హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ ఆరా తీశారు. అసలు ఎంపిక విధానం ఎలా ఉంది ? ఏఏ నిబంధనలు పరిగణనలోకి తీసుకున్నారు? దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? ఎలా ఎంపిక చేశారంటూ వివరాలు అడిగారు. దీంతో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్టు సమాచారం. ఫలితంగా బుధవారం రాత్రి 60 పేర్లతో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలో... ఉత్తమ టీచర్లను ఎంపిక చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్.. జిల్లా విద్యాశాఖను ఆదేశించింది. పది అంశాల ప్రామాణికంగా ఉత్తములుగా గుర్తించాలని సూచించింది. విద్యార్థుల నమోదులో అసాధారణ చొరవ, డ్రాప్ అవుట్లను నివారించడం, అనుభవం, పదో తరగతిలో వందశాతం విద్యార్థుల ఉత్తీర్ణత, ఆయా పోటీల్లో విద్యార్థులకు దక్కిన అవార్డుల్లో వారి పాత్ర, ఆవిష్కరణల అమలు, వందశాతం ఆధార్ సీడింగ్, బడుల్లో మౌలిక వసతుల కల్పనకు జరిపిన కృషి, హరితహారంలో ప్రగతి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొంది. ఉత్తముల ఎంపిక బాధ్యతను ఎంఈఓలకు అప్పగించింది. మండలంలోని స్కూళ్ల సంఖ్యను బట్టి ముగ్గురు నుంచి ఐదుగురు పేర్లను ఎంఈఓలు విద్యాశాఖకు ప్రతిపాదించారు. ఏయే అంశాల ఆధారంగా ప్రతిపాదించారో తెలిపే డాక్యుమెంట్లను అందజేశారు. జిల్లావ్యాప్తంగా 93 మంది పేర్లతో కూడిన జాబితా జిల్లా విద్యాశాఖకు గత నెలలో చేరింది. కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి 51 మంది టీచర్ల పేర్లను ఫైనల్ చేసింది. నిర్దేశిత ప్రామాణికాల పరంగా చూపిన చొరవ, కనబర్చిన ప్రతిభను బట్టి టీచర్లకు మార్కులు వేశారు. కేటగిరీ, సబ్జెక్ వారీగా ఎక్కువ మార్కులు పొందిన జాబితాలో ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఉత్తములుగా పరిగణించారు. ఈ జాబితాకు గతనెల 28న కలెక్టర్ ఆమోదం తెలిపారు. సంఘాల ఆరోపణలు ఇవీ.. అవార్డులు దక్కించుకోవడానికి ఆయా ఉపాధ్యాయ సంఘాల్లో పోటీ నెలకొంది. విద్యా శాఖ రూపొందించిన జాబితా తప్పుల తడకగా ఉందని, అనర్హులకు చోటు కల్పించారని పలు సంఘాల సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికితోడు తమ సంఘానికి చెందిన టీచర్లకు స్థానం కల్పించలేదని, ఫలానా సంఘం వాళ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వారి వాదన. వారి లాగే తమ సం ఘం సభ్యులకు అవార్డులు ఇవ్వాలని కొం దరు నేతలు జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసినట్లు తెలిసింది. పది నుంచి 20 మంది టీచర్ల జాబితాలను చైర్‌పర్సన్‌కు అందజేసి వారికి అవార్డులు దక్కేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఉత్తముల జాబితా పెంపు? కలెక్టర్ ఆమోదించిన 51 పేర్లు కాకుండా.. ఉత్తముల జాబితాలో మరికొందరి టీచర్ల పేర్లను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫారసుతో ఇది సాధ్యపడే వీలుంది. గతంలో ఈ తరహా ఘటనలు చాలా జరగడం.. అందుకు బలాన్ని చేకూర్చుతోంది. గతేడాది విద్యాశాఖ 53 మంది టీచర్ల పేర్లను ఖరారు చేయగా.. ఉపాధ్యాయ సంఘాల పైరవీలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తెల్లవారేలోగా ఈ జాబితా 90కు చేరుకోవడం గమనార్హం. అప్పటికప్పుడే జాబితా పెరగడంతో.. కొందరు టీచర్లకు సర్టిఫికెట్లు సరిపోలేదు. శాలువాలతో సన్మానించి సరిపుచ్చాల్సి వచ్చింది. అంతేగా సస్పెన్షన్ అయిన టీచర్‌కూ అవార్డు ప్రదానం చేయాలని ఓ సంఘం సభ్యులు విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. మేడ్చల్ ఉత్తమఉపాధ్యాయులు వీరే...:నేడు కీసర లలితా ఫంక్షన్ హాలులో సన్మానం సాక్షి, మేడ్చల్‌జిల్లా: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు గురువారం కీసర మండల కేంద్రంలోని లలితా ఫంక్షన్ హాలులో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు డీఈఓ విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా వీరే.. శామీర్‌పేట్ : గురుచారి, పి.రాజు, వై.మోహన్‌రాజ్, బి.సత్యనారాయణమూర్తి, ఎం.నర్సింగరావు, ఎస్.వెంకటరమణ, కె.సంగీత, ఆర్.వాణి 8 కుత్బుల్లాపూర్: ఏవీ సుబ్బారావు , వి.కరుణ, బి.ఆంజనేయులు ఘట్కేసర్: ఏ.శాంతకుమారి, బి.దేవయాని, ఎం.యమున కూకట్పల్లి: పి.నర్సింహులు, ఆర్.సంధ్యారాణి, బి.మీనా రాజకుమారి, ఇ.గాలయ్య ఉప్పల్: వై.సంపత్‌కుమార్, ఎన్.ప్రమీల, పి.మంజులాదేవి, జె.పాండురంగవిఠల్, డి.విజయశ్రీ, జె.సువర్ణ, కె.అరుణజ్యోతి, ఎం.విజయలక్ష్మి, ఎం.వేణుగోపాల్‌రెడ్డి అల్వాల్: జి.హన్మిరెడ్డి, జి.లక్ష్మయ్య, డాక్టరు రితిభాషిణి, జి.సుప్రియ, వి.భారతి, కాప్రా: బి.బ్రహ్మానందం, బి.గోపాల్, ఎం.శ్రీశైలంరెడ్డి, డి.భగవంత మేడ్చల్: చేపూరి సుజాత, జి.పుష్పలత, టి.రమాదేవి, ఎ.శ్రీనివాసులు, ఎస్.వెంకటరమణ; మల్కాజిగిరి: జీవీఆర్.రాజేశ్వరి, బి.విలియమ్స్, ఎం.నాగబాబు, వై.పెంచలయ్య మేడిపల్లి : ఎస్.చంద్రశేఖర్‌గౌడ్, శేసం రమాదేవి మూడు చింతలపల్లి: పి.రాధ . -
ప్రభ కోల్పోతున్న జెడ్పీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్‌లు (జెడ్పీలు) క్రమక్రమంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ప్రస్తుతం జెడ్పీలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇవి గత కాలపు వైభవానికి చిహ్నాలుగా మిగిలిపోయినా ఆశ్చర్యపోవడానికి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు 14వ ఆర్థికసంఘం సిఫార్సులు ప్రధాన కారణం కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులు తగ్గిపోవడం మరో కారణం. 2015 సంవత్సరం నుంచి 14వ ఆర్థికసంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక నేరుగా గ్రామపంచాయతీలకే అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నారు. దీంతో వివిధ పథకాల కింద జిల్లా, మండల పరిషత్‌ల ద్వారా విడుదలయ్యే నిధులు గణనీయంగా తగ్గిపోయాయి. 2014 మేలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జెడ్పీల సంఖ్య 9 ఉండగా, ఇప్పుడు కొత్తగా జిల్లాలు (తాజాగా ప్రకటించిన రెండు జిల్లాలు కలిపి), మండలాల పునర్విభజనతో జిల్లాల సంఖ్య 32కు పెరగబోతోంది. అక్కడ సాధ్యమేనా? ఈ ఏడాది జూలైతో పాత జిల్లాపరిషత్‌ల కాలపరిమితి ముగిశాక, కొత్త జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మేడ్చల్ జిల్లా పరిధిలో 5, వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో 7 మండలాలు, గ్రామీణ మండలాలు మరీ తక్కువ సంఖ్యలో ఉండటంతో ఆ జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల ఏర్పాటు సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాల్లోని మండలాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేస్తారా అన్న దానిపై స్పష్టత రాలేదు. 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానికసంస్థలకు అధికారాలను కట్టబెట్టడంలో భాగంగా సాధారణంగా జిల్లాగా ప్రకటించిన ప్రాంతాన్నే జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ)గా పరిగణించాల్సి ఉంటుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా మార్పులు,చేర్పులు చేపడుతుందా? లేక ఇప్పటికే ఏర్పాటు చేసిన 31 జిల్లాలతోపాటుగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాలతో కలసి మొత్తం 32 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాల పునర్విభజన ప్రకారమేనా? జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రకారమే కొత్త జిల్లా,మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటు అవుతాయని కొత్త పంచాయతీరాజ్ చట్టంలో కూడా స్పష్టం చేసినందున తదనుగుణంగానే కొత్త జిల్లాలు, మండలాలు ప్రత్యేక యూనిట్లుగా మారతాయి. 1974 తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం ప్రకారం కూడా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలు,కొత్త మండలాల ప్రాతిపదికన మండల ప్రజాపరిషత్‌లు ఏర్పడతాయి. గతంలో 438 మండలాల నుంచి పునర్విభజన తర్వాత మరో 96 గ్రామీణ మండలాల ఏర్పాటుతో ఈ సంఖ్య 534కు పెరగగా తాజాగా మరో 4 మండలాలను పెంచడంతో 538కు చేరనుంది. దీంతో జెడ్పీటీసీల సంఖ్య కూడా 538కు పెరగనుంది. -
ఎమ్మెల్యే సిఫార్సులుంటేనే పరికరాలిస్తాం!
సాక్షి, అమరావతి: వ్యవసాయ పరికరాలు కొనాలంటే ఎమ్మెల్యే సిఫార్సులు తప్పనిసరంటూ వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో తెగేసి చెబుతున్నారు. ఎమ్మెల్యే ఆఫీసు నుంచి చెప్పనిదే చిన్నపాటి పరికరాల కోసం దరఖాస్తు చేసినా తిరస్కరిస్తున్నారు. కనీసం దరఖాస్తులూ తీసుకోవడం లేదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకం కింద రైతులకు అవసరమైన పరికరాలను వారే కొనుగోలు చేసుకొనే విధానాన్ని ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దరఖాస్తుతో వెళ్తే ఎమ్మెల్యే సిఫార్సులుండాలని వ్యవసాయ అధికారులు చెబుతుండడంతో, సేద్యం పనులు మానుకొని అటు ఎమ్మెల్యే ఇళ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఏమిటీ డీబీటీ? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో రైతులకు అవసరమైన పరికరాలను వారే కొనుగోలు చేసుకోవచ్చు. పరికరాలు రాయితీపై తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి డీబీటీ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. రైతులు తమకు అవసరమైన యాంత్రిక పరికరం పొందడానికి వారే స్వయంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. బిల్లులను వ్యవసాయ శాఖకు అందచేస్తే రాయితీతో కలిపి మొత్తం నగదును రాష్ట్ర ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. ప్రస్తుత ఖరీఫ్‌కు దాదాపు రూ.400 కోట్లను కేటాయించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, రొటోవేటర్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, గ్రాస్ కట్టర్, డిస్క్‌ప్లవ్ వంటి పరికరాలను కొనుగోలు చేసేందుకు వ్యవసాయశాఖ అధికారుల ద్వారా దరఖాస్తు చేయాలి. సిఫార్సు తప్పనిసరి గ్రామాల్లో ఎంపీవో (మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అధికారి) నుంచి దరఖాస్తు తీసుకునేందుకు రైతులు వెళితే, ఎమ్మెల్యే ఆఫీసు నుంచి ఫోన్ చేయించుకోవాలని, లేకుంటే అక్కడి నుంచి సిఫార్సు లేఖ తీసుకురావాలని చెబుతున్నారు. పదిరోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ పరిస్థితిలో తమకు అవసరమైన చిన్నపాటి పరికరాలను రాయితీపై పొందడానికి రైతులు చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేలు పెద్ద అడ్డంకిగా మారారు. రూ.5 లక్షల రాయితీ లభించే వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, రొటోవేటర్లు వంటి పరికరాలకు గతంలో ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు ఇచ్చేవారని, ఇప్పుడు రూ.5 వేల నుంచి రూ.10 వేల రాయితీ లభించే చిన్నపాటి పరికరం పొందడానికీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు కావాలని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కావాలనే చేస్తున్నారు.. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. కొందరు రైతులు దరఖాస్తులు పూర్తి చేసుకునే విధానం తెలియక ఎమ్మెల్యేల కార్యాలయాలకు వెళ్తున్నారని, అక్కడి సిబ్బందితో దరఖాస్తులు పూర్తి చేయించుకుని తమకు ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమకు తెలియకుండా నియోజకవర్గాల్లో ఏమీ జరగకూడదని, ప్రతీ దరఖాస్తును తాము చూడనిదే, సిఫార్సు చేయనిదే ఇవ్వవద్దని ఎమ్మెల్యేలు చెబుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే పనిచేయలేమనే భావనతో రైతులను ఎమ్మెల్యేల కార్యాలయాలకు పంపుతున్నామని అధికారులు చెబుతున్నారు. -
సంచలనం.. బెట్టింగ్‌లకు అనుమతించండి
క్రికెట్ వంటి జెంటిల్మెన్ గేమ్‌లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్(21వ) సంచలన సిఫార్సులు చేసింది. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొంది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది. ఎలాగంటే... ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో పన్ను పరిధిలోకి వచ్చేలా ఈ బెట్టింగ్ లు ఉండాలి. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం దేశానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎవరైనా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ లో పాల్గొనాలంటే, అతని లావాదేవీలకు ఆధార్ కార్డు, పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాలి. డబ్బుతో కాకుండా బ్యాంకు లావాదేవీల ద్వారా ఇది జరగాలి’ అని కమిషన్ సిఫార్సుల్లో పేర్కొంది. వీటితోపాటు క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ తన రిపోర్టులో సిఫార్సు చేసింది. 'లీగల్ ఫ్రేమ్ వర్క్ గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్ బెట్టింగ్ ఇన్ క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా' పేరిట తయారు చేసిన నివేదికను కమిషన్.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని సమాచారం. దీనిపై పార్లమెంట్ లో త్వరలో చర్చ జరగనుంది. అయితే ఈ సిఫార్సులు అమలులోకి రావాలంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 252 కింద రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
‘జన్మభూమి’ పాపం.. కార్యదర్శులకు శాపం
దెందులూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో మృతులకు పింఛన్లు ఇస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని కొందరు మృతులకు పింఛన్ మంజూరు చేయడంతో పాటు పంపిణీ చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారు. రూ.1.79 లక్షలు అవకతవకలు జరిగినట్టు సోషల్ ఆడిట్లో అధికారులు గుర్తించారు. పెదవేగి మండలంలో రూ.1.15 లక్షలు, దెందులూరు మండలంలో రూ.39 వేలు, ఏలూరు మండలంలో రూ.22 వేలు, పెదపాడు మండలంలో రూ.3 వేలు దుర్వినియోగమైనట్టు నిర్దారించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, పింఛన్లు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే గుడ్డిగా అందిస్తుండటంతో ముగ్గురు కార్యదర్శులు బలయ్యారు. దెందులూరు మండలంలోని దోసపాడు, కేఎన్ పురం, గాలాయిగూడెం గ్రామ కార్యదర్శులు శరత్, ప్రసాద్, అవినాష్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పల్లచింతలపూడి గ్రామ కార్యదర్శిపై చర్యలకు పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదించారు. పై నాలుగు మండలాల్లో జన్మభూమి కమిటీ సభ్యుల సమక్షంలో నిధులు దుర్వి నియోగం జరిగినా దెందులూరు మండలంలో ముగ్గురిపై మాత్రమే వేటు వేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఒత్తిడి మేరకే గ్రామ కార్యదర్శులు మృ తులకు పింఛన్లు మంజూరు చేశారనే విమర్శలూ ఉన్నా యి. ఏలూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో నిధులు దుర్వినియోగానికి కారకులైన గ్రామ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లపై చర్యలకు అధికారులు ఆదేశించినట్టు తెలిసిం ది. దుర్వినియోగమైన మొత్తంలో 90 శాతం నగదును రాబట్టి ట్రెజరీకి జమచేశామని ఎంపీడీఓలు చెబుతున్నారు. ప్రతి పైసా రికవరీ చేస్తాం గ్రామ పంచాయతీల్లో మృతులకు పెన్షన్ సొమ్ము మంజూరు చేసి దుర్వినియోగం చేసిన వ్యవహారంలో ప్రతిపైసా ప్రభుత్వ ఖాతాకు జమయ్యేలా రికవరీ చేస్తాం. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వపరంగా త్వరలోనే చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ, ఏలూరు చర్యలు ప్రారంభించాం దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో మృతులకు పెన్షన్లు మంజూరు చేసి నిధులు దుర్వినియోగం చేశారని సోషల్ ఆడిట్ అధికారులు ధ్రువీకరించారు. దెందులూరు మండలంలో ఇప్పటికే ముగ్గురు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఓ కార్యదర్శికి పెనాల్టీ విధించి చర్యల నిమిత్తం పంచాయతీరాజ్ కమిషనర్‌కు సమాచారం అందించాం. మిగతా మూడు మండలాల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి -
ఫేస్బుక్ నయా టూల్.. ఇక యూజర్లకు ఈజీ!
న్యూయార్క్: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో తాజాగా ప్రవేశపెట్టిన టూల్ ఒకటి యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రికమండేషన్స్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ టూల్ ద్వారా స్నేహితుల సలహాలు కోరడం, సలహాలు పొందడం ఇక సులభం అవుతుందని వెల్లడించారు. ఈ రికమండేషన్స్ టూల్ సేవలను పొందడానికి యాజర్ల అకౌంట్ సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. స్థానిక ప్రదేశాలు, సేవలకు సంబంధించి ఫేస్బుక్ పోస్ట్‌లో సలహా కోసం ప్రయత్నించినప్పుడు.. అది రికమండేషన్ పోస్ట్‌గా మారిపోతుంది. మీ పోస్ట్ దిగువన మిత్రుల సలహాలు, సూచనలు కనిపిస్తాయి. కావాలనుకుంటే రికమండేషన్స్ బుక్‌మార్క్‌లోకి వెళ్లి ఫ్రెండ్స్ సలహాలను కోరే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే. -
సీఎం శుభవార్త అందించారు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. దాదాపు 21 లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సులను ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది.. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు. డిసెంబర్ 21 నుంచి నిర్వహించే రాష్ట్ర అసెంబ్లీ రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఐఏఎస్ అధికారి జీబీ పట్నాయక్ ఆధ్వర్యంలోని కమిటీ తన సిఫార్సులను గత వారం సీఎం కుఅందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా వేతనాలు అందించేలా సిఫారసు చేసింది. దీని ప్రకారం సుమారు 2.57 రెట్లు(జీతం, గ్రేడ్ పే)జీతాలు పెరగనున్నాయి. నాల్గవ తరగతి వేతన జీవులకు కనీసం జీతం రూ. 18000 గా ,గరిష్ట వేతనం రూ.2.25లక్షలుగా ఉండనుంది. 2017 నుంచి జనవరి నుంచి వీటిని అమలు చేయనున్నట్టు ఆ అధికారి ప్రకటించారు. రానున్న కీలక ఎన్నికల నేపథ్యంలో సీఎం అఖిలేశ్ ఉద్యోగులను ఈ వరాలను ప్రకటించిన ట్టుతెలుస్తోంది. -
కార్డు చెల్లింపులపై జీరో చార్జీలు
• ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫారసులు • లావాదేవీల చార్జీలను శాఖలే భరించాలి • స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు పేదలకు రూ.1000 సబ్సిడీ ఇవ్వాలి • పాలు, రేషన్ దుకాణాల్లో మొబైల్ పేమెంట్లను ప్రోత్సహించాలి సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌లైన్స్ సంస్థలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రైవేటు వ్యాపార సంస్థల తరహాలోనే డెబిట్/క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించిన చార్జీలను ప్రభుత్వ శాఖలే భరించాలని సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ చందా నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోమ, మంగళవారాల్లో సమావేశాలు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి పలు కీలక సిఫారసులు చేసింది. కార్డుల ద్వారా జరిపే చెల్లింపులపై జీహెచ్ఎంసీ, డిస్కంలు, జల మండలి సంస్థలు పౌరుల నుంచి 0.80 నుంచి 0.90 శాతం వరకు ట్రాన్సాక్షన్ చార్జీలను వసూలు చేస్తున్నారుు. అరుుతే నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు కార్డు లావాదేవీలకు సంబంధించిన చార్జీల భారాన్ని తప్పించాలని టాస్క్‌ఫోర్స్ సూచించింది. అలాగే ప్రభుత్వ శాఖలపై లావాదేవీల చార్జీల భారం ఉండని నెట్ బ్యాంకింగ్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు పౌరులకు రారుుతీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. నగదు రహిత లావాదేవీల అమలుపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రజల నుంచి సలహాలు సూచలను ఆహ్వానించింది. వాటిని డిసెంబర్ 10లోగా ఛ్చిటజ్ఛిటట.టఠట్ఛటజిఃజఝ్చజీ.ఛిౌఝకు పంపాలని కోరింది. ఇతర ముఖ్య ప్రతిపాదనలు ఇవీ.. ⇔ ప్రభుత్వానికి ఆదాయార్జన తెచ్చి పెట్టే శాఖల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలి. రెవెన్యూ, ఎకై ్సజ్ శాఖల తరహాలో జరిగే భారీ లావాదేవీలు నెట్‌బ్యాంకింగ్/ఎన్ఈఎఫ్టీ/ఆర్టీజీఎస్ల ద్వారా జరిగేలా చూడాలి వినియోగదారుల నుంచి కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించేందుకు వ్యాట్ డీలర్లందరికీ స్వైపింగ్ యంత్రాలను అందించాలి రూ.20వేలకు మించిన లావాదేవీలన్నీ నగదు రహితంగానే జరగాలి ⇔ మార్కెట్‌యార్డులు, సహకార సొసైటీలు రైతుల ఖాతాలకు ఆన్లైన్ చెల్లింపులు జరపాలి నగదు రహిత చెల్లింపులపై సహకార సొసైటీలు రైతులకు సరుకులు విక్రరుుంచాలి అన్ని రేషన్ దుకాణదారులు, పాల సమాఖ్యలోని పాల విక్రయదారులు, ఇతరులు తమ వినియోగదారులకు బడ్డీ/పాకెట్స్/పేటీఎం తదితర యాప్‌ల సాయంతో మొబైల్ పేమెంట్లు జరిపేందుకు అవకాశం కల్పించాలి పాల వ్యాపారులు, రేషన్ డీలర్ల నుంచి చెల్లింపులను నెట్ బ్యాంకింగ్/ఎన్ఈఎఫ్టీ/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పాల సమాఖ్యలు, పౌర సరఫరాల సంస్థ స్వీకరించాలి రైతు బజార్లలో మొబైల్ పేమెంట్లు లేదా కూపన్లతో చెల్లింపులు జరిపే వ్యవస్థను తేవాలి ఎల్పీజీ బుకింగ్ కోసం ఆన్లైన్లోనే చెల్లింపులు స్వీకరించాలి ⇔ కూరగాయలు, కిరాణ వస్తువుల వంటి తక్కువ ధర లావాదేవీల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేక పారుుంట్ ఆఫ్ సేల్(పీఓఎస్) యంత్రాలు, యాప్‌లను ప్రవేశపెట్టాలి నగదు రహిత చెల్లింపులపై పురోగతిని సమీక్షించేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్య ప్రభుత్వ శాఖలు, బ్యాంకు అధికారులతో రాష్ట్ర, జిల్లా స్థారుుల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి ⇔ ప్రతి మండలంలో బ్యాంకు అధికారులు, బ్యాంకు మిత్రలతో నగదు రహిత సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయాలి ⇔ పేద కుటుంబాలు ఆన్లైన్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు 25 శాతం సబ్సిడీని రూ.1000కు మించకుండా ప్రభుత్వం చెల్లించాలి ఆన్లైన్ లావాదేవీలకు అవసరమైనంత మేరకు ప్రజల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం లేదు. ప్రచార కార్యక్రమాల ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించాలి ప్రభుత్వ యంత్రాంగం, బ్యాంకు అధికారులు నగదు రహిత, కార్డు, ఆన్లైన్, మొబైల్ పేమెంట్ల ఉపయోగాలను ప్రజలకు తెలియజేయాలి జిల్లాల్లో పౌరుల విజ్ఞప్తులను పరిష్కరించేందుకు జిల్లా స్థారుులో హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలి -
ముస్లింలు, ఎస్టీలను ఆదుకోవాలి
తమ నివేదికల్లో చెల్లప్ప, సుధీర్ కమిషన్ల సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముస్లింలలోని పేద వర్గాలు, షెడ్యూల్డ్ తెగల పరిస్థితి దారుణంగా ఉందని.. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెల్లప్ప, సుధీర్ కమిషన్లను తమ నివేదికల్లో సూచించినట్లు సమాచారం. ఆయా వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు రిజర్వేషన్ల పెంపుతోపాటు విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారిలో సొంతంగా వ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీలు అందజేయాలని కమిషన్లు ప్రతిపాదించాయి. రాష్ట్రంలో ఎస్టీలకు 6 శాతం, ముస్లింలకు 4 శాతం (బీసీ ఈ కేటగిరీలో) రిజర్వేషన్లు కొనసాగుతుండగా.. వాటిని 12 శాతానికి చొప్పున పెంచుతామని టీఆర్ఎస్ తమ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక... ఆయా వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితిని చూపేందుకు, వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు గణాంకాలు, సమాచారం అవసరమైంది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినా.. దాని ద్వారా సేకరించిన సమాచారాన్ని రిజర్వేషన్ల పెంపునకు పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయమైన చిక్కులు ఎదురవుతాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ వర్గాలపై అధ్యయనం చేసేందుకు ఎస్టీ, మైనారిటీ కమిషన్లను ఏర్పాటు చేసింది. కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను కలిపితే.. రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతం, వారి పరిస్థితులతోపాటు కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలను ఎస్టీల్లో కలిపితే పరిస్థితి ఏమిటనే అంశంపై చెల్లప్ప కమిషన్ పరిశీలన జరిపింది. ఈ వర్గాలను ఎస్టీల్లో కలిపితే పెరిగే జనాభాకు అనుగుణంగా ఎస్టీల రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలన్నది ప్రభుత్వ యోచన. దీంతో జిల్లాల్లో కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలు నివసించే ప్రాంతాలతో పాటు, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు కమిషన్ ప్రయత్నించింది. జిల్లాల్లో ఈ రెండింటిని ఎస్టీల్లో కలపాలన్న ప్రతిపాదనను వివిధ ఎస్టీ సంఘాలు, నాయకులు వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా ఆయా తెగలు ఏయే జాబితాల్లో ఉన్నాయన్న అంశాన్ని కమిషన్ పరిశీలించింది. ఇతర ఎస్టీ తెగలతో పోల్చితే.. ఈ కులాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, సాంస్కృతికంగా, సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై అధ్యయనం చేసింది. కాయతీ లంబాడాలు, వాల్మీకి బోయలకు సంబంధించి చారిత్రక ఆధారాలు, కచ్చితమైన సమాచారం, గణాంకాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కొంత సమస్యగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్టీలను విద్య, ఉపాధి, ఆర్థికపరంగా ఆదుకోవాలని కమిషన్ తన నివేదికలో సూచించింది. ఎస్టీల జనాభాకు అనుగుణంగా 9 % వరకు రిజర్వేషన్లను కల్పించవచ్చునని ప్రతిపాదించింది. ముస్లింల స్థితిగతులు ఘోరం రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులు దారుణంగా ఉన్నాయని సుధీర్ కమిషన్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 9 వేల మంది నుంచి 46 అంశాలపై శాంపిల్ సర్వే ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని కమిషన్ సేకరించింది. ఈ నేపథ్యంలో మిగతా వర్గాలతో పోలిస్తే ముస్లింలలో వెనుకబాటు ఎక్కువగా ఉందనే అంచనాకు కమిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. పేద ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వివిధ చర్యలు చేపట్టాల్సి ఉందని నివేదికలో సూచించినట్లు సమాచారం. ముస్లిం పిల్లలకు అన్ని స్థాయిల్లో గురుకుల విద్యను అందించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ముస్లింలలో బాగా వెనుకబడిన వర్గాలకు బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని, సబ్సిడీ అందించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. చదువుకున్న వారికి ఉద్యోగాలు లభించే ఏర్పాటు చేయాలని.. బలహీనవర్గాల గృహాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
నిబంధనలా.. తూచ్!
అధికారం ఉంది కదా... తాము సిఫార్సు చేస్తే ఏమైనా జరిగిపోవాలనుకుంటున్నారు పాలకపక్ష నేతలు. పారదర్శకతకోసం తమ ప్రభుత్వంలోనే నిబంధనలు నిర్దేశించినా... అవన్నీ తూచ్ అంటున్నారు. తాము చెప్పినవారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వీరి ఒత్తిడి చూసి అధికారులే తల్లడిల్లిపోతున్నారు. ఇదేం పద్ధతని ఛీదరించుకుంటున్నారు. అయినా అవేమీ పట్టని నేతలు మాత్రం తమ పట్టు వీడటంలేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : మొన్నటి వరకు ఏ నియామకాలకైనా ఇంటర్వ్యూలు జరిగేవి. ఇంటర్వ్యూ చేసేది అధికారులే అయినా... నేతల సిఫార్సుల మేరకే ఫలితాలు ఉండేవి. అంగన్వాడీ, విద్యుత్ సబ్‌స్టేషన్ షిప్ట్ ఆపరేటర్ల పోస్టుల నియామకాలు దాదాపు ఇదే రీతిలో జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గతంలో మాదిరిగా ఇంటర్వ్యూలు లేవు. మార్కులు, విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఆన్లైన్లో నియామకాలు జరగాలి. కానీ పాలకపక్ష నేతలు అదేమీ పట్టించుకోవడం లేదు. అంగన్వాడీ, విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల మాదిరిగా మాకిన్ని ఇచ్చేయాలంటూ వైద్య ఆరోగ్యశాఖాధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే కొందరు జాబితాలిచ్చేసినట్టు తెలిసింది. అటు ఉన్నతాధికారుల సూచనలు.. ఇటు నేతల ఒత్తిళ్ల మధ్య అధికారులు నలిగిపోతున్నారు. వైద్యులు... ఏఎన్ఎం పోస్టులపై ఒత్తిడి రాష్ట్రీయ బాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య ఉద్యోగులను నియమిస్తున్నారు. వీరంతా మొబైల్ టీమ్‌లుగా ఏర్పడి, బాలల ఆరోగ్య రక్షణ కోసం వైద్య సేవలందిస్తారు. జిల్లాలో 36 వైద్యులు, 12 ఆయుష్ వైద్యులు, 24 ఫార్మాసిస్ట్లు, 24 ఏఎన్ఎమ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గత నియామకాల అవకతవకలు, ఆరోపణల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య అప్రమత్తమై సీరియస్‌గా తీసుకున్నారు. ఈ సారి ఇంటర్వ్యూలు ఉండవని, మార్కులు, విద్యార్హత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే భర్తీ చేయాలని, అంతా ఆన్లైన్లోనే జరగాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సిఫార్సుల జోరు నియామకాల విషయం తెలుసుకున్న నేతలు మార్గదర్శకాలను పట్టించుకోకుండా ఎప్పటిమాదిరిగానే సిఫార్సులు చేయడం ప్రారంభించారు. వైద్య పోస్టుల్ని మినహాయించి మిగతా ఏఎన్ఎం, ఫార్మాసిస్ట్ పోస్టులపై ప్రధానంగా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా ఆ పోస్టులను వేసుకున్నట్టుగా తమకిన్ని ఇవ్వాలంటూ ఏకంగా వైద్యాధికారులకు టార్గెట్ పెడుతున్నారు. ఒకరు ఎనిమిది, మరో నలుగురు ఐదేసి చొప్పున, ఇంకొకరు నాలుగు పోస్టులను తమ కోటా కింద ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడిది అధికారులకు ఇబ్బందికరంగా ఉంది. ఒకవైపు ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడేమో ఒక్కొక్కరు సిఫార్సులు చేస్తున్నారు. ఇప్పుడేం చేస్తారో చూడాలి. ఇదే విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అమె అందుబాటులో రాలేదు. రాష్ట్రీయ బాల స్వచ్ఛత కార్యక్రమం కో ఆర్డినేటర్ డాక్టర్ డి.సుబ్రహ్మణ్యం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమకేమీ లేఖలు, సిఫార్సులు రాలేదన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆన్లైన్లో మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయనున్నట్టు చెప్పారు. -
పన్ను వసూళ్లలో కఠిన వైఖరులు వద్దు
పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు న్యూఢిల్లీ: పన్నుల బకాయిలు రాబట్టడంలో బలవంతంగా, కఠినంగా ఉండే విధానాలను ప్రయోగించకుండా ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. వివాదాల పరిష్కారానికి ఇతరత్రా మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని పేర్కొంది. వ్యాపారాల నిర్వహణ సరళతరం చేసే అంశంపై రూపొందించిన నివేదికలో పార్లమెంటరీ స్థాయీ సంఘం (వాణిజ్య శాఖ) ఈ మేరకు పలు సూచనలు చేసింది. వొడాఫోన్, షెల్ వంటి బహుళజాతి కంపెనీలతో పన్ను వివాదాల్లో కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ప్రతికూలంగా తీర్పు రావడం తదితర అంశాలు అంతిమంగా పన్నుల విషయంలో భారత్‌కు చెడ్డ పేరు తెచ్చాయని కమిటీ పేర్కొంది. ఇక, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల క్యాపిటల్ గెయిన్స్‌పై కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు వివాదం ప్రతిష్టను మరింత మసకబార్చిందని తెలిపింది. ప్రస్తుత ట్యాక్సేషన్ విధానం అత్యంత సంక్లిష్టంగా ఉందని, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు విజయవంతం కావాలంటే... ఇది స్థిరంగా, అనూహ్య మార్పులకు లోను కాని విధంగా ఉండాలని కమిటీ సూచించింది. -
సిఫార్సు బదిలీలు!
- ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వాలిపోతున్న ఎంపీడీఓలు - నేడు ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరిగేనా..? అనంతపురం సెంట్రల్ : జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీల విషయంలో సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారు. గతంలో బదిలీలు జరిగిన ప్రతి సారీ ఈ విషయం బహిర్గతమైంది. తొలిరోజు అందరి సమక్షంలో బదిలీలు పారదర్శకంగా జరిగినా తెల్లారేసరికి అవి తారుమారు అవుతున్నాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎంపీడీఓలు, మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీల్లో మొత్తం ఇలాగే మారిపోయాయి. తొలుత కౌన్సెలింగ్ ద్వారా పారదర్శకంగా జరుపుతున్నామని ప్రకటించినా చివరకు మాత్రం అంతా తారుమారవుతున్నాయి. ఉద్యోగుల బదిలీల విషయంలో జిల్లా పరిషత్ చెర్మైన్ చమన్ నిర్ణయాలను అధికారపార్టీ ఎమ్మెల్యేలు తోసిపుచ్చుతున్నారు. తమ నియోజకవర్గంలోకి వచ్చే అధికారి తన ప్రమేయంతోనే రావాలని భావిస్తున్నారు. గతసారి బదిలీల్లో చెన్నేకొత్తపల్లి, కూడేరు, శింగనమల తదితర మండలాల ఎంపీడీఓలు ఆయా మండలాల్లో బాధ్యతలు చేపట్టకుండానే ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకున్నారు. ఈ సారి కూడా అదే పరిస్థితి పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు రోజుల నుంచే సిఫార్సు లేఖలతో జెడ్పీకి వాలిపోతున్నారు. పరిపాలన సౌలభ్యం ముసుగులో : పరిపాలన సౌలభ్యం దృష్ట్యా కాలపరిమితితో సంబంధం లేకుండా ఉద్యోగులను బదిలీ చేసుకోవచ్చని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నిర్ణయం రాజకీయ అండదండలు ఉన్న ఉద్యోగులకు వరంగా మారుతోంది. పరిపాలన సౌలభ్యం ముసుగులో అనుకున్న స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు కౌన్సెలింగ్‌లో ఇతర ప్రాతాలకు వెళ్లినా డెప్యుటేషన్ ముసుగులో తిరిగి యధాస్థానానికి రావచ్చులే అన్న ధీమా మరికొంతమందిలో కనిపిస్తోంది. దీని వలన కొన్నేళ్ల నుంచి మారుమూల ప్రాంతాల్లోనే తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి ఉద్యోగాలు చేస్తున్న వారికి తీవ్ర నష్టం కలుగుతోంది. తొలుత సాధారణ బదిలీలు పూర్తై తర్వాత నూతనంగా పదోన్నతులు పొందిన ఎంపీడీఓలకు పోస్టింగ్‌లు కల్పించాలని నిర్ణయించారు. అయితే అందులో ఉన్న కొంతమంది ముందే చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. చెర్మైన్ దగ్గర ఉన్న సంబంధాలతో మంచి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం జిల్లా పరిషత్ కార్యాలయం ఉద్యోగులతో కళకళలాడింది. దీంతో శుక్రవారం జరగనున్న జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయా.? కౌన్సెలింగ్‌లో దక్కించుకున్న ఉద్యోగులను ఆయా స్థానాల్లో కొనసాగిస్తారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పైరవీలకే పెద్దపీట
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విడుదల చేసిన మార్గదర్శకాలు విభిన్నంగా ఉండటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఒక చోట ఉన్న సీనియారిటీ, ఇతర అప్షన్లు వంటి ప్రమాణాల ఆధారంగా బదిలీలు జరిగేవి, ఈ సారి బదిలీల నిబంధనల్లో కమిటీలకు ప్రదాన్యమివ్వడంతో రాజకీయ జోక్యానికి పెద్దపీట వేసినట్టయింది. ఇప్పటికే జిల్లాలో మంత్రి ఒక సందర్భంలో మాట్లాడుతూ బదిలీల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యం ఉంటుందని, తమకు అనుకూలమైన వారినే నియమించుకోవాలని ఇదివరకే సూచించారు. దీనిని బట్టి బదిలీల్లో రాజకీయ పైరవీలు, సిఫార్సులు ఆధికంగా ఉంటాయని స్పష్టమౌతోంది. ఈసారి ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీరి బదిలీలు చేయలేదు. ఇక ఆడిట్, ఖజానా శాఖఉద్యోగులకు ఈ బదిలీల్లో మినహాయింపునిచ్చారు. వీరి శాఖల్లో ఎలక్ట్రానిక్ పేమెంటు విధానం, కంప్యూటరీకరణ, ఇతర సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తరువాత వారికి తలెత్తే అవకాశం లేకుండా ఉండేందుకే బదిలీల నుంచి మినహాయింపు నిచ్చినట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద ఖజానాశాఖ సిబ్బంది మూడేళ్లుగా బదిలీలకోసం ఎదురు చూస్తున్నారు. ఈ సారి బదిలీల ప్రక్రియపై ఉద్యోగ సంఘాల నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల పేరిట రాజకీయ ప్రమేయాన్ని పెంచుతున్నారని, పరిపాలనా సౌలభ్యం పేరిట ఇష్టంలేనివారిని, వారికి అనుకూలంగా లేనివారిని అక్రమంగా బదిలీలు చేసేందుకు ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని వారు విమర్శిస్తున్నారు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు ఈసారి బదిలీల్లో కీలకంగా రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు ఉంటాయి. ఈ శాఖలతో నాయకులకు, ప్రజలకు ఎక్కువగా పనులు ఉండడంతో ఈ శాఖల్లో బదిలీలకు ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే టీడీపీ కార్యకర్తల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు ప్రారంభించారు. ముఖ్యంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ, తహశీల్దార్ల బదిలీలకు గిరాకీ ఉంది. గత ఏడాది జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుల పీఏలు కీలక పాత్ర పోషించారు. యూనియన్ ఆఫీస్ బేరర్లను సైతం నిబంధనలకు విరుద్ధంగా బదిలీచేసి వారి పంతం నిలబెట్టుకున్నారు. అదే పరిస్థితి పంచాయతీ రాజ్ శాఖలో జరిగింది. అప్పట్లో మిగిలిపోయినవారికి ఈ సారి స్థాన చలనం తప్పేట్టు లేదు. అందుకోసం నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటినుంచే వారిచుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. -
మహారాష్ట్రలోరాష్ట్రపతి పాలనకు సిఫారసు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్టు సమాచారం. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ శుక్రవారం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య పొత్తు వికటించడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. -
సెంట్రల్ యూనివర్సిటీలకు ఉమ్మడి విధానాలు..
దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి, పర్యవేక్షణ ఇతర అంశాలపై.. యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ.ఎం. పఠాన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ గత ఏడాది అందించిన నివేదికను, అందులోని సిఫార్సులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని తాజాగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెంట్రల్ యూనివర్సిటీలను ఆదేశించింది. దీంతో దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీల పర్యవేక్షణకు ఒకే విధానం అమలు కానుంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 45 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి. కమిటీ చేసిన సిఫారసులు.. ప్రస్తుతం ఉన్న ఛాన్సలర్ విధానాన్ని రద్దు చేయాలి. కొత్తగా అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో కూడిన కౌన్సిల్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ను ఏర్పాటు చేయాలి. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ఎక్స్ అఫీషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరించాలి. ఈ కౌన్సిల్ అన్ని యూనివర్సిటీల పరిపాలన, విద్యా విధానాలు, అకడమిక్ క్యాలెండర్ వంటి అంశాలను పర్యవేక్షించాలి. వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి. వైస్ ఛాన్సలర్లు యూజీసీ చైర్మన్‌కు బాధ్యులుగా ఉండాలి. మూల్యాంకనంలో మార్పులు చేసి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్‌కు రూపకల్పన చేయాలి. అన్ని వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను కేంద్రీకృత విధానంలో భర్తీ చేయాలి. -
కోరినంత ఇస్తే కోరుకున్న చోటికి..
- పురపాలికల్లో బదిలీలకు రంగం సిద్ధం - సిఫారసులకు వెల పెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు! - అనుకూలుర కోసం చైర్మన్ల ప్రయత్నం సాక్షి, రాజమండ్రి : ప్రభుత్వం బదిలీల జాతరకు తెర లేపడంతో అటు ఉద్యోగుల్లోనే కాక రాజకీయ నేతల్లోనూ హడావిడి మొదలైంది. పురపాలికల్లో తమ వారిని నియమించుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వ్యక్తిగత సర్వేలు ప్రారంభించారు. అంతే కాక తమ వద్దకు బదిలీల సిఫారసు లేఖల కోసం వచ్చే వారికి ఓ రేటు నిర్ణయించి, వ్యక్తిగత సహాయకుల (పీఏ) సహకారంతో ఇంట్లోనే దుకాణాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా తమకు అనుకూలంగా ఉండగలరనుకున్న వారిని తమ పట్టణాలకు రప్పించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్లు తాపత్రయపడుతున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బదిలీలకు పురపాలక శాఖ శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక మున్సిపాలిటీలో మూడేళ్లు పని చేసిన వారు బదిలీకి అర్హులవుతారు. ఈ నెల 15లోగా అర్హులైన ఉద్యోగుల జాబితాలు తయారు చేసి బదిలీలు చేపడతారు. ఈ నెల 30లోగా బదిలీలు పూర్తవ్వాల్సి ఉంటుందని ముందు సూచించినా అక్టోబర్ 10 వరకూ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ ప్రకారం 11 నుంచి బదిలీలపై నిషేధం మళ్లీ అమలులోకి వస్తుంది. మున్సిపాలిటీల మినిస్టీరియల్ సిబ్బందికి అదేచోట విభాగం మారడం ప్రాతిపదికన కాక పట్టణం ప్రాతిపదికన బదిలీ ఉంటుంది. ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తారు. మున్సిపాలిటీల్లోని ఆరోగ్య విభాగం ఇతర విభాగాల ఉద్యోగులకు కూడా ప్రాంతాన్ని ప్రాతిపదికగానే బదిలీ అవుతుంది. మున్సిపాలిటీల వారీగా ఉద్యోగులు, వారి సీనియారిటీ జాబితాలను సోమవారం నుంచి తయారు చేసేందుకు కమిషనర్లు సిద్ధమవుతున్నారు. కోట్లు దండుకునే అవకాశం..! సాధారణంగా బదిలీలప్పుడు ఉద్యోగులు తమకు కావల్సిన ప్రాంతాలకు వెళ్లాలని ఆరాటపడుతూ, తమ ప్రాంత ఎమ్మెల్యేనో, మంత్రినో ఆశ్రయించడం పరిపాటి. ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులు కూడా ఈ రకంగా క్యూలు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అవకాశంగా జిల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు రేట్లు నిర్ణయించి, వాటి వివరాలను తమ పీఏల ద్వారా ఇప్పటికే ఉద్యోగులకు చేరవేసినట్టు తెలుస్తోంది. మినిస్టీరియల్ సిబ్బంది బదిలీ సిఫారసుకు రూ.మూడు లక్షల నుంచి రూ. ఐదు లక్షలు; క్లాస్-4 ఉద్యోగులకు కనీసం రూ. రెండు లక్షలు నిర్ణయించినట్టు సమాచారం. జిల్లాలో 2 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు అనుకూల బదిలీల కోసం తమ ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఇదే అదనుగా కోట్లు దండుకునేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఆరాటపడుతున్నారు. మా ప్రాంతానికి మావారే రావాలి కాగా పట్టణ ప్రణాళికా విభాగం వంటి కీలక విభాగాల్లో పని చేసే అధికారులు తమకు అనుకూలంగా పనిచేసే వారై ఉండాలని కోరుకుంటున్న మున్సిపల్ చైర్పర్సన్లు అందుకు ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సంబంధిత ఉన్నతాధికారులతో, మంత్రితో మంతనాలు జరుపుతున్నట్టు టీడీపీ వర్గాలే అంటున్నాయి. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడొంతుల మంది బదిలీలకు అర్హులవుతారని, ఈ నెల 15కల్లా దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. -
కేంద్ర పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకివ్వాలి
14వ ఆర్థిక సంఘాన్ని కోరనున్న ఏపీ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల్లో 50 శాతం రాష్ట్రాలకు బదలాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘాన్ని కోరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లో ఉంటాయి. కేంద్ర నుంచి నిధులు రావడంలో ఆర్థిక సంఘం చేసే సిఫారసులే కీలకపాత్ర పోషిస్తాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్థికసంఘం చర్చలు జరిపింది. రాష్ట్ర విభజన జరగడంతో ఆ చర్చలు నిష్ఫలమయ్యాయి. దీంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి, ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా సిఫారసులు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో ఏపీలో ఆర్థిక సంఘం పర్యటిస్తోంది. ముఖ్యమంత్రితో పాటు అన్ని శాఖల అధికారులతో సమావేశమై ప్రభుత్వం ఇచ్చిన మెమోరాండంలోని అంశాలపై ముఖాముఖి చర్చిస్తుంది. 13న విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటించి.. పారిశ్రామికవర్గాలు, రాజకీయ నేతల వినతిపత్రాలను కూడా స్వీకరిస్తుంది. వచ్చే నెలాఖరుకల్లా సిఫారసులతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. -
రెవెన్యూ శాఖలో పైరవీల జాతర
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా రెవెన్యూ శాఖలో పైరవీల జాతర జోరుగా సాగుతోంది. ఇటీవల కొత్త రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆశావహులంతా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ కార్యాలయాల్లో ఇప్పటివరకు ఆర్డీఓ పోస్టులు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. మిగిలిన కింది స్థాయి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో కొత్త కార్యాలయాల్లో కుర్చీ దక్కించుకునేందుకు కొందరు ఉద్యోగులు పావులు కదుపుతున్నారు. ఉన్నతస్థాయిలో మంత్రాంగం నెరిపి సీటు దక్కించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. తమ వాస్తవ పోస్టింగ్‌లను సైతం మార్పు చేసుకుని అనుకున్న స్థానంలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో పాలనాధికారి(ఏఓ)గా ఓ ఉద్యోగిని నియమించారు. అయితే వారం గడవక ముందే ఈ పోస్టులో మరో వ్యక్తిని నియమిస్తూ ఉత్తర్వులు తెచ్చుకోవడం తాజా పైరవీల పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కొత్తవారికి కొలువులు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రాజేంద్రనగర్, మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పాలనా సౌలభ్యం నిమిత్తం జిల్లా యంత్రాంగం కొందరు ఉద్యోగులను బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్ బి.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక్కో కార్యాలయానికి ఇద్దరేసి ఉప తహసీల్దార్లు బదిలీ అయ్యారు. అదేవిధంగా మరో ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఆయా కార్యాలయాల్లో కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. వీరితోపాటు మరో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ బదిలీ అయ్యారు. కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వడంతో వారంతా విధుల్లో చేరాల్సి ఉంది. మేం వెళ్లం..! కొత్త కార్యాలయాల్లో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ పలువురు ఉద్యోగులు గురువారం విధుల్లో చేరలేదు. ప్రస్తుతం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలోని సిబ్బంది రాజేంద్రనగర్ డివిజన్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే ఉద్యోగులను చేవెళ్ల కార్యాలయానికి బదిలీ చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఇందులో భాగంగా తమను రాజేంద్రనగర్ కార్యాలయానికి పరిమితం చేయాలంటూ ఉన్నతాధికారుల వద్ద పైరవీలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కలెక్టరేట్‌తోపాటు సీసీఎల్ఏ కార్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులను కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా పోస్టింగులు తీసుకున్న ఉద్యోగులు కొంత గందరగోళంలో పడ్డారు. మరోవైపు తమకిచ్చిన ఉత్తర్వుల ప్రకారం విధుల్లో చేరుతామని పేర్కొంటున్నారు.