ఫేస్‌బుక్ నయా టూల్.. ఇక యూజర్లకు ఈజీ!
న్యూయార్క్: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో తాజాగా ప్రవేశపెట్టిన టూల్ ఒకటి యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రికమండేషన్స్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ టూల్ ద్వారా స్నేహితుల సలహాలు కోరడం, సలహాలు పొందడం ఇక సులభం అవుతుందని వెల్లడించారు.
ఈ రికమండేషన్స్ టూల్ సేవలను పొందడానికి యాజర్ల అకౌంట్ సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. స్థానిక ప్రదేశాలు, సేవలకు సంబంధించి ఫేస్‌బుక్ పోస్ట్‌లో సలహా కోసం ప్రయత్నించినప్పుడు.. అది రికమండేషన్ పోస్ట్‌గా మారిపోతుంది. మీ పోస్ట్ దిగువన మిత్రుల సలహాలు, సూచనలు కనిపిస్తాయి. కావాలనుకుంటే రికమండేషన్స్ బుక్‌మార్క్‌లోకి వెళ్లి ఫ్రెండ్స్ సలహాలను కోరే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే.