KTR condolence to Nalgonda fluorosis victim Amshala Swamy passes away - Sakshi
Sakshi News home page

Amshala Swamy: నల్లగొండ ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి మృతి.. కేటీఆర్ సంతాపం..

Jan 28 2023 10:03 AM | Updated on Jan 28 2023 10:51 AM

Nalgonda Fluorosis Victim Amshala Swamy Passes Away KTR - Sakshi

నల్లగొండ: ఫ్లోరోసిస్ బాధితుడు అంశల‌ స్వామి శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.  ఫ్లోరోసిస్ విముక్తి పోరాటంలో స్వామి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. స్వామి‌ తన గుండెళ్లో చిరస్థాయిగా గుర్తుంటారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గతంలో అంశల‌స్వామి ఇంట్లో కేటీఆర్ భోజనం చేశారు. ఆయనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లును కూడా మంజూరు చేయించారు.

అంశల స్వామి బైక్ ప్రమాదానికి గురై తలకు గాాయాలు కావడం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన చాలా సంవత్సరాలుగా అనేక అంశాలపై గళమెత్తి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
చదవండి: 2,391 కొత్త ఉద్యోగాలకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement