
బదిలీలలో ‘పనితీరు’ నిబంధనపై టీచర్ల ఆగ్రహం
ఏలూరు (పశ్చిమగోదావరి) : ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి పనితీరు ఆధారంగా పాయింట్లు కేటాయించే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ పనితీరును ఆధారంగా చేసుకుని బదిలీల కౌన్సిలింగ్ చేపట్టడం వల్ల ఉపాధ్యాయుల్లో వైషమ్యాలు పెరుగుతాయన్నారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.