
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఈ నెల 8న నల్లగొండలో రాజకీయ సంకల్ప సభ నిర్వహించనున్నారు. అదే రోజు బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నారని సమాచారం. ఈ సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి పూదరి సైదులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సభకు ముఖ్యఅతిథిగా బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ హాజరుకానున్నారు. బహిరంగ సభకు ఎటువంటి వాహనాలు ఏర్పాటు చేయట్లేదని, ప్రవీణ్‌కుమార్ అభిమానులు, స్వేరో కార్యకర్తలు స్వచ్ఛందం గా వస్తారని సైదులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment