మా వాడే.. కోరుకున్న చోటుకు పంపండి! | Recommendations of TDP leaders in the transfer of teachers | Sakshi
Sakshi News home page

మా వాడే.. కోరుకున్న చోటుకు పంపండి!

Published Sun, Oct 20 2024 5:27 AM | Last Updated on Sun, Oct 20 2024 5:27 AM

Recommendations of TDP leaders in the transfer of teachers

టీచర్ల బదిలీల్లో టీడీపీ నేతల సిఫారసుల పర్వం  

లేఖలు పరిశీలించాలని డీఈవోలకు ఆదేశాలు 

సాక్షి, అమరావతి: అప్పుడూ ఇప్పుడూ అని లేదు టీడీపీ నాయకులు లేటర్‌ ఇస్తే అదే ఆర్డర్, వారు ఎప్పుడు చెబితే అప్పుడు వారు లేఖలిచ్చిన ఉపాధ్యాయు­లను బదిలీ చేయాల్సిందే. విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలు గడిచిన తర్వాత సిఫారసు బదిలీలకు తెరతీశారు. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా ఇన్‌చార్జులు ఇచ్చిన సిఫారసు లేఖ­లతో ఉపాధ్యాయులు విద్యాశాఖ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమకు సిఫారసు ఉందని, తాము కోరుకున్న చోటకు బదిలీ, డెప్యూటేషన్‌ చేయాలని కోరుతున్నారు. 

ఈ క్రమంలో విద్యా సంవత్సరం మధ్యలో అందించిన సిఫారసులపై ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. విద్యాశాఖలోని ఉన్నతాధికారులపై టీడీపీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా లేఖలను పరిశీలించి అవకాశం కల్పించాలని రాష్ట్ర కార్యాల­యం నుంచి డీఈవోలకు ఆదేశాలు అందడం గమనార్హం. ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో దాదాపు 9 వేల మంది ఉపాధ్యాయులను ఇటీవల బదిలీ చేశారు. 

కూటమి నాయకులు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలు ఉన్నవారికి నిబంధనల ప్రకారం అర్హత లేకున్నా వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. అప్ప­టికే ఒక యూనిట్‌ పరీక్షలు పూర్తవడంతో పాటు దాదాపు 30 శాతం సిలబస్‌ సైతం పూర్తయ్యాక.. విద్యా సంవత్సరం మధ్యలో ఈ బదిలీల పర్వం చేప­ట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ ప్రక్రియ ముగియగానే ఇప్పుడు తాజాగా నేతల సిఫారసులతో వందల్లో ఆశావహులు రావడం మొదలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement