
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ సమయంలో గ్రామీణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చర్చించేందుకు నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాష్ట్రాల గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామీణ పేదలకు అందుతున్న ప్రభుత్వ పథకాలు, జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్రమంత్రి సమీక్షించారు. ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మరే రాష్ట్రంలో లేనంతగా ఏప్రిల్‌లో 66.33 లక్షల పనిదినాలు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించామని, అర్హులైన పేదలకు రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment