teachers tranfers
-
మా వాడే.. కోరుకున్న చోటుకు పంపండి!
సాక్షి, అమరావతి: అప్పుడూ ఇప్పుడూ అని లేదు టీడీపీ నాయకులు లేటర్ ఇస్తే అదే ఆర్డర్, వారు ఎప్పుడు చెబితే అప్పుడు వారు లేఖలిచ్చిన ఉపాధ్యాయులను బదిలీ చేయాల్సిందే. విద్యా సంవత్సరం మొదలై నాలుగు నెలలు గడిచిన తర్వాత సిఫారసు బదిలీలకు తెరతీశారు. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా ఇన్చార్జులు ఇచ్చిన సిఫారసు లేఖలతో ఉపాధ్యాయులు విద్యాశాఖ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తమకు సిఫారసు ఉందని, తాము కోరుకున్న చోటకు బదిలీ, డెప్యూటేషన్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో విద్యా సంవత్సరం మధ్యలో అందించిన సిఫారసులపై ఏం చేయాలో తెలియక ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. విద్యాశాఖలోని ఉన్నతాధికారులపై టీడీపీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయా లేఖలను పరిశీలించి అవకాశం కల్పించాలని రాష్ట్ర కార్యాలయం నుంచి డీఈవోలకు ఆదేశాలు అందడం గమనార్హం. ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో దాదాపు 9 వేల మంది ఉపాధ్యాయులను ఇటీవల బదిలీ చేశారు. కూటమి నాయకులు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలు ఉన్నవారికి నిబంధనల ప్రకారం అర్హత లేకున్నా వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. అప్పటికే ఒక యూనిట్ పరీక్షలు పూర్తవడంతో పాటు దాదాపు 30 శాతం సిలబస్ సైతం పూర్తయ్యాక.. విద్యా సంవత్సరం మధ్యలో ఈ బదిలీల పర్వం చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ ప్రక్రియ ముగియగానే ఇప్పుడు తాజాగా నేతల సిఫారసులతో వందల్లో ఆశావహులు రావడం మొదలైంది. -
Hyderabad: ఫిలింనగర్ పాఠశాలకు టీచర్లు కావలెను!
ఫిలింనగర్: రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ లేని సమస్యను ఫిలింనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుర్కొంటోంది. ఈ పాఠశాలకు చెందిన 22 మంది టీచర్లు ఒకేసారి బదిలీ కావడానికి గల కారణాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మూడురోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ టీచర్ల మూకుమ్మడి బదిలీలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 948 మంది విద్యార్థులున్న ఈ బడిలో ఇప్పుడు హెచ్‌ఎంతోపాటు ఇంకొక టీచర్ మాత్రమే మిగిలారు. కొత్తగా విద్యార్థులు చేరడం లేదు. బోధన సాగడంలేదు. ఇక్కడ తెలుగు మీడియం బోధనను పూర్తిగా తొలగించారు. పదో తరగతిలోని తెలుగు మీడియం విద్యార్థులను ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడంతో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. ఈ పాఠశాలకు రావడానికి టీచర్లు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఒక్క ఈ పాఠశాలకే టీచర్లు ఎందుకు రావడం లేదు, ఉన్న టీచర్లు ఎందుకు వెళ్లారు.. అన్నదానిపై విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే స్కూల్లో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. హైదరాబాద్ హల్చల్ ఒకే చోట.. క్లిక్ చేయండి -
AP: టీచర్లకు గుడ్‌న్యూస్.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ప్రీసూ్కల్, హైసూ్కల్, హైసూ్కల్ ప్లస్ స్థాయిలో సబ్జెక్ట్ ఉపాధ్యాయులు, గ్రేడ్–2 ప్రధానోపాధ్యా యుల పోస్టులను బదిలీలతో భర్తీ చేసేందుకు అనువుగా సోమవారం జీవో నంబర్ 47 జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2025 మే 31 లేదా అంతకుముందే ఉద్యోగ విరమణ చేసేవారికి వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేపట్టనుంది. వీరుకాకుండా 2022–23 విద్యా సంవత్సరం నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ మేనేజ్మెంట్ సరీ్వస్‌లో కొనసాగుతున్నారో.. ఆ విభాగంలోనే బదిలీ అవుతారు. ఎన్సీసీ/స్కౌట్ ఆఫీసర్లు ఆ పోస్టులు ఉన్న చోటకే.. ఎన్సీసీ/స్కౌట్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆయా పోస్టులు ఉన్న పాఠశాలలకే బదిలీ చేస్తారు. లేదంటే అక్కడే కొనసాగుతారు. వారి అభ్యర్థన మేరకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని, వారు ప్రభుత్వ/స్థానిక సంస్థల పాఠశాలల్లో చేరిన తేదీ నుంచి సర్వీస్‌ను లెక్కించి అవకాశం ఉన్నవారికి బదిలీ చేసే అవకాశం కల్పించారు. 40 శాతం దృష్టి లోపం ఉన్న వారు, 75 శాతం శారీరక వైకల్యం ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. వారు బదిలీ కోరుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పేరెంట్ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లాలనుకునేవారు వాటిలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి వారి మాతృ సంస్థ లోని సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటారు. మున్సిపల్ స్కూళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు పురపాలక శాఖ అ«దీనంలోని స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీకి ప్రత్యేక మార్గదర్శకాలను విద్యాశాఖ జారీ చేస్తుంది. మొత్తం బదిలీ ప్రక్రియలో పాత స్టేషన్ పాయింట్ల ఆధారంగానే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రస్తుత స్టేషన్ పాయింట్లు పరిగణనలోకి తీసుకోరని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐటీడీఏ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్–ఐటీడీఏ ఉపాధ్యాయులు ఐటీడీయేతర పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, వారికి బదిలీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఖాళీల్లో వీరికి అవకాశం కల్పిస్తారు. పాత జిల్లాలనే యూనిట్‌గా పరిగణిస్తారు. స్టేషన్, ప్రత్యేక పాయింట్లు, జాబితా ఖరారు, ఖాళీల నోటిఫికేషన్ తర్వాతే బదిలీ ప్రక్రియకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాంతం ఆధారంగా స్టేషన్ పాయింట్లు - ప్రాంతం ఆధారంగా స్టేషన్ పాయింట్లను కేటాయించారు. కేటగిరీ 4 ఉన్న ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఏడాది సరీ్వస్‌కు 5 పాయింట్ల చొప్పున, కేటగిరీ 1, 2, 3లో పనిచేసిన వారికి ఏడాదికి 1, 2, 3 పాయింట్ల చొప్పున కేటాయించారు. - ప్రత్యేక కాంపిటెంట్ అథారిటీల ద్వారా ఉ పాధ్యాయుల సీనియారిటీ, వెబ్ ఆప్షన్స్ ఆ ధారంగా బదిలీ ప్రక్రియ ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు కూడా ఆ స్థాయిలోనే జారీ చేస్తారు. - ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల బదిలీలు జోనల్ స్థాయిలో (విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, వైఎస్సార్ జిల్లా) జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గాను, ఆర్జేడీ మెంబర్ సెక్రటరీగాను, ఆయా జిల్లాల డీఈవోలు సభ్యులుగా ఉన్న కమిటీ చేపడుతుంది. - జిల్లా పరిషత్ పాఠశాలల్లో హెచ్ఎం/టీచర్ల బదిలీలను జిల్లా పరిషత్ చైర్మన్/స్పెషల్ ఆఫీసర్ చైర్మన్‌గాను, ఆర్జేడీ మెంబర్ సెక్రటరీగా, జెడ్పీ సీఈవో మెంబర్, డీఈవో సభ్యులుగా ఉన్న కమిటీ చేపడుతుంది. - ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కలెక్టర్/జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గాను, డీఈవో కార్యదర్శి/మెంబర్స్‌గా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. - ఉపాధ్యాయుల్లో భార్య/భర్త ప్రభుత్వ ఉద్యో గంలో ఉన్నా, అవివాహిత మహిళా హెచ్ఎంలు, దివ్యాంగులు మొదలైన వారికి ప్రత్యేక పాయింట్లు కేటాయించింది. బదిలీ ప్రక్రియలో ఏ ఇద్దరికి సమాన పాయింట్లు వచి్చ నా వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. ఇది కూడా చదవండి: ఎల్లో మీడియా ఓవరాక్షన్ -
హెచ్‌ఎంలతోనే సమస్య
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒప్పుకుంటేనే బదిలీల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లొచ్చని విద్యాశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వారిని పరిగణనలోనికి తీసుకోని పక్షంలో కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇదే అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వానికి వివరించినట్టు తెలిసింది. ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో పదోన్నతులైనా కల్పించాలని కొన్ని సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాశాఖ నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. ఇప్పటివరకూ అన్ని కేటగిరీల టీచర్లకు సీనియారిటీని బట్టి పదోన్నతులు ఇవ్వాలని భావించారు. ఇందుకు అనుగుణంగానే సీనియారిటీ జాబితాను రూపొందించారు. అయితే, హెచ్ఎంల విషయంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. వీరికి ఎంఈవోలుగా పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. అదీగాక, ఎంఈవో, డిప్యూటీ డీఈవో వంటి పర్యవేక్షణ పోస్టుల విషయంలో ఉపాధ్యాయుల మధ్య వివాదం పరిష్కారం కాలేదు. నిబంధనల ప్రకారం పర్యవేక్షణ పోస్టులు తమకే ఇవ్వాలని ప్రభుత్వ హెచ్ఎంలు కోరుతున్నారు. స్థానిక సంస్థల పరిధిలోని బడుల్లో ఉన్న హెచ్ఎంలకు పర్యవేక్షణ పోస్టులు ఇవ్వాల్సిందేనని మరికొంత మంది కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో హెచ్ఎంల పదోన్నతుల ప్రక్రియ జటిలంగానే మారింది. ప్రస్తుతం పదోన్నతులు కల్పిస్తే స్కూల్ అసిస్టెంట్లు.. హెచ్ఎంలు అవుతారు. వారికి ఉన్న స్కూళ్లను కేటాయించి, ఇప్పుడున్న హెచ్ఎంలను ఎంఈవోలుగా ప్రమోట్ చేయకుండా, ఎక్కడికి పంపుతారనే ప్రశ్న తెరమీదకొచ్చింది. కాబట్టి ఈ విషయంలో అంగీకారం వస్తేనే బదిలీలు, పదోన్నతుల అంశం ముందుకెళ్తుందని అధికారులు అంటున్నారు. ఏప్రిల్‌లో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొన్ని సంఘాలు చెబుతున్నా, ముందస్తు ఎన్నికల భయం వారిని వెంటాడుతోంది. సెలవుల్లో టెన్త్ పేపర్ల మూల్యాంకన విధులుంటాయి. ఆ తర్వాత ఎన్నికల గంట మోగితే బదిలీలు, ప్రమోషన్లు లేనట్టేనని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. బదిలీలు, పదోన్నతులు రెండూ ఒకేసారి చేపట్టాలని, లేని పక్షంలో తమకు న్యాయం జరగదని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి రాజాభాను చంద్రప్రకాశ్ చెప్పారు. -
TS: టీచర్ల దంపతుల కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీచర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. టీచర్ల దంపతుల కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే, తెలంగాణలో టీచర్ల దంపతులను ఒకే చోటకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాలో దంపతుల బదిలీలకు తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 247 మంది టీచర్ల బదిలీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి 27(రేపటి) నుంచి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. -
మమ్మల్ని కలపండి సారూ
సాక్షి, హైదరాబాద్, ఖైరతాబాద్: తమ పిల్లలతో సహా ఉపాధ్యాయ దంపతుల ఆందోళన, దీక్ష,.. ప్రతిగా పోలీసుల అరెస్టులు.. తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో.. ఏం జరుగుతోందో తెలియక చిన్నారుల రోదనలు.. వెరసి శనివారం హైదరాబాద్‌లో స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దంపతులు నిర్వహించిన ధర్నాలో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. 13 జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయ దంపతులు తమ పిల్లలతో కలిసి వచ్చి బదిలీలకు సంబంధించిన జీవో 317కి వ్యతిరేకంగా పాఠశాల డైరెక్టర్(డీఎస్సీ) కార్యాలయం ముందు మౌనదీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ దంపతుల్ని కలపండి... ముఖ్యమంత్రి మాటను నిలపండి’... ‘భార్యా భర్తలను, పిల్లలను విడదీయకండి’... ‘అమ్మ అటు ... నాన్న ఇటు.. మరి నేను ఎవరివైపు???’అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. భార్య ఒకచోట, భర్త ఒక చోట ఉద్యోగం చేసే పరిస్థితికి స్వస్తి చెప్పి, ఒకే దగ్గర కలిసి ఉండేలా స్పౌస్ బదిలీలు నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2100 మంది బాధితులు... 615 మందికే స్పౌస్ బదిలీ! దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరుగుతున్నాయని నిరసన దీక్ష సందర్భంగా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. 30 శాతం మందికే దంపతుల బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని వాపోయారు. రసాభాసగా మౌనదీక్ష ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పరిస్థితి రసాభాసగా మారింది. తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో పిల్లలకు అక్కడ ఏం జరుగుతోందో తెలియక విలపిస్తూ ఉండిపోయారు. దీంతో తల్లులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లుల, పిల్లల రోదనలతో కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 513మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్, బేగం బజార్, నారాయణగూడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని నేతలు వివేక్, కాదర్, కృష్ణ, నరేష్, మమత, త్రివేణి, సుజాత స్పష్టం చేశారు. పోలీసుల అరెస్టులను తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ ఆలీ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నా ... సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్ లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే స్పౌజ్ బదిలీ కోసం దర ఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో 252 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే... 28 మంది ఎస్జీటీలు మాత్రమే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీ దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా, 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకటి రెండు క్యాడర్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్ అప్పీళ్ళు అన్నిటినీ క్లియర్ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయుల వాదన. సీఎం కేసీఆర్ వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు. -
టీచర్ల బదిలీ దరఖాస్తులకు గడువు పెంపు
సాక్షి, అమరావతి: టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించి పలు సవరణలు చేస్తూ పాఠశాల విద్యా శాఖ శనివారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. బదిలీల దరఖాస్తు గడువు తక్కువగా ఉందని.. పొడిగించాలని వచ్చిన వినతుల మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఈ సవరణ షెడ్యూల్ జారీ చేశారు. కొత్త షెడ్యూల్ ఇలా.. ►ఆన్లైన్ దరఖాస్తు, డౌన్లోడ్ కాపీని ఎంఈవో, డెప్యూటీ ఈవోలకు సమర్పణ: జూలై 16 వరకు ►ఎంఈవో, డెప్యూటీ ఈవోలు దరఖాస్తులను పరిశీలించి డీఈవోకు సమర్పణ: జూలై 17–21 ►దరఖాస్తులపై డీఈవో పరిశీలన: జూలై 22–27 ►పాఠశాల విద్య డైరెక్టర్‌కు జాబితా సమర్పణ: జూలై 29 ►డైరెక్టర్ పరిశీలన, తుది జాబితా తయారీ: జూలై 30– ఆగస్టు 6 ►ప్రభుత్వానికి తుది జాబితా సమర్పణ: ఆగస్టు 9 -
బదిలీల గంట మోగింది..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం నుంచి జూన్ 15 వరకు బదిలీల షెడ్యూల్ ఖరారు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఒకే చోట ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని కచ్చితంగా బదిలీ చేయనున్నారు. కనీసం రెండేళ్లకు పైబడి ఒకేచోట ఉన్న వారే బదిలీలకు అర్హులవుతారు. ఏ కేడర్‌లోనైనా బదిలీలు 40 శాతం మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత జిల్లాలు, జోనల్, మల్టీ జోనల్ కేడర్‌కు అనుగుణంగానే బదిలీల ప్రక్రియ చేపడతారు. భార్యాభర్తలు, 2019 మే నెలాఖరులోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు, 70 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలున్న వారు, కారుణ్య నియామకాల కింద ఉద్యోగం పొందిన వితంతువులు, తీవ్ర అనారోగ్యానికి గురైన వారు, దీర్ఘకాలంగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. బదిలీల కోసం ఉద్యోగుల నుంచి ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా పారదర్శక విధానంలో ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమున్న మేరకు మారుమూల ప్రాంతాల్లో పనిచేసేందుకు వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వకపోతే లాటరీ పద్ధతిలో ఉద్యోగులను ఎంపిక చేసి బదిలీ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నుంచే అన్ని విభాగాల ఖాళీల వివరాలు, కచ్చితంగా బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి ప్రచురిస్తారు. జూన్ 16 నుంచి నిషేధం అమల్లోకి జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉద్యోగులు బదిలీ కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఐదు ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది. 6వ తేదీ నుంచి 12 వరకు దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తి చేస్తారు. 13 నుంచి 15 వరకు బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి. బదిలీ అయిన ఉద్యోగులను ఆయా శాఖలు మూడు రోజుల్లోగా రిలీవ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే రిలీవ్ చేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 16 నుంచి సాధారణ బదిలీలపై నిషేధం మళ్లీ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. రాష్ట్రస్థాయి పోస్టుల బదిలీలకు ఆయా శాఖల కార్యదర్శుల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. మల్టీ జోనల్ పోస్టులకు సంబంధిత శాఖాధిపతి, జిల్లా కేడర్ పోస్టులకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీలు బదిలీ ప్రక్రియను చేపడుతాయి. విద్య, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీ, పోలీస్ శాఖలు బదిలీలకు విడిగా విధానాలు రూపొందించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. -
బదిలీలలో ‘పనితీరు’ నిబంధనపై టీచర్ల ఆగ్రహం
ఏలూరు (పశ్చిమగోదావరి) : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పనితీరును ఆధారంగా చేసుకుని బదిలీల కౌన్సిలింగ్ చేపట్టడం వల్ల ఉపాధ్యాయుల్లో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.