
చాంప్ బోపన్న జంట
స్టుట్‌గార్ట్ (జర్మనీ) : నిలకడైన ఆటతీరుతో రాణించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాది నాలుగో డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. తన భాగస్వామి ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా)తో కలిసి అతను మెర్సిడెస్ కప్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న-మెర్జియా ద్వయం 5-7, 6-2, 10-7తో మూడో సీడ్ అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంటపై విజయం సాధిం చింది. విజేతగా నిలిచినందుకు బోపన్న జోడీకి 31,770 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 22 లక్షల 94 వేలు)తోపాటు 250 పాయింట్లు లభించాయి. బోపన్న కెరీర్‌లో ఇది 14వ డబుల్స్ టైటిల్ కాగా... మెర్జియాతో కలిసి ఇది రెండో టైటిల్.