- ఫ్లోరైడ్ విరుగుడుకు భూగర్భజలాలు పెంచాలి
- కలెక్టర్ చిరంజీవులు
- మల్లాపురంలో శ్రీసత్యసాయి మంచినీటి పథకం ప్రారంభం
పెద్ద అడిశర్లపల్లి, న్యూస్‌లైన్, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిరంజీవులు అన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండ లం మల్లాపురంలో భగవాన్ శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సత్యసాయి ప్రేమామృతధార’ మంచినీటి పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పారు. మురుగునీటి పారుదల కోసం నిర్మించిన డ్రెయినేజీలను శుభ్రంగా ఉంచాలన్నారు.
ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు భూ గర్భజలాలను పెంచాలన్నారు. ఎక్కువలో తులోనుంచి బోర్లద్వారా నీటిని తోడడం వల్ల ఫ్లోరిన్ సమస్య తీవ్రమవుతుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి అన్ని గ్రామాల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలని, చెట్లను పెంచాలని సూచించారు. సత్యసాయి సేవాసమితి 5 లక్షల వ్యయంతో స్వచ్ఛం దంగా గ్రామంలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. త్వరలో అన్ని గ్రామాలకు కృష్ణాజలాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాట బృందం, గ్రామస్తులు కలెక్టర్‌కు ఘనస్వాగతం పలి కారు.
అనంతరం మహిళలు సాయివ్రతాలు ఆచరించారు. అలాగే భక్తులకు అన్నదానం చేశారు. సత్యసాయి మండల సేవాసమితి కన్వీనర్ కల్వకొల్లు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణారావు, సేవాదళ్ కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జి.రాజయ్య, ఎంపీడీఓ బి.నర్సింగరావు, సత్యసాయి సేవాసమితి సభ్యులతో పాటు సర్పంచ్ ఆర్.శంకర్‌నాయక్, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కార్యదర్శి చలమయ్య, వెంకటయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం
Published Tue, May 20 2014 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement