ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫ్పారీస్ మూడు స్టాకులపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. ఫినోలాక్స్ ఇండస్ట్రీస్, కేఈఐ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ అందులో ఉన్నాయి. ఈ 3షేర్లకు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేర్ల టార్గెట్ ధరలను పెంచింది. ఈ 3 షేర్లు మార్చి కనిష్టస్థాయిల నుంచి 29-71శాతం లాభపడ్డాయి. ఇప్పుడు ఈ 3కంపెనీల షేర్లపై బ్రోకరేజ్ సంస్థ విశ్లేషణలను చూద్దాం..!
1.ఫినోలాక్స్ ఇండస్ట్రీస్: ఈ క్యూ4లో కంపెనీ అమ్మకాలు 21శాతం క్షీణించగా, నికరలాభం 39శాతం నష్టాన్ని చవిచూసింది. వార్షిక ప్రాతిపాదిక ఈ క్వార్టర్‌లో పైప్స్‌లు/పీవీసీ రెసిస్ అమ్మకాల వాల్యూమ్స్ 20శాతం క్షీణించాయి. అయితే ఇదే సమయంలో పైప్‌ల విభాగపు మార్జిన్ అధిక స్థాయిలో మెరుగైంది. ఎర్నింగ్ గణాంకాలు బలహీనంగా ఉన్నప్పటికీ.., కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఇప్పటికీ బలంగానే ఉంది. నికర రుణం ఈక్విటీ నిష్పత్తి 0.03గా ఉంది. నేపథ్యంలో షేరు గతంలో కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ., షేరు టార్గెట్ ధరను రూ.500కు పెంచింది. ఈ షేరు మార్చి కనిష్టం నుంచి 71.4శాతంగా రికవరిని సాధించింది.
2.కేఈఐ ఇండస్ట్రీస్: సంస్థకు అప్పులు తక్కువగా ఉన్నాయి. వినియోగ సామర్థ్యం 60-65శాతాన్ని చేరుకుంది. వినియోగం ఇంజనీరింగ్ ఎగుమతులు పెరుగుతున్నాయి. ఎగుమతుల దృష్ట్యా డిమాండ్ వైపు ఆర్డర్లు పుంజుకుంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు సవాళ్లను ఎదుర్కోవడానికి కంపెనీకి గల బలమైన బ్యాలెన్స్ షీట్ సహకరిస్తుంది. ఈ సానుకూల పరిణామాలతో షేరు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్ ధరను రూ.400కు పెంచడమైంది. మార్చి కనిష్టం నుంచి షేరు 68శాతం లాభపడింది.
3.ఐసీఐసీఐ బ్యాంక్: నాణ్యమైన అస్తులను కలిగి ఉంది. ప్రస్తుత ధర వాల్యూయేషన్ ఆకర్షణీయంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంక్ ఇటీవల తన అనుబంధ సంస్థలో వాటాను విక్రయించి రూ.3900 కోట్లను సమీకరించింది. గత కొంతకాలంగా ప్రైవేట్‌రంగ బ్యాంక్ సెక్టార్లో కెల్లా మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. బ్రోకరేజ్ సంస్థ షేరు గతంలో కేటాయించిన రూ.450ల కొనుగోలు టార్గెట్ ధరను రూ.460కి పెంచింది. ఈ టార్గెట్ ధర ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 25శాతం అధికంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment