AP Govt Gives Green Signal To Transfer Of Teachers - Sakshi
Sakshi News home page

AP: టీచర్లకు గుడ్‌న్యూస్‌.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

Published Tue, May 23 2023 6:55 AM | Last Updated on Tue, May 23 2023 9:18 AM

AP Govt Gives Green Signal To Transfer Of Teachers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచి్చంది. ప్రీసూ్కల్, హైసూ్కల్, హైసూ్కల్‌ ప్లస్‌ స్థాయిలో సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు, గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యా యుల పోస్టులను బదిలీలతో భర్తీ చేసేందుకు అనువుగా సోమవారం జీవో నంబర్‌ 47 జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

2025 మే 31 లేదా అంతకుముందే ఉద్యోగ విరమణ చేసేవారికి వారి అభ్యర్థన మేరకు బదిలీలు చేపట్టనుంది. వీరుకాకుండా 2022–23 విద్యా సంవత్సరం నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకున్న ఇతర ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు ఏ మేనేజ్‌మెంట్‌ సరీ్వస్‌లో కొనసాగుతున్నారో.. ఆ విభాగంలోనే బదిలీ అవుతారు.  

ఎన్‌సీసీ/స్కౌట్‌ ఆఫీసర్లు ఆ పోస్టులు ఉన్న చోటకే.. 
ఎన్‌సీసీ/స్కౌట్‌ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆయా పోస్టులు ఉన్న పాఠశాలలకే బదిలీ చేస్తారు. లేదంటే అక్కడే కొనసాగుతారు. వారి అభ్యర్థన మేరకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకుని, వారు ప్రభుత్వ/స్థానిక సంస్థల పాఠశాలల్లో చేరిన తేదీ నుంచి సర్వీస్‌ను లెక్కించి అవకాశం ఉన్నవారికి బదిలీ చేసే అవకాశం కల్పించారు. 40 శాతం దృష్టి లోపం ఉన్న వారు, 75 శాతం శారీరక వైకల్యం ఉన్నవారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. వారు బదిలీ కోరుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. పేరెంట్‌ మేనేజ్‌మెంట్‌లోకి వెళ్లాలనుకునేవారు వాటిలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి వారి మాతృ సంస్థ లోని సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటారు.   

మున్సిపల్‌ స్కూళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు 
పురపాలక శాఖ అ«దీనంలోని స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీకి ప్రత్యేక మార్గదర్శకాలను విద్యాశాఖ జారీ చేస్తుంది. మొత్తం బదిలీ ప్రక్రియలో పాత స్టేషన్‌ పాయింట్ల ఆధారంగానే ప్రక్రియ కొనసాగుతుందని, ప్రస్తుత స్టేషన్‌ పాయింట్లు పరిగణనలోకి తీసుకోరని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐటీడీఏ పాఠశాలల్లో పనిచేస్తున్న నాన్‌–ఐటీడీఏ ఉపాధ్యాయులు ఐటీడీయేతర పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, వారికి బదిలీ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఖాళీల్లో వీరికి అవకాశం కల్పిస్తారు. పాత జిల్లాలనే యూనిట్‌గా పరిగణిస్తారు. స్టేషన్, ప్రత్యేక పాయింట్లు, జాబితా ఖరారు, ఖాళీల నోటిఫికేషన్‌ తర్వాతే బదిలీ ప్రక్రియకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.   

ప్రాంతం ఆధారంగా స్టేషన్‌ పాయింట్లు 
- ప్రాంతం ఆధారంగా స్టేషన్‌ పాయింట్లను కేటాయించారు. కేటగిరీ 4 ఉన్న ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఏడాది సరీ్వస్‌కు 5 పాయింట్ల చొప్పున, కేటగిరీ 1, 2, 3లో పనిచేసిన వారికి ఏడాదికి 1, 2, 3 పాయింట్ల చొప్పున కేటాయించారు.  
- ప్రత్యేక కాంపిటెంట్‌ అథారిటీల ద్వారా ఉ పాధ్యాయుల సీనియారిటీ, వెబ్‌ ఆప్షన్స్‌ ఆ ధారంగా బదిలీ ప్రక్రియ ఉంటుంది. బదిలీ ఉత్తర్వులు కూడా ఆ స్థాయిలోనే జారీ చేస్తారు.  
- ప్రభుత్వ స్కూళ్ల ప్రధానోపాధ్యాయుల బదిలీలు జోనల్‌ స్థాయిలో (విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, వైఎస్సార్‌ జిల్లా) జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గాను, ఆర్జేడీ మెంబర్‌ సెక్రటరీగాను, ఆయా జిల్లాల డీఈవోలు సభ్యులుగా ఉన్న కమిటీ చేపడుతుంది. 
- జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో హెచ్‌ఎం/టీచర్ల బదిలీలను జిల్లా పరిషత్‌ చైర్మన్‌/స్పెషల్‌ ఆఫీసర్‌ చైర్మన్‌గాను, ఆర్జేడీ మెంబర్‌ సెక్రటరీగా, జెడ్పీ సీఈవో మెంబర్, డీఈవో సభ్యులుగా ఉన్న కమిటీ చేపడుతుంది.  
- ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ కలెక్టర్‌/జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గాను, డీఈవో కార్యదర్శి/మెంబర్స్‌గా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. 
- ఉపాధ్యాయుల్లో భార్య/భర్త ప్రభుత్వ ఉద్యో గంలో ఉన్నా, అవివాహిత మహిళా హెచ్‌ఎంలు, దివ్యాంగులు మొదలైన వారికి ప్రత్యేక పాయింట్లు కేటాయించింది. బదిలీ ప్రక్రియలో ఏ ఇద్దరికి సమాన పాయింట్లు వచి్చ నా వారి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు.   

ఇది కూడా చదవండి: ఎల్లో మీడియా ఓవరాక్షన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement