సాక్షి, ఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌పై నిపుణుల ప్యానల్ కీలక సిఫార్సులు చేసింది. కరోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాత టీకా తీసుకుంటే మంచిందని ఎన్‌టీఏజీఐ సూచించింది. ఈ వ్యవధిని గతంలో ఆరు నెలలుగా సూచించిన ఎన్‌టీఏజీఐ.. ఇప్పుడు తొమ్మిది నెలలకు పెంచింది. ప్రస్తుతం 9 నెలల వ్యత్యాసం ఉండాలని సూచించింది.
ఈ ప్రతిపాదనలను ఎన్‌టీఏజీఐ.. కేంద్రానికి పంపింది. కరోనా బారినపడి కోలుకున్నవారు తొలి డోసు టీకాకు ఎక్కువ కాలం గ్యాప్ ఉంటే మంచిందని ప్యానెల్ తెలిపింది. తొమ్మిది నెలల అనంతరం టీకా తీసుకోవడం ద్వారా శరీరంలో అధిక మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని పేర్కొంది.
చదవండి: భారత్: తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు
సింగపూర్ వేరియంట్ థర్ఢ్‌వేవ్ కు కారణం కావచ్చు: కేజ్రీవాల్
Comments
Please login to add a commentAdd a comment