బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ | RS Praveen Kumar joins BRS Comments On Congress CM Revanth | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

Published Mon, Mar 18 2024 4:52 PM | Last Updated on Mon, Mar 18 2024 7:05 PM

RS Praveen Kumar joins BRS Comments On Congress CM Revanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు సమక్షంలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు బీఆర్ఎస్ పార్టీ  కండువా కప్పి కేసీఅర్ పార్టీలోకి ఆహ్వానించారు. 

అంతకు ముందు.. తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌.. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్ హౌస్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మీడియాతో తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్‌లో చేరుతున్నానని  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ గేట్లు తెరిస్తే వెళ్లిన గొర్రెల్లాగా వచ్చిన వ్యక్తిని కాదని ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌. గజ్వేల్‌లోని మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్ హౌస్‌కు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘నిజాయితీకి కట్టుబడి ఉన్నా. ఓ వైపు మంచివాడు అంటూ నన్ను రేవంత్‌ రెడ్డి విమర్శిస్తున్నారు. స్వార్దం కోసం ఎన్ని కోట్లు తీసుకొని వెళ్తున్నావు అంటూ సోషల్ మీడియాలో అడుగుతున్నారు.డబ్బు కోసం ఆశపడిన వాడిని అయితే కాంగ్రెస్‌లో చేరుతా. బీఆర్ఎస్‌ కాదు. టీఎస్‌పీఎస్సీ చైర్మర్‌ ఆఫర్‌ ఇస్తే.. తిరస్కరించా. నా గుండెల్లో ఎప్పుడూ బహుజన వాదం ఉంటుంది. నేనెప్పుడూ బహుజనులు సంక్షేమం కోసమే పోరాడుతా. రేవంత్ రెడ్డే కాదు నేను కూడా పాలమూరు బిడ్డనే’ అని ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

ఇక.. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌కు బయలుదేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇతర టీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు అభిమానులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement