‘‘నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను ప్రధానంగా తీసుకుని సమాజానికి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘మెకానిక్’ సినిమాని ప్రజలందరూ ఆదరించాలి. ఈ మూవీ ద్వారా ఫ్లోరైడ్ సమస్య, బాధితుల బాధలు సమాజానికి అర్థమవుతాయి. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా ముని సహేకర దర్శకత్వం వహించిన చిత్రం ‘మెకానిక్’. ఎం. నాగమునెయ్య (మున్నా) నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేశారు. ‘‘మా చిత్రంలో అన్ని వాణిజ్య అంశాలు ఉన్నాయి. మంచి సందేశాత్మక చిత్రం ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment