వర్షంలోనూ యాత్ర కొనసాగిస్తున్న ప్రవీణ్‌కుమార్
పర్వతగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను ముంచి బుల్లెట్ ్రçపూఫ్ కార్యాలయాలు కట్టుకుంటున్నారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా యాత్ర కొనసాగించారు.
పర్వతగిరి అంబేడ్కర్ సెంటర్ వద్ద ఆయన మాట్లాడుతూ పేదలు ఉండడానికి ఇళ్లు లేవని, దొరలు గడీలు, ఫామ్‌హౌస్‌లు నిర్మించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 1,300మంది అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఒకే కుటుంబం వారు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, పరిశ్రమల ఏర్పాటులో పోగు చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కొందరి చేతిలో బందీగా ఉన్న తెలంగాణను అందరి తెలంగాణగా మార్చేందుకు బహుజన సమాజ్‌వాది పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బహుజనులంతా ఐక్యం కావాలన్నారు. కాళేశ్వరం మునిగినట్లే కేసీఆర్ మునగడం త«థ్యమన్నారు. అనంతరం ఆయన అన్నారం షరీఫ్ యాకుబ్‌బాబా దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment