న్యూఢిల్లీ: దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంపులో భాగంగా మరిన్ని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీవో) ఏర్పాటు ను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. సోమవారం సీఐఐ–ఎన్‌సీడీఈఎక్స్ ఎఫ్‌పీవో సమ్మిట్ నిర్వహించిన సదస్సులో మంత్రి ఈ విషయం వెల్లడించారు. రూ.6,865 కోట్ల పెట్టుబడితో 10వేల ఎఫ్‌పీవోల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. ఇవి పనిచేయడం ప్రారంభిస్తే క్లస్టర్ ఆధారంగా ఒక్కో జిల్లా ఒక్కో వ్యవసాయ ఉత్పత్తిలో ప్రత్యేకత సాధిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment