new tool
-
‘మొహమాటం వద్దు.. ఏదైనా నన్ను అడిగేయ్!’
కృత్రిమ మేధస్సు.. మనిషి జీవితంలో అంతర్లీనంగా మారిపోవడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే అనేక రంగాల్లో ఇది మనిషి అవసరాలను తీరుస్తోంది. అతిత్వరలో ఆపద్భాందువు అవతారమెత్తబోతోంది. మైక్రోసాఫ్ట్వారి కొత్త ఫీచర్ కోపైలట్ విజన్ అందుకు ఒక ఉదాహరణ మాత్రమే!.కోపైలట్.. మైక్రోసాఫ్ట్ కంపెనీ రూపొందించిన జనరేటెడ్ ఏఐ చాట్‌బోట్. చాట్‌బోట్ రూపంలో యూజర్లకు సమాచారాన్ని చేరవేస్తుండడం తెలిసిందే. ఏఐ సాయంతో పనిభారాన్ని తగ్గించడంతో పాటు ఆ పనిని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. అంతేకాదు.. తక్కువ టైంలో నాణ్యమైన కంటెంట్‌ను అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దీనికి నెక్ట్స్ లెవల్‌గా కోపైలట్ విజన్ రాబోతోంది.👉ఎడ్జ్ బ్రౌజర్లో ఓ మూలన నీట్‌గా ‘కోపైలట్ విజన్’ ఏఐ ఫీచర్‌ను కనిపించనుంది. ఈ టూల్ సాయంతో ఇంటర్నెట్లో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి.. ఎలాంటి సాయమైనా కోరవచ్చు. ఉదాహరణకు.. మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎక్కడ బస చేయాలనే దానిపై మీకు కచ్చితమైన సమాచారం లేదు. ఆ గందరగోళంలో మీరు మీ డివైజ్‌లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కోపైలట్ విజన్‌ను సంప్రదించొచ్చు.👉మీకు ఎంత బడ్జెట్లో రూం కావాలి.. ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఇలాంటి వివరాలను చెబితే చాలూ!. కో పైలట్ విజన్ తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం జల్లెడ పడుతుంది. దానిని మీకు చెబుతూ పోతుంది. తద్వారా మీకు కావాల్సిన పక్కా సమాచారం చేరవేస్తుందన్నమాట. ఇది ఇక్కడితోనే ఆగిపోదు..👉రియల్ టైంలో వెబ్ కంటెంట్‌తో ఇంటెరాక్ట్ అయ్యేందుకు కూడా ఈ టూల్ ఉపయోగపడుతుంది. మీరు అడిగే ప్రశ్న రాతలు, ఫొటోలు, వీడియోల రూపకంలో కూడా ఉండొచ్చు. ఉదాహరణకు.. మీ స్మార్ట్ టీవీలోగానీ లేదంటే ల్యాప్ట్యాప్గానీ ఏదైనా సినిమా చూస్తుంటే అందులో నటీనటుల వివరాలను కూడా కోపైలట్ విజన్‌ను అడగొచ్చు. అప్పుడు అది తన దగ్గర ఉన్న సమాచారం సమీక్షించుకుని.. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంది.👉అలాగే సందర్భోచితంగా సాయం కూడా అందిస్తుంది. అంటే షాపింగ్ చేసే టైంలో మీకు కావాల్సిన వివరాల ఆధారంగా ప్రొడక్టును మీకు చెబుతూ చూపిస్తుంది. అంతెందుకు.. సెలవు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెబితే.. ఆరోజు మీ వెసులుబాటును బట్టి ఎలా ఎక్కడ, గడపొచ్చో కూడా మీకు సలహా ఇస్తుందది. అంటే.. బ్రౌజింగ్ చేసే టైంలో ఇది మరో జత కండ్ల మాదిరి పని చేస్తుందన్నమాట.👉ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌లో ఉంచి ఉపయోగించుకోవాలి. ప్రైవసీ విషయంలో గ్యారంటీ ఇస్తోంది మైక్రోసాఫ్ట్. ఒకసారి సెషన్ ముగిశాక.. మనం అడిగిన సమాచారం.. దానికి కోపైలట్ ఇచ్చిన వివరాలు ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను అమెరికాలో కోపైలట్ ల్యాబ్స్ ప్రోగ్రాం కింద కోపైలట్ సబ్స్క్రయిబర్స్కు అందజేస్తోంది. ఎడ్జ్బ్రౌజర్లో ఉన్న ఈ టూల్‌ను.. త్వరలో మిగతా విస్తరించే ఆలోచనలో మైక్రోసాఫ్ట్ ఉంది. అప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ ద్వారా లోటుపాట్లను సరిదిద్దుకుని మరింత మెరుగైన సేవలు అందిస్తుందట. ఎందెందు వెతికినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాడ కనిపిస్తున్న కాలంలో మైక్రోసాఫ్ట్ అడుగు గేమ్‌ఛేంజర్ అనే చెప్పొచ్చు. ఈ ప్రయత్నంతో.. మిగతా కంపెనీలు పోటీగా కోపైలట్ విజన్ తరహా జనరేటెడ్ ఏఐ సేవలను అందించే అవకాశం లేకపోలేదు. -
స్మార్ట్‌ఫోన్‌తో ఆక్సిజన్ లెవల్స్ ఇలా చెక్ చేసుకోండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ హెల్త్ స్టార్టప్ ఎంఫైన్.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవడానికి యాప్‌లో ఎంఫైన్ పల్స్ పేరుతో టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాక్ కెమెరా, ఫ్లాష్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ స్మార్ట్ఫోన్తోనైనా ఉపయోగించవచ్చని ఎంఫైన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అజిత్ నారాయణ్ వెల్లడించారు. శ్వాసకోశ లేదా తీవ్రమైన గుండెజబ్బులున్నవారు స్లీప్ అప్నియా, భారీ గురక, నవజాత శిశువుల్లో ఆక్సిజన్ సంతృప్త స్థాయిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సిఫార్సు చేస్తారు. అలాగే ప్రస్తుతం సమయంలో కరోనా వైరస్ రోగుల్లో కూడా ఆక్సిజన్ స్థాయిలను మానిటరింగ్‌లో ఈ ఆ క్సీమీటర్ పాత్ర చాలాకీలకం. ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఆన్‌డ్రాయిడ్ యూజర్లకు ఇది పరిమితం. త్వరలో ఐఓఎస్ వినియోగదారుల కోసం ప్రారంభించబడుతుంది. ఫైన్ పల్స్‌తో స్మార్ట్‌ఫోన్ కాస్తా ఆక్సీమీటర్గా మారిపోతుంది. ఇలా చెక్ చేసుకోండి: ► గూగుల్ ప్లేస్టోర్‌లో mfine యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ► మెజర్ యువర్ బ్లడ్ ఆక్సీజన్ లెవల్స్పైన క్లిక్ చేయండి. ► మెజర్ బటన్‌పైన క్లిక్ చేయండి. ► తర్వాత మీ చేతి వేలిని బ్యాక్ కెమెరాపై 20 సెకన్ల పాటు ఉంచండి ► అంతే రెండు సెకన్లలో మీ ఆక్సిజన్ లెవల్స్ డిస్ప్లే అవుతాయి. -
ఫేస్బుక్ నయా టూల్.. ఇక యూజర్లకు ఈజీ!
న్యూయార్క్: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో తాజాగా ప్రవేశపెట్టిన టూల్ ఒకటి యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రికమండేషన్స్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ టూల్ ద్వారా స్నేహితుల సలహాలు కోరడం, సలహాలు పొందడం ఇక సులభం అవుతుందని వెల్లడించారు. ఈ రికమండేషన్స్ టూల్ సేవలను పొందడానికి యాజర్ల అకౌంట్ సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. స్థానిక ప్రదేశాలు, సేవలకు సంబంధించి ఫేస్బుక్ పోస్ట్‌లో సలహా కోసం ప్రయత్నించినప్పుడు.. అది రికమండేషన్ పోస్ట్‌గా మారిపోతుంది. మీ పోస్ట్ దిగువన మిత్రుల సలహాలు, సూచనలు కనిపిస్తాయి. కావాలనుకుంటే రికమండేషన్స్ బుక్‌మార్క్‌లోకి వెళ్లి ఫ్రెండ్స్ సలహాలను కోరే అవకాశం ఉంది. అయితే ఈ సదుపాయం డెస్క్‌టాప్ యూజర్లకు మాత్రమే.