‘సొరంగం’ పూర్తిచేయడమే లక్ష్యం | 'Tunnel' target completion | Sakshi
Sakshi News home page

‘సొరంగం’ పూర్తిచేయడమే లక్ష్యం

Published Sat, Dec 6 2014 3:28 AM | Last Updated on Mon, Oct 29 2018 8:31 PM

‘సొరంగం’ పూర్తిచేయడమే లక్ష్యం - Sakshi

‘సొరంగం’ పూర్తిచేయడమే లక్ష్యం

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి
 కనగల్: శ్రీశైలం సొరంగ మార్గం పూర్తిచేయడమే లక్ష్యమని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొరంగం పూర్తయితేనే జిల్లాను పీడిస్తున్న ఫ్లోరోసిస్ భూతంతో పాటు రైతులను సాగు నీరందనుందన్నారు. శ్రీశైలం సొరంగం నిర్మాణం పనులు ఇప్పటికే అరవై శాతం పూర్తయ్యాయని వివరించారు. 2007 శ్రీశైలం సొ రంగం నిర్మాణానికి 2 వేల కోట్ల ను మంజూరు చేయించానన్నారు. మిగతా పనుల పూర్తికి  ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశా ల్లో  రెండు గంటలు చర్చించామన్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీర్ స్పందించి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి సొరంగం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. రాబోయే మూడేళ్లలో సొరంగాన్ని పూర్తిచేసి రైతులకు నిరంతరం రెండు పంటలకు సాగు నీరందించడమే ధ్యేయమన్నారు.

ఇప్పటికే సుమారు 15 కోట్ల పంచాయతీరాజ్ నిధులు మండలంలోని వివిధ లింక్‌రోడ్ల అభివృద్ధికి  మం జూరైనట్లు వివరిం చారు. ఇటీవల మంజూరైన పొనుగోడు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మూడు మాసాల్లో నిర్మా ణం పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చర్లగౌరారం, చెట్లచెన్నారం గ్రామాలకు సైతం త్వరలోనే సబ్ స్టేషన్లు మంజూరు కానున్నట్లు తెలిపారు. నాలుగేళ్లపాటు అభివృద్ధి ఆ తర్వా తే రాజకీయాలన్నారు. అభివృద్ది పనుల నిధుల మం జూరికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తున్నానని, పార్టీ మా రడానకి కాదని స్పష్టం చేశారు. జి.చెన్నారం శ్రీబ్రమరాం బిక మల్లికార్జున స్వా మి ఆలయ అభివృద్ధికి  10 వేల విరాళం అందజేశారు.

ఆలయం నిర్మాణ క్రమంలో మరో లక్ష అందజేస్తాన న్నారు. అంతకుముందు పర్వతగిరి ఫీడర్ చానల్‌పై ఉన్న శిథిల బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో  జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీని వాస్‌గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ భిక్షంయాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, సర్పంచులు పావనీవెంకటే శం, సునీతావేంకన్న, యాదయ్య, పెంటయ్య, పెద్దులు, లింగయ్య, ఎంపీటీసీలు సునితాకృష ్ణయ్య, హఫీజొద్దీన్,రాజీవ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement