సీఎం శుభవార్త అందించారు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. దాదాపు 21 లక్షలకు పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. 7వ వేతన సంఘం సిఫార్సులను ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది..
మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఓ అధికారి చెప్పారు. డిసెంబర్ 21 నుంచి నిర్వహించే రాష్ట్ర అసెంబ్లీ రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ఐఏఎస్ అధికారి జీబీ పట్నాయక్ ఆధ్వర్యంలోని కమిటీ తన సిఫార్సులను గత వారం సీఎం కుఅందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమానంగా వేతనాలు అందించేలా సిఫారసు చేసింది. దీని ప్రకారం సుమారు 2.57 రెట్లు(జీతం, గ్రేడ్ పే)జీతాలు పెరగనున్నాయి. నాల్గవ తరగతి వేతన జీవులకు కనీసం జీతం రూ. 18000 గా ,గరిష్ట వేతనం రూ.2.25లక్షలుగా ఉండనుంది. 2017 నుంచి జనవరి నుంచి వీటిని అమలు చేయనున్నట్టు ఆ అధికారి ప్రకటించారు. రానున్న కీలక ఎన్నికల నేపథ్యంలో సీఎం అఖిలేశ్ ఉద్యోగులను ఈ వరాలను ప్రకటించిన ట్టుతెలుస్తోంది.