
టైటిల్ పోరుకు బోపన్న జంట
స్టుట్‌గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా జంట 6-3, 6-7 (6/8), 10-7తో రెండో సీడ్ జిమోనిచ్ (సెర్బియా) -మట్కోవ్‌స్కీ (పోలండ్) జోడీపై సంచలన విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట 11 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినప్పటికీ... నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.