కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ(లోక్‌సభ) వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు ఓ లేఖను రాశారు. దేశంలోని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో తాగునీటి సదుపాయం కల్పించాలని అందుకు తగిన నిధులను ఈ బడ్డెట్‌లో కేటాయించేలా చూడాలని తాను తోమర్‌ను కోరినట్లు చెప్పారు. ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ పథకం కింద ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీటి సరఫరాను చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు.