![TS Govt Green Signal For Teachers Spouses Category Transfers - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/26/Teacher-Transfers.jpg.webp?itok=lkgg7gke)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీచర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. టీచర్ల దంపతుల కేటగిరీ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది.
అయితే, తెలంగాణలో టీచర్ల దంపతులను ఒకే చోటకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిపివేసిన 12 జిల్లాలో దంపతుల బదిలీలకు తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, సూర్యాపేట మినహా 12 జిల్లాల్లో 247 మంది టీచర్ల బదిలీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, జనవరి 27(రేపటి) నుంచి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment