ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుతాం | to change the district Fluoride-free district | Sakshi
Sakshi News home page

ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చుతాం

Published Tue, May 20 2014 3:41 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM

to change the district Fluoride-free district

భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్ : ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చడమే టీఆర్‌ఎస్ లక్ష్యమని, అందుకు కేసీఆర్ కంకణబద్దులై ఉన్నారని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లోరైడ్ నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, అంగవైకల్యం తో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు కృష్ణాజలాలు అందించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, త్వరలోనే జిల్లాకు ఫ్లోరైడ్ పీడ విరుగడ అవుతుందని చెప్పారు. కేసీఆర్‌తో భువనగిరిలోని నిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. పార్టీ మేనిఫెస్టోను అమలు చేసి రాజ కీయ అవినీతి లేకుండా చేస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని చెప్పారు. తనను గెలిపించి వారికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు మైనం శ్రీనివాస్, మాలే శరణ్యారెడ్డి, నాగార్జున, సాయి, వెంకన్న పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement