అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న భారత ఈక్విటీ మార్కెట్ ఈ వారంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని ఎస్‌ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ రిసెర్చ్ హెడ్ షితిజ్ గాంధీ అంచనా వేశారు. మార్కెట్లో పట్టును సాధించే క్రమంలో బుల్స్, బేర్ మధ్య జరుగుతున్న తీవ్ర పోరాటంలో నిఫ్టీ ఇండెక్స్ 10000-9700 పరిమితి శ్రేణిలో కదలాడవచ్చని ఆయన అన్నారు.
‘‘డెరివేటివ్స్ విభాగంలో కాల్ రైటర్లు 10వేల కాల్ స్ట్రైక్ వద్ద భారీ ఓపెన్ ఇంట్రెస్ట్‌ను బిల్డప్ చేశారు. ఈ స్థాయి నిఫ్టీకి కీలక నిరోధంగా పనిచేయవచ్చు. అలాగే నిఫ్టీకి 9800 వద్ద, 9700 వద్ద పుట్ రైటింగ్ తక్కువగా జరిగింది. ఈ నేఫథ్యంలో డౌన్‌సైడ్ ట్రెండ్‌లో ఈ స్థాయిలు కీలక మద్దతు స్థాయిలుగా మారవచ్చు.’’ అని షితిజ్ తెలిపారు. టెక్నికల్ కోణంలో పరిశీలిస్తే స్టాక్ ఆధారిత యాక్షన్‌తో మార్కెట్లో రానున్న రోజుల్లో అస్థిరత నెలకొని ఉంటుందని సెంకడరీ ఓసిలేటర్లు సూచిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ విషయానికొస్తే, 19,600-20,600 శ్రేణిలో కన్సాలిడ్ అవ్వోచ్చు. ఏదైనా సైడ్ బ్రేక్ మార్కెట్‌కు మరింత దిశానిర్దేశం చేయవచ్చని షితీజ్ అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన 3నుంచి 4వారాల కాలపరిమితిలో 10-13శాతం రాబడులను ఇచ్చే 3స్టాక్స్‌లను ఆయన సిఫార్సు చేస్తున్నారు.
షేరు పేరు: రాలీస్ ఇండియా
రేటింగ్: కొనవచ్చు
టార్గెట్ ధర: రూ.295
స్టాప్ లాస్: రూ.240
అప్‌సైడ్: 11శాతం
విశ్లేషణ: గడచిన 3వారాల నుంచి ఈ షేరు రూ.200-230 శ్రేణిలో కన్సాలిడేట్ అవుతోంది. ఈ శ్రేణి డైలీ ఛార్ట్‌లో దాని స్వల్ప, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్‌ల కంటే అధికంగా ఉన్నాయి. ధీర్ఘకాలిక కన్సాలిడేషన్ ఛార్ట్స్‌లో దీర్ఘచతురస్ర ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. ఈ వారం, షేరు అధిక వాల్యూమ్‌లతో నిర్వచించిన పరిధి కంటే కన్సాలిడేషన్ బ్రేక్‌అవుట్ ఇచ్చింది. కాబట్టి ట్రేడర్లు రూ.240 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.295 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.260-265 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు.
షేరు పేరు: గోద్రేజ్ ఆగ్రోవేట్
రేటింగ్: బై
టార్గెట్ ధర: రూ.483
స్టాప్ లాస్: రూ.385
అప్ సైడ్: 13శాతం
విశ్లేషణ: ఈ ఏడాది మార్చిలో 300 స్థాయికి పతనమైన తర్వాత, షేరు తన కనిష్టస్థాయిల నుంచి వేగంగా రికవరిని సాధించింది. డైలీ ఛార్ట్‌లో 100 రోజుల ఎక్స్‌పోన్షియల్ మూవింగ్ యావరేజ్కంటే మరోసారి మూమెంటం ఊపందుకుంది. అదనంగా, దాదాపు 7-వారాల సుదీర్ఘ కన్సాలిడేట్ తర్వాత అధిక వాల్యూమ్స్‌తో ధరల వేగం పుంజుకుంది. కాబట్టి ట్రేడర్లు రూ.385 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.483 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.420-425 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు.
షేరు పేరు: బర్గర్ పేయింట్స్
రేటింగ్: బై
టార్గెట్: రూ.555
స్టాప్ లాస్: రూ.468
అప్ సైడ్: 10శాతం
విశ్లేషణ: ఈ స్టాక్ డైలీ ఛార్టులలో దాని స్వల్ప, దీర్ఘకాలిక మూవింగ్ యావరేజ్‌ల కంటే స్థిరంగా ఉంది. టెక్నికల్ పాయింట్ కోణంలో స్టాక్ డైలీ చార్టులలో కప్ అండ్ హ్యాండిల్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేసింది. సెంకడరీ ఓసిలేటర్ల ప్యాట్రన్లు షేరు అప్‌సైడ్ ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. కాబట్టి ట్రేడర్లు రూ.468 స్థాయిని స్టాప్‌లాస్ పెట్టుకొని రూ.555 స్థాయి టార్గెట్ లక్ష్యంగా రూ.500-505 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment