Mercedes Cup
-
చాంప్ బోపన్న జంట
స్టుట్గార్ట్ (జర్మనీ) : నిలకడైన ఆటతీరుతో రాణించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది నాలుగో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. తన భాగస్వామి ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)తో కలిసి అతను మెర్సిడెస్ కప్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న-మెర్జియా ద్వయం 5-7, 6-2, 10-7తో మూడో సీడ్ అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంటపై విజయం సాధిం చింది. విజేతగా నిలిచినందుకు బోపన్న జోడీకి 31,770 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 22 లక్షల 94 వేలు)తోపాటు 250 పాయింట్లు లభించాయి. బోపన్న కెరీర్లో ఇది 14వ డబుల్స్ టైటిల్ కాగా... మెర్జియాతో కలిసి ఇది రెండో టైటిల్. -
టైటిల్ పోరుకు బోపన్న జంట
స్టుట్గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) ద్వయం ఫైనల్లోకి అడుగుపెట్టింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా జంట 6-3, 6-7 (6/8), 10-7తో రెండో సీడ్ జిమోనిచ్ (సెర్బియా) -మట్కోవ్‌స్కీ (పోలండ్) జోడీపై సంచలన విజయం సాధించింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట 11 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. రెండో సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినప్పటికీ... నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో బోపన్న ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.