టీచర్ల బదిలీ దరఖాస్తులకు గడువు పెంపు | AP: Extension Of Deadline For Transfer Applications Of Teachers | Sakshi
Sakshi News home page

టీచర్ల బదిలీ దరఖాస్తులకు గడువు పెంపు

Published Sun, Jul 4 2021 2:48 AM | Last Updated on Sun, Jul 4 2021 7:39 AM

AP: Extension Of Deadline For Transfer Applications Of Teachers - Sakshi

సాక్షి, అమరావతి: టీచర్ల అంతర్‌ జిల్లా బదిలీలకు సంబంధించి పలు సవరణలు చేస్తూ పాఠశాల విద్యా శాఖ శనివారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. బదిలీల దరఖాస్తు గడువు తక్కువగా ఉందని.. పొడిగించాలని వచ్చిన వినతుల మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు ఈ సవరణ షెడ్యూల్‌ జారీ చేశారు.

కొత్త షెడ్యూల్‌ ఇలా..
ఆన్‌లైన్‌ దరఖాస్తు, డౌన్‌లోడ్‌ కాపీని ఎంఈవో, డెప్యూటీ ఈవోలకు సమర్పణ: జూలై 16 వరకు
ఎంఈవో, డెప్యూటీ ఈవోలు దరఖాస్తులను పరిశీలించి డీఈవోకు సమర్పణ: జూలై 17–21
దరఖాస్తులపై డీఈవో పరిశీలన: జూలై 22–27
పాఠశాల విద్య డైరెక్టర్‌కు జాబితా సమర్పణ: జూలై 29
డైరెక్టర్‌ పరిశీలన, తుది జాబితా తయారీ: జూలై 30– ఆగస్టు 6
ప్రభుత్వానికి తుది జాబితా సమర్పణ: ఆగస్టు 9  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement